Categories: TOP STORIES

హైదరాబాద్ ఇళ్ల అందం చూద్దామా?

  • ఆధునిక, సంప్రదాయ డిజైన్లతో
    దూసుకెళ్తున్న డిజైన్ కేఫ్

హైదరాబాద్ అనగానే నిజాం ప్యాలెస్ లు, అత్తరు సువాసనలు, బిర్యానీ ఘుమఘుమలు, నోరూరించే హలీం గుర్తుకొస్తాయి. అంతేకాకుండా ఎత్తైన ఆకాశహర్మ్యాలు, కళ్లు చెదిరే మాల్స్ వంటివీ కనిపిస్తాయి. అటు సంప్రదాయ పోకడలు, ఇటు ఆధునిక గ్లామర్ తో కలగలిసిన డిజైన్లూ కనువిందు చేస్తాయి. కళ్లు చెదిరే ఇంటీరియర్ డిజైన్లు అందిస్తోంది. లగ్జరీ ఇంటీరియర్స్ తో విలాసవంతమైన అలంకరణ హ్యాంగింగ్ లైట్లు, ఫ్లోరింగ్, మెట్ల డిజైన్ కోసం ఇటాలియన్ పాలరాయి, వైబ్రెంట్ కలర్ ప్యాలెట్ తో మెరిసే ఇళ్లు, రాయల్ నవాబీ లక్షణాలతో కూడిన ఫర్నిచర్, సంప్రదాయ, ఆధునిక శైలుల సమ్మేళనంతో కూడిన ఇంటీరియర్స్ ప్ర‌తిఒక్క‌ర్ని ఆక‌ర్షిస్తుంది.

‘ఈ ఏడాది హైదరాబాదీ ఇళ్లు సమకాలీన ఇంటీరియర్స్ తో ఉన్నవే ఎక్కువగా ఉంటాయి. ప్రజలు ఆధునిక, పంక్షనల్ డిజైన్ల వైపు వెళ్తున్నట్టు మేం గమనించాం. అంతే కాకుండా రాచరిక, అలంకార సౌందర్యంతో కూడిన కళాఖండాలు కూడా ఎక్కువ మందిని ఆకర్షిస్తున్నాయి. రాబోయే సీజన్ లో హైదరాబాదీ ఇళ్ల ఇంటీరియర్స్ లో వుడ్, మిర్రర్ ప్యానెలింగులు చూస్తార‌ని నిపుణులు అంటున్నారు.
హైదరాబాదీలు సంప్రదాయ శైలిలో ఉండే ఇంటీరియర్లనే ఇష్టపడతారు. అదే సమయంలో వాటికి కాస్త ఆధునికత జోడిస్తారు. హైదరాబాద్ లోని ఏ ఇంట్లో అడుగు పెట్టినా.. ప్రాచీన వస్తువులు, చెక్క ఫర్నిచర్, వైబ్రెంట్ రంగులు మీకు స్వాగతం పలుకుతాయి. అటు పెద్ద కుటుంబాలతోపాటు ఇటు యువ టెక్కీ జంటలు తమ కలల గృహాలను కొనుగోలు చేసి, తమకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకుంటున్నారు. రెండు తరాల సమ్మేళనం సంప్రదాయ, ఆధునిక ఇంటీరియర్ సొగ‌సును పరిచయం చేసింది.

బెడ్ రూం విషయంలో హైదరాబాదీలది ప్రత్యేక ధోరణి. వారు నిజాంల వలె నిద్రించాలని కోరుకుంటారు. కానీ అదే సమయంలో వారి మాస్టర్ బెడ్ రూంలో ఆధునిక కాలపు సౌకర్యాలు లేకుండా ఉండవు. అధునాతన వస్తువులు, డెకర్ తో కూడిన సొగసైన డిజైన్లతో పడకగదులు కనువిందు చేస్తాయి. రిసెస్డ్ లైట్లు, రాగి వస్తువులు, వుడెన్ ఫ్లోరింగ్, అద్దాలు, గ్లాస్ ప్లేతో కూడిన ఖరీదైన ఫాల్స్ సీలింగ్ డిజైన్ బెడ్ రూమ్ కి రాచరికాన్ని జోడిస్తుంది.

బిర్యానీకి ఫేమస్ అయిన హైదరాబాద్ లో వంటగది ఎలా ఉంటుందో చూద్దామా? కుటుంబంలో చెఫ్ లు అందరి కోసం ఆధునిక అంశాలతో రూపొందించిన విశాలమైన వంటగది ఉండాల్సిందే. హైదరాబాదీలు ఇంటిని డిజైన్ చేసినప్పుడు వాస్తుకు ప్రాముఖ్యత ఇస్తారు. అందుకు అనుగుణంగానే వంటగది నిర్మాణం ఉంటుంది. ఇంట్లో నుంచి బయటకు వచ్చి బాల్కనీలో కాసేపు గడపాలని ఎవరికి ఉండదు? అందుకే హైదరాబాదీలు తమ బాల్కనీలను కూడా అంలకరించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు.

This website uses cookies.