poulomi avante poulomi avante

వేసవిలో ఇంటిని కూల్ గా ఉంచాలంటే ఏం చేయాలి?

భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. ఎండాకాలం పూర్తిగా రాకముందే ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 11 గంటల నుంచి ఎండ తీవ్రత తెలుస్తోంది. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ఇక ఏప్రిల్ నుంచి మరింతగా ఎండలు మండిపోనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇక ఎండాకాలం మొదలవ్వడంతో మూలన పెట్టిన కూలర్స్, కప్పి ఉంచిన ఏసీలను తీసి సరిచేస్తున్నారు చాలామంది. ఉక్కపోతని తట్టుకోలేక కూలర్లు, ఏసీల వాడకం అంతకంతకు పెరిగిపోతోంది. అయితే ఏసీలు అందరికీ ఇవి అందుబాటులో ఉండవు. ఉన్నప్పటికీ చాలా మందికి కరెంట్ బిల్లుతో భయం. దాంతో అటు ఏసీలను వాడలేక, ఇటు ఉక్కపోతతో ఉండలేక సతమతమవుతారు. కొన్ని చిట్కాలు ఫాలో అయితే, ఏసీలు, కూలర్స్ లేకపోయినా ఇంటిని చల్లగా ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

నేచురల్ వెంటిలేషన్

ఎండాకాలంలో మనం ఎంతగా ఏసీలు, కూలర్స్ వాడినప్పటికీ నేచురల్ గా బయట నుంచి వచ్చే గాలి చాలా ఉపశమనాన్ని ఇస్తుంది. నేచురల్ గాలి ఆరోగ్యానికి కూడా మంచిది. కాబట్టి ఉదయం, తిరిగి రాత్రి సమయంలో ఆ చల్లని గాలులు ఇంట్లోకి వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలి. దీని కోసం కిటికీలు, ఇంటి ద్వారాలు ఆ సమయాల్లో సాధ్యమైనంత వరకు తెరిచి ఉంచాలి. ఇక చెట్లు స్వచ్చ‌మైన చల్లని గాలిని ఇస్తాయి. కాబట్టి ఇంట్లో చెట్లు పెంచడం అలవాటు చేసుకోవాలి. ఇండోర్ ప్లాంట్స్ ఉంచడం వల్ల ఇళ్లు చాలా వరకూ కూల్ అవుతుంది. అంతే కాకుండా చెట్లు చుట్టూ ఉన్న గాలిని కూడా ప్యూరిఫై చేస్తాయి. తద్వార స్వఛ్చమైన ఆక్సీజన్ కూడా దొరుకుతుంది. ఇన్ని లాభాలున్నాయి కాబట్టే చెట్లని పెంచడం అలవాటు చేసుకోవాలని నిపుణులు చూచిస్తున్నారు.

కర్టెన్స్ వాడడం

ఉదయం 11 గంటల తరువాత ఇంట్లోకి ఎక్కువగా వేడిగాలులు వస్తుంటాయి. ఈ సమయంలో వీటి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఎక్కువగా కర్టెన్స్ వాడాలి. దీంతో ఎండ, వేడిగాలులు అంతగా ఇబ్బంది పెట్టవు, ఇన్‌స్యూలేటెడ్ గ్లాస్ తో కూడిన కిటికీలు కూడా రూమ్ టెంపరేచర్ పెరగకుండా చూస్తాయి. దీని వల్ల ఏసీ, కూలర్ లేకపోయినా రూమ్ చల్లగా ఉంటుంది. ఇంట్లోకి ఎండ, వడ గాలులు వచ్చే సమయాన్ని బట్టి కిటికీలు, కర్టెన్స్‌తో కవర్ చేసుకోవాలి.

సీలింగ్ ఫ్యాన్స్

ఇంట్లో ఏసీలు, కూలర్స్ ఉన్నప్పటికీ సీలింగ్ ఫ్యాన్స్ ఎవర్‌గ్రీన్ అని చెబుతున్నారు. ఈ ఫ్యాన్స్ చల్లని గాలిని కిందికి పంపిస్తాయి. వీటిని వేయడం వల్ల వేడి గాలులు దూరమై మన శరీరానికి చల్లని గాలులు తగులుతాయి. అయితే ఈ బెనిఫిట్స్ అన్నీ పొందాలంటే సరైన ఫ్యాన్లను ఎంచుకోవాలి. మార్కెట్లో చాలా రకాల ఫ్యాన్స్ ఉంటాయి కాబట్టి.. ఇందులో ఎనర్జీ ఎఫిషియంట్ ఏది బాగుంటే అది తీసుకోవాలి. మంచి క్వాలిటీ ఫ్యాన్స్ మంచి మాన్యూఫ్యాక్చరర్స్ దగ్గర కొనుగోలు చేయాలి. సీలింగ్ ఫ్యాన్స్ తో పాటు ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ కూడా వాడడం చాలా ముఖ్యం. మనం ఫ్యాన్స్ వేసినప్పుడు రూములు చల్లగా అవుతాయి. అయితే బాత్‌ రూమ్స్, కిచెన్స్‌ నుంచి వేడి వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ వాడాలి. వీటిని వాడడం వల్ల కూడా ఇంట్లోని వేడి బయటికెళ్లిపోతుంది.

ఐస్, కూల్ వాటర్ టెక్నిక్

ఐస్, కూల్ వాటర్ తో ఇంటిని చల్లబరచడం పాతకాలపు పద్దతి. అయినప్పటికీ ఈ టెక్నిక్ భలేగా పనిచేస్తుంది. రూమ్ లో చల్లని గాలి రావాలంటే ఐస్ ముక్కలు లేదా చల్లని నీటిని రూమ్‌ లో ఫ్యాన్ గాలికి ఎదురుగా ఉంచండి. అంటే ఇంచుమించు సీలింగ్ ఫ్యాన్ కింద ఉంచాలి. దీని వల్ల ఆ గాలి ఈ చల్లని ఐస్ లేదా నీటితో కలిసి మెల్ల మెల్లగా చల్లని గాలిగా మారుతుంది. దీంతో రూమ్‌ లో చల్లని గాలి మొత్తం విస్తరిస్తుంది. క్రమంగా రూమ్ లోని వేడి గాలి బయటకు వెళ్లిపోయి.. రూమ్ అంతా చల్లని గాలి విస్తరిస్తుంది.

లైట్స్, హాట్ స్టఫ్ లేకుండా చేయడం

ఇక రూమ్ వేడిగా మారకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికోసం ఇంట్లోని గ్యాడ్జెట్స్, అప్లయెన్స్‌ని సాధ్యమైనంత వరకు ఆఫ్ చేయాలి. హెయిర్ డ్రయ్యర్స్, వాటర్ మీటర్స్, డిష్ వాషర్స్, ఎలక్ట్రిక్ ఐరన్స్‌ని తక్కువగా వాడాలి. వీటితో పాటు లెడ్ బల్బ్స్ వంటి వాటిని కూడా ఆఫ్ చేయండి. వీటి వల్ల కూడా ఇంట్లో వేడి పెరుగుతుంది. ఇలా చిన్న చిన్న చిట్కాలు, టెక్నిక్స్ తో ఇంట్లో వేడిని తగ్గించి, చల్లని వాతావరణాన్ని ఏర్పరచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మీరు కూడా ట్రై చేసి చూడండి మరి.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles