మై హోమ్ సంస్థకు రెండు అంతర్జాతీయ సేఫ్టీ అవార్డులు లభించాయి. యూకేకు చెందిన బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ నిర్మాణ రంగంలో ఇంటర్నేషనల్ సేఫ్టీ అవార్డు, అమెరికాకు చెందిన వరల్డ్ సేఫ్టీ ఫోరం ఇంటర్నేషనల్ సేఫ్టీ అవార్డుల్ని అందుకున్నది. ఈ మేరకు ఆదివారం సంస్థ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలియజేసింది. 2021లో కార్మికులు, కార్యాలయాను ఆరోగ్యంగా, సురక్షితంగా ఉంచడంలో నిబద్ధతను చూపెట్టినందుకు మై హోమ్ సంస్థకు బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ ప్రకటించింది.
ప్రపంచవ్యాప్తంగా సుమారు 549 సంస్థలు వివిధ రంగాల్లో అవార్డుల్ని గెలుచుకున్నాయి. ఇందులో మైహోమ్ కూడా ఉండటం విశేషం. ఈ సందర్భంగా బ్రిటీష్ సేఫ్టీ కౌన్సిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మైక్ రాబిన్సన్ మాట్లాడుతూ.. మై హోమ్ సంస్థ.. ఉద్యోగులకు గాయాలు, అనారోగ్యాలు లేకుండా ఉంచినందుకు, నిబద్ధత మరియు కృషికి గుర్తింపుగా ఈ అవార్డు లభించిందని తెలిపారు.
కొవిడ్ కాలంలో కార్మికుల శ్రేయస్సు మరియు ఉద్యోగులందరి భద్రత కోసం మై హోమ్ నిబద్ధతను గ్లోబల్ సేఫ్టీ సమ్మిట్ ప్రశంసించింది. నిర్మాణ రంగంలో అత్యుత్తమ భద్రత కోసం 2021 సంవత్సరానికి వరల్డ్ సేఫ్టీ ఫోరమ్ & గ్లోబల్ సేఫ్టీ సమ్మిట్ నుండి ఇంటర్నేషనల్ సేఫ్టీ అవార్డును మై హోమ్ గెలుచుకుంది.
ఈ సందర్భంగా డీబీవీఎస్ఎన్ రాజు మాట్లాడుతూ, చైర్మన్ ఆలోచన విధానాలకు అనుగుణంగా.. భద్రతా బృందం మొత్తం తమ ఉద్యోగులు మరియు కాంట్రాక్టు కార్మికులలో భద్రతా సంస్కృతిని తీసుకురావడానికి అంకితభావంతో పని చేశారనిపేర్కొన్నారు.“మై హోమ్ కన్స్ట్రక్షన్స్ సైట్‌లలో ఎక్కడైనా ఎవరైనా పని చేసేటప్పుడు గాయపడకూదు. దీన్ని సాధించడానికి కేవలం చట్టాన్ని పాటించడం కంటే ఎక్కువ అవసరం; దీని అర్థం కార్మికులు ఆరోగ్యంగా మరియు భద్రతాపరంగా మెరుగ్గా ఉండాలన్నది సంస్థ ప్రధాన ఉద్దేశ్యం
This website uses cookies.