Categories: LATEST UPDATES

300 మంది విద్యార్థుల‌తో గోదావ‌రి న‌ది శుభ్రం..

హైద‌రాబాద్ మెట్రో రైలు ఇక నుంచి అర్థ‌రాత్రి 12.45కు ప‌ని చేస్తుంద‌ని ఎల్అండ్‌టీ మెట్రో రైలు చీఫ్ స్ట్రాట‌జీ ఆఫీస‌ర్ ముర‌ళీ వ‌రద‌రాజ‌న్ తెలిపారు. శుక్ర‌వారం నార్సింగిలో తెలంగాణ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ కౌన్సిల్ నిర్వ‌హించిన 10వ గ్రీన్ యాన్యువ‌ల్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ స‌మావేశంలో ఆయ‌న కీల‌కోప‌న్యాసం చేస్తూ.. మెట్రో రైడ్‌ను ప్రజలు గర్వించేలా చేయాలని.. మెట్రో ద్వారా హరిత ప్రయాణాన్ని ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు.

రామోజీ ఫిల్మ్ సిటీ ఏడాదికి 1.5 మిలియన్ల మంది ఫుట్‌పాల్‌ను నమోదు చేస్తుందని రామోజీ ఫిల్మ్ సిటీ సీఈవో శేషసాయి కంఠంరాజు తెలిపారు. సుమారు 300 మంది విద్యార్థులతో గోదావరి నదిని శుభ్రపరిచే కార్యక్రమాన్ని చేపడతామని ఆర్జీయూకేటీ బాసర‌ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.వెంకట రమణ తెలిపారు. నేషనల్ ఎఫ్‌ఎంల సమ్మిట్-2024 అనేది ఫెసిలిటీస్ మేనేజ్‌మెంట్ నిపుణుల వార్షిక సమావేశం. దాదాపు 400 మంది ఫెసిలిటీస్ మేనేజ్‌మెంట్ నిపుణులు సమ్మిట్‌లో పాల్గొన్నారు. సమ్మిట్ సందర్భంగా గ్రీన్ అవార్డులను అందజేశారు.

This website uses cookies.