కరోనా కారణంగా హైదరాబాద్లో ఫ్లాట్ల అప్పగింత ఆలస్యం అవుతుందా? అంటే.. ఔననే సమాధానం వినిపిస్తోంది. కొవిడ్ రెండు వేవ్ ల కారణంగా హైదరాబాద్తో పాటు మిగతా పట్టణాల్లో ఫ్లాట్ల అప్పగింత ఆలస్యమయ్యే అవకాశముందని తెలుస్తోంది. హైదరాబాద్లో ఎంతలేదన్నా యాభై శాతానికి పైగా ఫ్లాట్లు ఏడాది నుంచి రెండేళ్ల పాటు ఆలస్యం అవుతుందని సమాచారం.
కొంత విరామంలో రెండు కరోనా వేవుల వల్ల కార్మికులు సొంతూర్లకు వెళ్లిపోయారు. బ్యాంకులు రుణాల మంజూరు ఆలస్యం చేస్తోంది. నిర్మాణం రంగం ఎదుర్కొంటున్న సమస్యల నుంచి గట్టెక్కాలంటే కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలనే విన్నపం దేశవ్యాప్త నిర్మాణ సంస్థల నుంచి వినిపిస్తోంది. అయితే, ఇదే అదనుగా భావించి కొన్ని నిర్మాణ సంస్థలు కావాలనే ఆలస్యం చేసే అవకాశం లేకపోలేదు. ఏదీ ఏమైనా, కేంద్ర ప్రభుత్వం నిర్మాణ రంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.