Categories: EXCLUSIVE INTERVIEWS

క‌స్ట‌మ‌ర్లు.. కుటుంబ స‌భ్యుల‌తో స‌మానం

  • వ‌ర్టెక్స్ విరాట్ ప్రారంభోత్స‌వంలో
    సంస్థ ఎండీ వీవీఆర్ వ‌ర్మ‌
  • మియాపూర్ లో వర్టెక్స్ విరాట్
  • 1428 యూనిట్లతో కొత్త ప్రాజెక్టు లాంచ్

మియాపూర్ లో వర్టెక్స్ విరాట్ పేరుతో ఓ కొత్త ప్రాజెక్టు లాంచ్ అయింది. 8.75 ఎకరాల స్థలంలో జి ప్లస్ 30 అంతస్తుల్లో కళ్లు చెదిరే ఆరు ఆకాశహర్మాలు నిర్మితమవుతున్నాయి. 2, 3 బీహెచ్ కేల్లో 1340-2030 చదరపు అడుగుల మధ్యలో మొత్తం 1428 యూనిట్లు అందుబాటులోకి రానున్నాయి. అటు ప్రకృతి రమణీయత, ఇటు నగరానికి అత్యంత దగ్గరగా ఉండటం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. జిమ్, క్రెష్, గెస్ట్ రూమ్స్, స్పా అండ్ సెలూన్, మల్టీ పర్పస్ హాల్, బిజినెస్ లాంజ్, బ్యాడ్మింటన్ కోర్టులు, ప్రివ్యూ థియేట్, స్క్వాష్ కోర్టు, స్మిమింగ్ పూల్, యోగా, మెడిటేషన్ హాల్, వాకింగ్, జాగింగ్ ట్రాక్ వంటి ఎన్నో సదుపాయాలు.. గ్రాండ్ ఎంట్రన్స్ తో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. ఈ ప్రాజెక్టు ఆవిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వెర్టెక్స్ గ్రూప్ ఎండీ వీవీఆర్ వర్మ మాట్లాడారు.

మియాపూర్‌లో కొత్త‌గా ఆరంభించిన‌ వ‌ర్టెక్స్ విరాట్‌ సైట్ కు చారిత్రక నేపథ్యం ఉందని వెల్లడించారు. నాగార్జున గ్రూప్ చైర్మన్ కేవీకే రాజు గెస్ట్ హౌస్ ఇక్కడే కట్టారని.. ఇక్కడి నుంచే ఆయన తొలుత కంపెనీ కార్యకలాపాలు జరిగాయని పేర్కొన్నారు. అనంతరం ఆ కంపెనీ ఎంతో ఉన్నతస్థాయికి వెళ్లి లక్షల మందికి ఉపాధి కల్పించిందని చెప్పారు. ఇదే సైట్ ను అప్పటి సీఎం ఎన్టీఆర్ సందర్శించి.. ఈ వాతావరణాన్ని మెచ్చుకున్నారని వెల్లడించారు. అలాంటి సైట్ లో వర్టెక్స్ విరాట్ ప్రాజెక్టు లాంచ్ చేయడం ఆనందంగా ఉందన్నారు. ఇక వర్టెక్స్ కంపెనీని 1994లో ప్రారంభించామని.. 2004 కంటే ముందుగానే నిజాంపేటలో గేటెడ్ కమ్యూనిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. ఆ సమయంలోనే అతి తక్కువ మంది ఉన్న సమయంలోనే క్లబ్ హౌస్ కల్చర్ తీసుకొచ్చామని పేర్కొన్నారు.

ఇక వర్టెక్స్ విరాట్ లో మొత్తం 1428 యూనిట్లు ఉండగా.. అందులో దాదాపు 400 యూనిట్లు భూ యజమానులవని తెలిపారు. మిగిలిన వెయ్యికి పైగా యూనిట్లు కంపెనీవని.. వాటిలో ఇప్పటికే 350కి పైగా యూనిట్లు విక్రయించినట్టు చెప్పారు. చాలా తక్కువ సమయంలోనే ఇన్ని యూనిట్లు అమ్ముడు కావడంతో చాలా ఆనందంగా ఉందని వివరించారు. తమ కస్టమర్లు తమ కుటుంబ సభ్యులతో సమానమని.. వారిని సంతోషంగా ఉంచడమే తమ ధ్యేయమని వీవీఆర్ వర్మ స్పష్టం చేశారు.

This website uses cookies.