Categories: TOP STORIES

క్రెడాయ్ హైద‌రాబాద్ తాజా నివేదిక ఇదే..

హైద్రాబాద్‌ రియాల్టీ రంగం ఎలా ఉంది.. మార్కెట్‌లో డౌన్‌ట్రెండ్‌ నడుస్తుందా.. అమ్మకాలు లేక డెవలపర్లు కొత్త ప్రాజెక్ట్‌ల లాంచింగ్‌ ఆపేశారా.. గత కొన్ని నెలలుగా ఇలాంటి ప్రశ్నలు ఎన్నో వినిపించాయ్‌. నిర్మాణ రంగంలో ఎలాంటి సంక్షోభం లేదని చెబుతున్నప్పటికీ.. వాస్తవాలు మాత్రం నిరాశపర్చే విధంగానే ఉన్నాయ్ అని చెప్పొచ్చు. ఈ విష‌యాన్ని స్థిరాస్తి స‌ర్వే సంస్థ‌లు చెప్ప‌డం లేదు. సాక్షాత్తు క్రెడాయ్ హైద‌రాబాదే అంటోంది. అదేంటీ ఒక నిర్మాణ సంఘం ఇలా ఎలా ప్ర‌క‌టిస్తుంద‌నే సందేహం మీకు రావొచ్చు. కాక‌పోతే, ఈ సంస్థ సీఆర్ఈ మ్యాట్రిక్స్‌తో క‌లిసి విడుద‌ల చేసిన తాజా నివేదిక‌లో ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. లాంచింగ్‌ల్లోనూ మునపటి జోరు లేదని ప్ర‌క‌టించింది. ఇంత డల్‌ మూమెంట్‌లోనూ ఇన్వెంటరీలు బాగా తగ్గిపోవడం ఆశాజనకమైన విషయం.

హైద్రాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌కి ఢోకా లేదు. ఫ్యూచర్‌లో గ్లోబల్‌ సిటీ రేంజ్‌ని టచ్‌ చేయడం ఖాయమంటాయి మధ్య మధ్యలో కొన్ని సంస్థలు. భవిష్యత్‌ సంగతెలా ఉన్నా.. వర్తమానం మాత్రం కాస్త నిరాశగానే ఉంది. స్థిరాస్థి రంగంలో దూకుడు చూపించే భాగ్యనగరంలో ఏడాది కాలంగా ప్రైమరీ సేల్స్‌ పెర్ఫార్మెన్స్‌ గొప్పగా లేదు. అమ్మకాలు పడిపోయి.. కొత్త ప్రాజెక్ట్‌ల లాంచింగ్‌లు తగ్గిపోయి ఓ రకంగా డల్‌గా ఉంది రియాల్టీ సెక్టార్‌. గ‌త ఏడాది మార్కెట్‌ తీరు ఎలా ఉందో విశ్లేషిస్తూ క్రెడాయ్‌ రిలీజ్‌ చేసిన రిపోర్ట్‌ ఇదే చెబుతోంది. హైద్రాబాద్‌ రెసిడెన్షియల్‌ మార్కెట్‌ తీరును విశ్లేషిస్తూ క్రెడాయ్‌ హైద్రాబాద్‌ ఛాప్టర్‌.. సీఆర్‌ఈ మ్యాట్రిక్స్‌ సంస్థ జాయింట్‌గా హైద్రాబాద్‌ హౌసింగ్‌ రిపోర్ట్‌ను విడుదల చేశాయ్‌. 2023 నుంచి 2024 వరకు మొత్తం ఎనిమిది త్రైమాసికాల్లో ఇళ్ల అమ్మకాల ట్రెండ్‌ ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. మ‌రి, ఈ నివేదిక‌లో చెప్పిన తాజా అంశాలేమిటంటే..

  • 2023 నాలుగో త్రైమాసికంతో పొల్చితే 2024 ఫోర్త్‌ క్వార్టర్‌లో ఇళ్ల అమ్మకాలు 9 శాతం క్షీణించాయ్‌. అంటే 2023లో 33 వేల 966 కోట్ల రూపాయల విలువగల యూనిట్స్ అమ్ముడైతే 2024లో ఈ విలువ 30 వేల 924 కోట్లు మాత్రమే.
  • 2023లో అక్టోబర్‌- డిసెంబర్‌ క్వార్టర్‌లో 21,435 యూనిట్లు అమ్ముడుపోగా.. 2024లో సేమ్‌ పీరియడ్‌లో 22 శాతం తగ్గి 16 వేల 664 యూనిట్ల ఇళ్లు సేల్‌ అయ్యాయ్‌.
  • 2023లో లాస్ట్‌ క్వార్టర్‌లో కొత్త ప్రాజెక్ట్‌ల ద్వారా 22 వేల 300 యూనిట్లుగా ఉన్న లాంచింగ్‌ యూనిట్ల పరిమాణం.. 2024లో సగానికి సగం తగ్గి 11 వేల 81 యూనిట్లుగా ఉంది.
  • 2023 చివరి త్రైమాసికంలో లక్షా 21 వేల 421 యూనిట్లుగా ఉన్న ఇన్వెంటరీస్‌ నంబర్‌ 2024 నాటికి లక్షా 4 వేల 778 యూనిట్లకు తగ్గింది.
  • హైద్రాబాద్‌ నార్త్‌వెస్ట్ మార్కెట్‌లో యావరేజ్‌ టికెట్‌ సైజ్‌ 2023తో పొల్చితే 2024లో కొంచెం పెరిగింది. 2023 ఫోర్త్‌ క్వార్టర్‌లో 1.4 కోట్ల రూపాయలుగా ఉన్న విలువ 2024లో 1.7 కోట్ల రూపాయలుగా ఉంది.
  • హైద్రాబాద్‌ నార్త్‌ వెస్ట్‌లో 19 వేల 826 కోట్ల రూపాయల విలువైన ఇళ్ల అమ్మకాలు జరిగాయ్‌. మార్కెట్‌ షేర్‌లో ఇది 64 శాతం.

This website uses cookies.