చీటింగ్ చేసిన కేసులో ఓ ప్రమోటర్ ను మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం కింద ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అరెస్టు చేశారు. ముంబైకి చెందిన కరణ్ గ్రూప్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ప్రమోటర్ మహేశ్ భూపత్ కుమార్ ఓజాను ఈడీ అధికారులు బెంగళూరులో అరెస్టు చేశారు. అనంతరం ఆయన్ను జైలుకు తరలించి తమ కస్టడీకి తీసుకున్నారు.
ఓజా ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టిన ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు ఆయనపై కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేశారు. ‘ఫిర్యాదుదారు వివిధ సంస్థలు, వివిధ గ్రూపులు నిర్వహిస్తున్న పలు ప్రాజెక్టుల్లో రూ.526 కోట్లు పెట్టుబడి పెట్టారు. అందులో రూ.121.5 కోట్లు కరణ్ గ్రూప్ బిల్డర్స్ చేపట్టిన ప్రాజెక్టుకు అక్రమంగా మళ్లించారు’ అని పోలీసులు తెలిపారు.
This website uses cookies.