హైదరాబాద్ నగర రహదారులపై ప్రభుత్వం దృష్టి సారించింది. జీహెచ్ఎంసీతో పాటు నగరం చెట్టూ ఉన్న పలు శివారు మున్సిపాలిటీల్లో రూ.2,410 కోట్ల వ్యయంతో 104 రోడ్ల నిర్మాణం, అభివృద్ధి చేపట్టనుంది. తొలుత ఐదు ప్యాకేజీల్లో రూ.1500 కోట్ల ఖర్చుతో 50 రహదారులను నిర్మించనున్నారు. ఇందులో ఇప్పటికే ఉన్న పలు రహదారులను అభివృద్ధి చేయడంతోపాటు కొత్తగా కొన్ని చోట్ల రోడ్లు నిర్మించనున్నారు. బండ్లగూడ జాగీర్, జవహర్ నగర్, దమ్మాయిగూడ, నాగారం, కొత్తూరు, శంషాబాద్, గాజుల రామారం, నిజాంపేట తదితర మున్సిపాలిటీల్లో ఈ రోడ్లు రానున్నాయి. హైదరాబాద్ రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ పనులు చేపట్టనుంది. ఇప్పటికే పలు పనులకు సంబంధించి టెండర్లు కూడా పిలిచింది.
ప్యాకేజీ-1 కింద రహదారులివీ..
లంగర్ హౌస్ బాపూఘాట్ బ్రిడ్జి-పీఅంట్ టీ కాలనీ
కొత్తూరు రైల్వే క్రాసింగ్-కుమ్మరిగూడ జంక్షన్
కొత్తూరు వై జంక్షన్-వినాయక స్టీల్ ఫ్యాక్టరీ
శంషాబాద్ బస్టాప్-ఒయాసిస్ ఇంటర్నేషనల్ స్కూల్
శంషాబాద్ రైల్వే స్టేషన్ క్రాసింగ్-ధర్మగిరి రోడ్డు
ఎన్ హెచ్ 44 తొండుపల్లి-ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు
గొల్లపల్లి ఎన్ హెచ్-ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు
ప్యాకేజీ-2 కింద రోడ్లు..
ఆర్సీఐ క్రాస్ రోడ్డు-ఎయిర్ పోర్టు హోటల్ శ్రీశైలం హైవే
మల్లాపూర్ క్రాస్ రోడ్డు-కుర్మల్ గూడ
కుర్మల్ గూడ-నాదర్ గుల్
బడంగ్ పేట మెయిన్ రోడ్డు-తుర్కయాంజల్ రామాలయం నాదర్ గుల్
ఇబ్రహీంపట్నం అంబేడ్కర్ జంక్షన్-ఆక్టోపస్
ఇంజాపూర్-మునగనూర్
తొర్రూర్-నాగార్జున సాగర్ రోడ్డు
ఇన్నర్ రింగ్ రోడ్డు-డీఎల్ఆర్ఎల్ కాలనీ
వనస్థలిపురం రోడ్డు-ఓల్డ్ హయత్ నగర్ రోడ్డు
బడంగ్ పేట-నాదర్ గుల్ మెయిన్ రోడ్డు
ప్యాకేజీ-3 రహదారులు..
దమ్మాయిగూడ రోజ్ గార్డెన్ ఫంక్షన్ హాల్ నుంచి నాగారం మీదుగా ఈసీఐఎల్
– చేర్యాల జేఎన్ఎన్ యూఎం హౌసింగ్ కాలనీ నుంచి అహ్మద్ గూడ వరకు