Categories: TOP STORIES

దిగుమతుల నుంచి.. ఎగుమతులకు ఎదిగాం

  • వర్మోరా టైల్స్ ప్రపంచంలో ఎక్కడైనా దొరుకుతాయి
  • 106 దేశాలకు ఎగుమతులు చేస్తున్నాం..
  • 14 దేశాల్లో షోరూమ్‌లు ఉన్నాయి
  • చిన్న టైల్స్ నుంచి పెద్ద పెద్ద టైల్స్ వరకు తయారు చేస్తున్నాం
  • రియల్ ఎస్టేట్ గురుతో వర్మోరా టైల్స్ డీజీఎం రాఘవేంద్రరావు

 

ఇంటికి వన్నె తెచ్చే టైల్స్ ను ఒకప్పుడు దిగుమతి చేసుకునేవారమని.. అలాంటిది ఇప్పుడు మనమే ఎగుమతి చేసే స్థాయికి ఎదిగామని వర్మోరా టైల్స్ డీజీఎం రాఘవేంద్రరావు పేర్కొన్నారు. టైల్స్ కు సంబంధించి పలు అంశాలపై ఆయన రియల్ ఎస్టేట్ గురుతో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..

‘వర్మోరా అనేది 30 ఏళ్ల కంపెనీ. మోర్బీలోనే లీడింగ్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ. మేం సుపీరియర్ క్వాలిటీ ఇస్తాం. టైల్స్ తయారీలో మాన్యుఫ్యాక్చరింగ్, ప్రాసెసింగ్, మిషనరీ అనేవి కూడా చాలా ముఖ్యం. మన దగ్గర ఉన్న మిషనరీ ఏమిటి? ఎలాంటి క్వాలిటీ రా మెటీరియల్ ఉపయోగిస్తున్నారనే అంశాలపై టైల్స్ ధర ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం 300 బై 300 అనేది బేసిక్ సైజ్. అక్కడ నుంచి 10 ఫీట్ బై 5.5 ఫీట్ సైజు వరకు దొరుకుతాయి.

అలాగే 9 ఎంఎం థిక్ నెస్ నుంచి 15 ఎంఎం థిక్ నెస్ వరకు ఉంటాయి. ప్రస్తుతం 2 ఫీట్ బై 4 ఫీట్ అనేది సాధారణంగా వినియోగిస్తున్నారు. ఇప్పుడు పెద్ద పెద్ద ఫ్లాట్లు వస్తున్నాయి. అలాంటి వాటికి 8 ఫీట్ బై 4 ఫీట్ టైల్స్ వినియోగిస్తున్నారు. పూర్తిగా హై గ్లాస్ టైల్స్ వస్తాయి. ఇంపోర్టెడ్ గ్లేజింగ్ వల్ల టైల్స్ అందం మరింత ఇనుమడిస్తుంది. ఇతర టైల్స్, వర్మోరా టైల్స్ పక్కపక్కన పెట్టి చూస్తే తేడా సులభంగా గుర్తిస్తారు.

ఒకప్పుడు ఇటలీ నుంచి టైల్స్ దిగుమతి చేసుకునేవాళ్లం. ప్రస్తుతం మనం ఇక్కడి నుంచి ఎగుమతి చేస్తున్నాం. ముఖ్యంగా వర్మోరా టైల్స్ 106 దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. 14 దేశాల్లో వర్మోరా ప్రత్యేక షోరూమ్ లు ఉన్నాయి. భారత్ లో దాదాపు 3500 ఔట్ లెట్లు ఉన్నాయి. ఎక్కడకు వెళ్లినా వర్మోరా దొరుకుతుంది. అందరూ అన్ని సైజులు మెయింటైన్ చేయలేరు. కానీ వర్మోరాలో అన్నీ మెయింటైన్ చేస్తాం. వర్మోరా ప్రొడక్ట్ పోర్టిఫోలియో చాలా పెద్దది. వర్మోరా షోరూం గుజరాత్ లోని మోర్బీలో దాదాపు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. 12 వేలకు పైగా డిజైన్లు ఉండటం వర్మోరా ప్రత్యేకత. డిఫరెంట్ ప్రొడక్ట్స్, డిఫరెంట్ ఫినిషెస్ ఉన్నాయి.

వర్మోరా ఇంత ఆదరణ పొందడానికి ప్రధాన కారణం ఇన్నోవేషన్, ఆర్అండ్ డి. ఈ విషయంలో వర్మోరా సుపీరియర్. గ్లాసీ, మ్యాట్ అనేవి సాధారణంగా ఉంటాయి. కానీ వర్మోరా కొత్తగా 9 సర్పేసెస్ పరిచయం చేశాం. రాకర్ కలెక్షన్, జెమ్ కలెక్షన్, షైనీ సుగర్, గ్లోస్టర్, జీఎల్ఆర్, జీహెచ్ఆర్ ఫినిష్ వంటివి ఇందులో ఉన్నాయి. రకరకాల టెక్చర్లు కనువిందు చేసేలా ఉంటాయి. కారిడార్ ఏరియాకు వేరుగా, బాల్కనీ ఏరియాకు వేరుగా, బాత్ రూమ్ లకు వేరుగా కలెక్షన్ వర్మోరా దగ్గర ఉంటుంది. వర్మోరా టైల్స్ రూ.35 నుంచి 450 వరకు ఉంటాయి.

కస్టమర్ మా దగ్గరకు వచ్చినప్పుడు వారికి ఏమి కావాలో మేం అర్థం చేసుకుంటాం. వారికి ఎలాంటి టైల్స్ పట్ల ఆసక్తి ఉందో తెలుసుకుని, అందుకు అనుగుణంగా టైల్స్ చూపిస్తాం. వారు టైల్స్ అన్నీ పరిశీలించుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటారు. దాదాపు అన్ని రకాల బిల్డర్లు వర్మోరా టైల్స్ వినియోగిస్తారు.

ఎలాంటి భవనానికి అయినా సరిపోయే టైల్స్ కలెక్షన్ వర్మోరా దగ్గర ఉంటాయి. ఎలాంటి టైల్స్ అయినా సరే కచ్చితంగా దొరుకుతాయి. టైల్స్ కి వారెంటీ, గ్యారెంటీ అనేది ఉండదు. అయితే, నిర్దేశిత ప్రమాణాల ప్రకారమే వాటిని తయారు చేస్తాం. టైల్స్ ను అమర్చిన తర్వాత డ్యామేజీ అయ్యే అవకాశం చాలా తక్కువ.

రియల్ ఎస్టేట్ మార్కెట్ పరంగా వర్మోరా మంచి పొజిషన్ లో ఉంది. మార్కెట్ కు తగినట్టుగా అప్ గ్రేడ్ కావాలి. అందుకు అనుగుణంగా కొత్త కొత్త ప్రొడక్టులతో వస్తున్నాం. మాకు ప్రపంచంలోనే అత్యుత్తమ ఆర్ అండ్ డీ టీమ్ ఉంది. వారు ప్రతిరోజూ దీనిపైనే పని చేస్తుంటారు. కస్టమర్ ఏం కోరుకుంటున్నారో అది ఇచ్చే దిశగా కృషి చేస్తారు.

హైదరాబాద్ లో దాదాపు 60 శాతం మంది బిల్డర్లకు వర్మోరా టైల్స్ సరఫరా చేస్తున్నాం. మా క్వాలిటీ, సర్వీసుతో వారంతా వంద శాతం సంతృప్తిగా ఉన్నారు. ఇదే ఒరవడి కొనసాగిస్తాం. ఏసియాలోనే కొత్త టెక్నాలజీతో సరికొత్త ప్రొడక్ట్ తీసుకొస్తున్నాం. ఇటాలియన్ మార్బుల్ కు ప్రత్యామ్నాయంగా ఓ ప్రొడక్ట్ తెస్తున్నాం. అక్టోబర్ నుంచి అవి మార్కెట్లోకి అందుబాటులోకి వస్తాయి..

 

This website uses cookies.