భారతదేశంలోనే విశ్వసనీయమైన రియల్ ఎస్టేట్ కంపెనీగా వాసవి గ్రూప్ పేరు సంపాదించిందని.. దాదాపు ఎనభై లక్షల చదరపు అడుగుల స్థలాన్ని కొనుగోలుదారులకు అందించడమే ఇందుకు నిదర్శనమని వాసవి గ్రూప్ డైరెక్టర్లు అభిషేక్ చందా, సౌమ్యా చందా తెలిపారు. ఉగాది సందర్భంగా బాచుపల్లిలోని వాసవి అర్బన్‌లో నిర్వహించిన ఫెస్టివల్ ధమాకా ఆఫర్ మెగా లక్కీ డ్రాలో.. టాటా నెక్సన్ ఈవీ కారును ఇంద్రజిత్ నాయక్ గెలుచుకున్నట్లు ప్రకటించారు. వాసవి అర్బన్ ప్రాజెక్టులో మూడవ బ్లాకులోని 1004 నెంబరు గల ఫ్లాటును కొనుగోలు చేసిన ఆయన్ని అభినందించారు. డిసెంబరు 15 నుంచి మార్చి 22 వరకూ వాసవి అర్బన్‌లో 875 చదరపు అడుగుల ఫ్లాటును కొన్నవారూ ఈ లక్కీ డ్రాలో పాల్గొన్నారని తెలిపారు. ఈ క్రమంలో ఫ్లాటు కొన్నవారికి టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అందజేశామని చెప్పారు. ప్రతి రెండువారాలకోసారి గోల్డ్ కాయిన్లనూ అందజేశామన్నారు.
వాసవి అర్బన్ బాచుపల్లిలోని ప్రతిష్ఠాత్మకమైన గేటెడ్ కమ్యూనిటీ. సుమారు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో.. మూడు విలాసవంతమైన క్లబ్హౌజులను డెవలప్ చేస్తున్నారు. పన్నెండు టవర్లను 23 అంతస్తుల ఎత్తులో నిర్మిస్తున్నారు. రెండు స్విమ్మింగ్ పూళ్లు, మోడ్రన్ జిమ్, క్రికెట్ పిచ్‌లు, షటిల్ కోర్టులు, యోగా ఏరోబిక్ రూములు, ఇండోర్ మరియు ఔట్‌డోర్ కిడ్స్ ప్లే ఏరియాలు, మల్టీపర్పస్ హాల్ వంటివి పొందుపరుస్తున్నారు. మొత్తానికి, వాసవి అర్బన్‌లో నలభై ప్రపంచ స్థాయి సౌకర్యాలతో కూడుకున్న రెండు పడక గదుల లగ్జరీ ఫ్లాట్లను అందజేస్తున్నారు