ఆయనో రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అధికారిక సమావేశాలతో నిత్యం బిజీబిజీగా ఉంటారు. క్షణం తీరిక లేకుండా ప్రభుత్వ అధికారులు, పార్టీ శ్రేణులతో సమావేశాల్ని నిర్వహిస్తారు. అయినప్పటికీ, ఆయన ఒక నిర్వాసితుల సంఘం సమస్యల్ని ఓపికగా విన్నారు. అక్కడి గృహ యజమానుల ఇబ్బందుల్ని కనుగొని వాటికి పరిష్కారం చూపెట్టారు.
గ్రేటర్ నొయిడాలోని గౌతమ్ బుద్ధ నగర్ కు చెందిన నివాసితులు ఎదుర్కొంటున్న సమస్యల్ని దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యానాథ్ ఓపికగా విన్నారు. ఇంటి నమోదు ప్రక్రియ, క్రీడా సదుపాయాల మెరుగుదల, ఫ్లాట్ల అప్పగింత ఆలస్యం వంటి అంశాల్లో అక్కడి ఇంటి యజమానులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ఓపికగా విన్నారు. అంతేకాదు, వాటిని పరిష్కరిస్తానని హామీ కూడా ఇచ్చారు. ” మాకు సమయాన్ని కేటాయించడంతో పాటు.. సమస్యల్ని ఓపికగా విని.. పరిష్కరిస్తానని సీఎం మాటిచ్చార”ని గ్రేటర్ నొయిడా నివాసితుల సంఘం అధ్యక్షుడు అభిషేక్ కుమార్ తెలిపారు. ఈ సంఘ సభ్యులతో పాటు స్థానిక ఎమ్మెల్యే ధీరేంద్ర సింగ్ సమావేశంలో పాల్గొన్నారు.