ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ ముంబై లోయర్ పరేల్ లోని ఆఫీస్ స్థలాన్ని రూ.8 కోట్లకు విక్రయించారు. తద్వారా గత కొన్ని నెలల్లోనే ఆయన రూ.100 కోట్ల విలువైన ఆస్తులను అమ్మినట్టయింది. లోయర్ పరేల్ లోని వన్ ప్లేస్ లోధాలో ఉన్న 1146 చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ ను రూ.కోట్లకు అమ్మారు. విపుల్ సా, కాశ్మీరా షా అనే ఇరువురు వ్యక్తులు ఈ ప్రాపర్టీని కొనుగోలు చేశారు. ఈనెల 16న రిజిస్ట్రేషన్ జరగ్గా.. రూ.48 లక్షల స్టాంపు డ్యూటీ, రూ.30వేల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు. ఆఫీస్ స్పేస్ తో పాటు రెండు కార్ పార్కింగులు కూడా ఉన్నాయి.
అక్షయ్ ఈ ప్రాపర్టీని 2020లో రూ.4.85 కోట్లకు కొన్నారు. అంటే ఆయన పెట్టబడిపై 65 శాతం రాబడి వచ్చినట్టయింది. లోయర్ పరేల్ అనేది ముంబైలోని ప్రధాన వాణిజ్య, నివాస గమ్యస్థానాలలో ఒకటి. లగ్జరీ అపార్ట్ మెంట్‌లు, గ్రేడ్-ఎ ఆఫీస్ స్థలాలు ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. ఇది బాంద్రా-కుర్లా కాంప్లెక్స్, నారిమన్ పాయింట్ వంటి కీలక వ్యాపార కేంద్రాలకు కూడా దగ్గరగా ఉంది. అభిషేక్ బచ్చన్, షాహిద్ కపూర్, అమిష్ త్రిపాఠి, మనోజ్ బాజ్‌పేయ్ వంటి బాలీవుడ్ తారలు కూడా లోయర్ పరేల్‌లో ఆస్తులను కలిగి ఉన్నారు. కాగా, వన్ ప్యాలెస్ లోధా అనేది మాక్రోటెక్ డెవలపర్స్ లిమిటెడ్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ 1.08 ఎకరాల విస్తీర్ణంలో ఉంది.