నలువైపులా అభివృద్ధితో బయ్యర్లను ఊరిస్తోంది హైదరాబాద్ రియాల్టీ సెక్టార్. కొన్ని ఏరియాలు పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ కాగా.. ఇంకొన్ని ప్రాంతాలు అభివృద్ధిపథంలో దూసుకెళ్తున్నాయ్. ఈ కారణంతోనే హైదరాబాద్‌లో ఎలాగైనా సొంతిల్లు కొనాలనుకునే వారి సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతోంది. అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీతో పాటు ఇన్‌ఫ్రా సౌకర్యాలు మెరుగయ్యాయ్. అందుకే అఫర్డబుల్ ప్రైస్‌లో ఇల్లు దొరికితే చాలు అనే ధోరణి పెరగడంతో దూరాభారాల్ని చాలామంది పట్టించుకోవట్లేదు.
నగరంలోనే కాదు ఓఆర్‌ఆర్ చుట్టు పక్కల వరకు నిర్మాణ రంగం దూసుకుపోయింది. అభివృద్ధి, ఉద్యోగ-ఉపాధి అవకాశాలు.. సొంతిల్లు కావాలనే కోరిక.. ఇలా అనేక కారణాలు రియాల్టీ సెక్టార్ జోరును పెంచేలా చేస్తున్నాయ్. డిమాండ్ పెరుగుతుండటంతో నగరంలో అందుబాటు ధరల్లో ఇళ్లు లేవనే ప్రచారాలు సైతం జరుగుతున్నాయ్. అయితే ఇందులో వాస్తవం లేదంటున్నాయి సర్వేలు. హైదరాబాద్‌లో గతేడాది 60 లక్షల రూపాయల్లోపు ఇళ్లకే డిమాండ్ ఎక్కువగా ఉందని.. అలాంటి వాటిని కొనుగోలు చేయడానికి కొనుగోలుదారులు ఆసక్తి చూపించారంటున్నాయి ఎనాలసిస్ రిపోర్ట్స్. ఈస్ట్, నార్త్, సౌత్ హైదరాబాద్‌లో 60 లక్షల రూపాయలు అంతకన్నా తక్కువకే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎక్కువగా దొరుకుతుండటంతో ఈ ప్రాంతాల్లో ఈ తరహా ప్రాజెక్ట్‌లే ఎక్కువగా నిర్మాణాలు జరుపుకుంటున్నాయ్. ఈస్ట్ హైదరాబాద్‌లోని ఉప్పల్, పోచారం, కీసర, రాంపల్లి, ఘట్‌కేసర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ భూమ్ కనిపిస్తుందంటున్నారు డెవలపర్లు. ఈ ప్రాంతాల్లో రెసిడెన్షియల్‌తో పాటు కమర్షియల్ ఆస్తులు కొనుగోలు చేసే వారి సంఖ్యా ఎక్కువగానే ఉంది.
* నార్త్‌జోన్‌లో ఉన్న బాలానగర్‌లోనూ అందుబాటు ధరల్లో టూ బీహెచ్‌కే హౌసెస్ లభిస్తున్నాయ్. గతంలో పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఇక్కడ నివాసాలు పెద్ద సంఖ్యలో ఉండేవి కావు. ఐడీపీఎల్ లాంటి కంపెనీలు మూత పడటంతో ఇక్కడ వందల ఎకరాలు స్థలం ప్రాజెక్ట్‌లు రావడానికి ఉపయోగకరంగా మారింది. మెట్రో స్టేషన్ వచ్చాక బాలానగర్‌లో రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌లు పెరిగాయ్. కూకట్‌పల్లి వై జంక్షన్, దగ్గర్లోనే అటు ఐటీ కారిడార్.. ఇటు సికింద్రాబాద్ చేరుకునే సదుపాయం ఉండటంతో ఇక్కడి ప్రాజెక్ట్‌లకు డిమాండ్ మొదలైంది. ఇక చందానగర్ టూ అమీన్‌పూర్ రూట్‌లో ఎటు చూసినా ఇళ్ల నిర్మాణాలే. అయితే బిజీగా ఉండే చందానగర్‌లో రావు కానీ అక్కడ్నంచి ఔటర్‌ను చేరుకునే దారిలో మాత్రం అపార్ట్‌మెంట్ల ధరలు అందుబాటు ధరల్లోనే ఉన్నాయ్. ఇక్కడ అన్ని రకాల అనుమతులతో నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్స్‌లో 50 లక్షల రూపాయల్లో ఫ్లాట్స్ దొరుకుతున్నాయ్.
* స్థిరాస్తి రంగంలో సౌత్, నార్త్, ఈస్ట్ జోన్లు ఇప్పుడిప్పుడే బిజీగా మారుతున్నాయ్. ఈ ఏరియాల్లోకి కొత్త ప్రాజెక్ట్స్ వస్తుండటంతో ఇక్కడి భూముల ధరలకు డిమాండ్ కనిపిస్తోంది. అయినప్పటికీ అఫర్డబుల్ రేంజ్ కావడంతో ఈ ఏరియాల్లో కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు బయ్యర్లు. ఇప్పుడు పెట్టే లక్షలే.. ఫ్యూచర్‌లో కోట్లు కురిపిస్తాయని అంచనా వేస్తున్నారు.
This website uses cookies.