poulomi avante poulomi avante

ప‌దేళ్ల‌కు ఈఎంఐ ఎంత‌? 20 ఏళ్ల‌కు క‌ట్టాల్సిందెంత‌?

ల్యాండ్స్‌ రేట్స్‌ బాగా పెరిగిపోయాయ్‌. ఆ ప్రభావం ఇళ్ల ధరల మీద స్పష్టంగా ఉంది. అందుకే హైద్రాబాద్‌లో హౌసెస్‌ రేట్స్‌ చుక్కల్ని తాకుతున్నాయ్‌. నిజానికి ఏడెనిమిది ఏళ్ల క్రితం వరకు కూడా హైద్రాబాద్‌లో 40 నుంచి 60 లక్షల మధ్యలో మంచి టూ అండ్‌ త్రీ బీహెచ్‌కే ఫ్లాట్స్‌ దొరికేవి. ఆ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయ్‌. కరోనా తర్వాత హైద్రాబాద్‌లో ఓన్‌ హౌస్‌లకు డిమాండ్ పెరిగింది. మన దేశంలో మిడిల్‌ క్లాస్‌ సెక్షన్‌ కోసం ఇళ్లు నిర్మిస్తే.. మార్కెట్‌లో ఎప్పుడూ డిమాండ్‌ ఉంటుంది. అందుకే, అఫర్డబుల్‌ హౌసింగ్‌ సెగ్మెంట్‌కి ప్రాధాన్యత ఇస్తున్నారు డెవలపర్లు.

హైద్రాబాద్‌లో భారీ ప్రాజెక్ట్‌లు పెరిగిన మాట వాస్తవమే అయినప్పటికీ.. అంతటా ఈ ట్రెండ్‌ అయితే రాలేదు. వెస్ట్‌జోన్‌ మినహా నగరంలో మిగిలిన ఏరియాల్లో .. ఓఆర్‌ఆర్‌ చుట్టు పక్కల ఇంకా అందుబాటు ధరల్లో ఇళ్లు దొరుకుతున్నాయ్‌. ఓపిక‌గా వెతకాలే కానీ మంచి ప్రాజెక్ట్‌ల్లో 70 లక్షల నుంచి కోటి రూపాయల బడ్జెట్‌లో టూ బీహెచ్‌కే.. త్రీ బీహెచ్‌కే ఫ్లాట్స్‌ లభిస్తున్నాయ్‌.

కరోనా తర్వాత భయంకరంగా పెరిగిపోయిన వడ్డీ రేట్లు మిడిల్‌ క్లాస్‌ సెక్షన్‌ సొంతింటి ఆశల్ని చంపేశాయ్‌. కోవిడ్‌కు ముందు 4 శాతంగా ఉన్న ఆర్బీఐ రెపో రేటు.. తర్వాత 6.5 పర్సెంట్‌కి పెరిగింది. ఈ కారణంగా రుణ లభ్యత తగ్గిపోగా.. అధిక వడ్డీరేట్ల భయంతో హోమ్‌లోన్స్‌ తీసుకోవాలనుకునేవారు వెనకడుగు వేశారు. రీసెంట్‌గా ఆర్బీఐ రెపోరేటును 25 బేసిస్‌ పాయింట్స్‌ కట్‌ చేయడం.. ఫ్యూచర్‌లో రెపో రేటు కట్స్‌ మరిన్ని ఉంటాయనే ప్రచారాలు.. ఇళ్ల నిర్మాణానికి రుణాలు ఇస్తామని కేంద్రం ప్రకటించడం లాంటివి మళ్లీ అఫర్డబుల్‌ హౌసెస్‌కి డిమాండ్‌ సృష్టిస్తుందనే అంచనాల్ని పెంచాయ్‌.

బ్యాంక్‌లు ఇచ్చే హోమ్‌లోన్స్‌, వాటి మీద వడ్డీ రేట్లు, టెన్యూర్‌ రేంజ్‌ని బట్టి ఈఎమ్‌ఐల ఎలా ఉంటాయనే విషయానికొద్దాం. మీరు 70 లక్షలు పెట్టి డబుల్‌ బెడ్రూమ్‌ కొనుగోలు చేశారనుకుందాం. 15 లక్షల రూపాయలు డౌన్‌ పేమెంట్‌ చేసి మిగిలిన 55 లక్షల మొత్తం హోమ్‌లోన్‌ తీసుకుందామనుకున్నారు. ఎస్బీఐని సెలెక్ట్‌ చేసుకుంటే- ప్రస్తుతం వడ్డీ రేట్లు పర్‌ యానమ్‌ 8.5 నుంచి 9.65 శాతంగా.. హోమ్‌లోన్‌ టెన్యూర్‌ సంవత్సరం నుంచి 30 ఏళ్ల వరకు ఉంది. 8.5 శాతం వడ్డీ లెక్కేసుకుని.. లోన్‌ టెన్యూర్‌ను 10 ఏళ్లుగా ఫిక్స్‌ చేసుకుంటే- నెలకి 68 వేల 192 రూపాయలు కట్టాలి.

హెచ్‌డీఎఫ్‌సీలో అయితే 8.75 శాతం వడ్డీరేటుకి ప్రతి నెలా 68 వేల 930 రూపాయల ఈఎమ్‌ఐ పే చేయాలి. LIC హౌసింగ్‌ లోన్స్‌లో- 8.5 శాతం వడ్డీరేటుతో ఈఎమ్‌ఐ 54 వేల 161 రూపాయలు కట్టాలి. యాక్సిస్‌ బ్యాంక్‌లో 10 ఏళ్ల వ్యవధికి 8 శాతం వడ్డీరేటుతో ఈఎమ్‌ఐ 68 వేల 930 రూపాయలుగా ఉంది.

అదే 20 ఏళ్ల టెన్యూర్‌కి లోన్‌ తీసుకుంటే- ఎస్బీఐలో 8.5 శాతం ఇంట్రెస్ట్‌ రేట్‌తో 47 వేల 730 ఈఎమ్‌ఐ కట్టాలి. హెచ్‌డీఎఫ్‌సీలో 8.75 శాతం వడ్డీరేటుతో 48 వేల 604 రూపాయలుగా ఉంది. LIC హౌసింగ్‌ లోన్స్‌లో- 8.5 శాతం వడ్డీరేటుతో 47 వేల 730 రూపాయలు.. యాక్సిస్‌ బ్యాంక్‌లో 8 శాతం వడ్డీతో 46 వేల 4 రూపాయలు ఈఎమ్‌ఐ పే చేయాలి.

ఒకవేళ లోన్‌ గడువుని 25 ఏళ్లుగా నిర్ణయించుకుంటే- ఎస్బీఐలో 8.5 శాతం వడ్డీరేటుకి 44 వేల 287 రూపాయల ఈఎమ్‌ఐ పే చేయాలి. HDFCలో 8.75 శాతం ఇంట్రెస్ట్‌ రేట్‌తో 45 వేల 218 రూపాయలు.. LIC హౌసింగ్‌ లోన్స్‌లో- 8.5 శాతం వడ్డీరేటుతో 44 వేల 287 రూపాయలు.. యాక్సిస్‌ బ్యాంక్‌లో 8 శాతం ఇంట్రెస్ట్‌ రేటుతో 42 వేల 450 రూపాయలు ఈఎమ్‌ఐ కట్టాలి. అన్నీ మేజర్‌ బ్యాంక్‌లు గరిష్ఠంగా 30 ఏళ్ల టెన్యూర్‌ ఇస్తున్నాయ్‌.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles