- వాసవి సంస్థ బ్రాండ్ అంబాసిడర్
అయినందుకు సంతోషంగా ఉంది
- విజయ్ కుమార్ అనేకమంది బిల్డర్లకు స్ఫూర్తి
- నటుడు విక్టరీ వెంకటేష్..
- రెండు కొత్త ప్రాజెక్టుల బ్రోచర్ ఆవిష్కరణ
- వాసవి కార్పొరేట్ యాడ్ ఫిలిం విడుదల
- ప్రోగ్రాంను విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ
ధన్యవాదాలు తెలిపిన వాసవి డైరెక్టర్ అభిషేక్
వాసవి గ్రాండ్ లాంచ్‌కు విచ్చేసినందుకు సంతోషంగా ఉందని నటుడు విక్టరీ వెంకటేష్ అన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో వాసవి సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన ఏమన్నారో వెంకటేష్ మాటల్లోనే..
వాసవి గ్రూప్ గురించి మాట్లాడాలంటే ముందుగా వాసవి విజయ్ కుమార్ గారి గురించి మాట్లాడాలి. ఆయన దాదాపు మూడు దశాబ్దాల నుంచి నిర్మాణ రంగంలో ఉన్నారు. ఆయన అద్వితీయమైన పనితీరును ప్రదర్శించారు. ఆయన ప్రభావం వాసవిలోని ప్రతి ప్రాజెక్టులోనూ ప్రస్పుటంగా దర్శనమిస్తుంది. క్వాలిటీ, ఇన్నోవేషన్, కమ్యూనిటీ డెవలప్‌మెంట్ వంటి అంశాల్లో కనిపిస్తుంది. పదిహేడు కమర్షియల్ ప్రాజెక్టులు, ముప్పయ్ రెసిడెన్షియల్ ప్రాజెక్టుల్ని పూర్తి చేశారు. ప్రస్తుతం ఎనభై లక్షల కంటే అధిక విస్తీర్ణంలో పలు ప్రాజెక్టుల్ని నిర్మిస్తున్నారు. ఇప్పటిదాకా 25 వేల మంది ప్రజల సొంతింటి కలను సాకారం చేశారు. విజయ్ కుమార్ గారికి ఇండియన్ అచీవర్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. వాసవి సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా పని చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. వాసవి సంస్థ మోస్ట్ ప్రిఫర్డ్ బిల్డర్ అని చెప్పొచ్చు. వాసవి కార్పొరేట్ యాడ్ ఫిలింను విడుదల చేయడం సంస్థకు మైల్‌స్టోన్ వంటిది. వాసవి ఆవాసా, వాసవి భువి బిల్డాక్స్ వంటి ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందని ముగించారు.
ప్రస్తుతమున్న పోటీ ప్రపంచంలో హైదరాబాద్‌లో మూడు దశాబ్దాల పాటు నిర్మాణ రంగంలో ఉండటమంటే మాటలు కాదు. మనమంతా కలిసి విజయ్ కుమార్ గారికి శుభాకాంక్షలు తెలియజేయాలి. క్వాలిటీ మీద ఎక్కువ ఫోకస్ చేయాలని ఆయనెప్పుడు టీమ్ మెంబర్స్‌కు చెబుతుంటారు. పైగా అనేక మంది బిల్డర్లకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. మీరు ముప్పయ్యేళ్ల నుంచి చేస్తున్న గొప్ప పనిని ఇలాగే కొనసాగించాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ రోజు ఇక్కడికి విచ్చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది. నిబద్ధతతో పని చేస్తూ మంచి ఫలితాల్ని రాబడుతున్న వాసవి బృందానికి శుభాకాంక్షలు చెబుతున్నాను.
సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు
వాసవి సంస్థ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఎందుకంటే, మూడు గొప్ప విషయాలను చూడబోతున్నాం. ఇది మన సంస్థ ఎన్నో ఏళ్ల కష్ట ఫలం. అంతులేని నిబద్ధతకు నిలువుటెద్దు నిదర్శనం. అన్నింటి కంటే ముఖ్యంగా ఒక విషయం మీ అందరికీ చెప్పాలి. విజయాన్ని తన ఇంటి పేరుగా మల్చుకున్న వెంకటేష్.. వాసవి సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. మన సంస్థ కూడా అందుబాటు ధరలో నాణ్యమైన గృహాల్ని అందజేస్తోంది. అత్యుతమ సాంకేతిక విలువల్ని పాటిస్తూ, అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో ప్రాజెక్టుల్ని అందిస్తూ.. అందరి ఆదరాభిమానాల్ని పొందుతోంది. విక్టరీ వెంకటేష్ మన బ్రాండ్ అంబాసిడర్ కావడంతో.. వాసవి గ్రూప్ మరెంతో మంది ప్రజల హృదయాలను తాకుతూ.. అనేకమందికి చేరువ అవుతుందని ఆశిస్తున్నాను. విలాసవంతమైన ఇళ్లను కడుతూ.. ప్రజల సొంతింటి కలను తీర్చే విధంగా దూసుకెళదాం. నార్త్ హైదరాబాద్‌లో కొత్తగా రెండు ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నందుకు సంతోష పడుతున్నాను. కొంపల్లి బహుదూర్‌పల్లిలో గల మైసమ్మగూడ వద్ద ప్రశాంతమైన వాతావరణంలో.. వాసవి భువి ప్రాజెక్టును 10. 65 ఎకరాల్లో డెవలప్ చేస్తున్నాం. 17 అంతస్తుల ఎత్తులో ఎనిమిది టవర్లను నిర్మిస్తున్నాం.
ఇక రెండో ప్రాజెక్టును కొంపల్లిలోని ఖాజిగూడలో వాసవి ఆవాస ప్రాజెక్టును నిర్మిస్తున్నాం. ఇందులో ప్రతి విల్లా ఎంతో విలాసవంతమైనది. 59 విల్లాల్ని చూస్తే ఎవరైనా తమను తాము మైమర్చిపోతారు. ఇందులో ప్రతి విల్లా ఎంతో విలాసవంతమైనది. మానవ జీవనాన్ని మెరుగ్గా మార్చేసే విల్లాలు ఈ ప్రాజెక్టులో ఉండటం విశేషం. ఈ ప్రాజెక్టులో భాగమైన ప్రతిఒక్కరికి.. నిరంతరం శ్రమిస్తున్న అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. – ఎర్రం విజయ్ కుమార్, ఎండీ, వాసవి గ్రూప్
ఘనంగా రెండు ప్రాజెక్టులు
ఈ రోజు ఒక గొప్ప కార్యక్రమానికి నాందీ పలుకుతున్నాం. వాసవి గ్రూప్ తరఫున రెండు కొత్త ప్రాజెక్టులను ఘనంగా ప్రారంభోత్సవం చేశం. ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు కృషి చేసిన ప్రతిఒక్కరికీ నా ధన్యవాదాలు. వాసవి కోర్ టీమ్ సభ్యులు, వాసవి టీమ్ సిబ్బందికి, మేనేజ్‌మెంట్‌కి, బంధుమిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. – అభిషేక్ చందా, డైరెక్టర్, వాసవి గ్రూప్
నార్త్ హైదరాబాద్‌కి షాన్..
నార్త్ హైదరాబాద్‌లో వాసవి గ్రూప్ ఆరంభించిన నయా విల్లా ప్రాజెక్టే.. వాసవి ఆవాసా. సుమారు 6.27 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 59 విల్లాల్ని సంస్థ నిర్మిస్తోంది. క్లబ్ హౌజ్‌ను సుమారు 13,491 చదరపు అడుగుల్లో డెవలప్ చేస్తోంది. ఒక్కో విల్లాను సుమారు 4515 నుంచి 4669 చదరపు అడుగుల్లో అభివృద్ధి చేస్తోంది. లగ్జరీకే సరికొత్త చిరునామాగా ఈ ప్రాజెక్టు నిలుస్తుందని సంస్థ అంటోంది. ఇందులో లగ్జరీ లైఫ్ స్టయిల్ని ఆస్వాదించేందుకు సమస్త ఆధునిక సదుపాయాల్ని పొందుపరిచామని కంపెనీ చెబుతోంది. యాంఫీ థియేటర్, నెట్ క్రికెట్, బ్యాడ్మింటన్, యోగా స్పేస్, ఇండోర్ మరియు ఔట్‌డోర్ జిమ్ వంటివి డెవలప్ చేస్తారు. నార్త్ హైదరాబాద్‌లో వైబ్రంట్ కమ్యూనిటీలో నివసించాలని కోరుకునేవారికి ఈ విల్లా ప్రాజెక్టు చక్కగా నప్పుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
నార్త్ హైదరాబాద్‌లోని కొంపల్లిలో వాసవి సంస్థ
వాసవి బిల్డాక్స్ అనే లగ్జరీ కమ్యూనిటీని 10.65 ఎకరాల్లో చేపట్టింది. ఇందులో మొత్తం ఎనిమిది టవర్లు వస్తాయి. ఒక్కోటి పదిహేడు అంతస్తుల్లో కడతారు. 2, 2.5, 3 బీహెచ్‌కే ప్రీమియం ఫ్లాట్లను సంస్థ పొందుపర్చింది. ఇందులో వచ్చేవి 1208 ఫ్లాట్లే. అయినప్పటికీ, నివాసితులకు ఆధునిక సదుపాయాల్ని ఆస్వాదించాలనే ఉద్దేశ్యంతో.. రెండు క్లబ్ హౌజుల్ని సుమారు యాభై వేల చదరపు అడుగుల్లో డెవలప్ చేస్తోంది. టెన్నిస్ కోర్టులు, ఆధునిక జిమ్, మెడిటేషన్ గార్డెన్స్, స్విమ్మింగ్ పూల్స్, స్వ్కాష్ కోర్టు వంటివాటికి పెద్దపీట వేసింది. ఇందులో 65 శాతం ఓపెన్ ఏరియా ఉండేలా డిజైనింగ్‌లో వాసవి జాగ్రత్తల్ని తీసుకుంది.