ఇండియాలో అగ్రికల్చర్ సెక్టార్ తర్వాత ఎక్కువగా ఉపాధి కల్పించే రంగం రియల్ ఎస్టేట్ సెక్టార్. జాబ్ క్రియేషన్‌లోనే కాదు ప్రభుత్వానికి దండిగా ఆదాయాన్ని సైతం సమకూరుస్తోంది నిర్మాణ రంగం. వేగంగా పట్టణీకరణ జరగడం.. కార్పొరేట్ సెక్టార్ విస్తరించడంతో రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్రాపర్టీలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఆస్తుల విలువ పెరగడం.. ఆదాయ వనరుల్లో రియాల్టీ సెక్టార్ ఒకటిగా మారడంతో ప్రతి ఏటా బడ్జెట్‌లో రియాల్టీ సెక్టార్‌పై విధిస్తోన్న ట్యాక్స్‌లోనూ మార్పులు కనిపిస్తున్నాయ్. మరి మన దేశ నిర్మాణరంగంలో పన్నుల విధానం ఎలా ఉంది..? ట్యాక్సేషన్‌లో రియాల్టీ సెక్టార్ ఎదుర్కొంటున్న సమస్యలేంటి..? ఇతర దేశాలతో పొల్చితే ఇండియాలో ట్యాక్స్‌లు ఎక్కువా..? తక్కువా..?
- స్టేట్ గవర్నమెంట్స్ అండ్ అర్బన్ లోకల్ బాడీస్ పరిధిలో..
- ఆస్తిపన్ను, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు
- కేంద్రం పరిధిలో ఎమ్‌ఏటీ, కార్పొరేట్ ట్యాక్స్, జీఎస్టీలు
- ప్రాపర్టీల కొనుగోలు సమయంలో స్టాంప్ డ్యూటీ 5-15 శాతం
- లీజింగ్ టైమ్‌లో ఎమ్‌ఏటీ 10 నుంచి 15 శాతం
- కార్పొరేట్ ట్యాక్స్ 25 నుంచి 30 శాతం
- కన్‌స్ట్రక్షన్ మెటీరియల్‌పై 5-12 శాతం జీఎస్టీ
- సర్వీసెస్ మీద ఒక శాతం
- అఫొర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్ట్స్‌పై 5 శాతం జీఎస్టీ
- రెంట్స్‌పై జీఎస్టీ 18 శాతం
- క్యాపిటల్ గెయిన్‌పై 10-20 శాతం ట్యాక్స్
- ఎమ్‌ఏటీ 10-15 శాతం వసూలు
- తెలంగాణలో స్టాంప్ డ్యూటీ ఫ్లాట్స్ మీద 7%, ప్లాట్స్ మీద 9%
స్టాక్‌మార్కెట్, బంగారంలో పెట్టుబడులతో పొల్చితే రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేసి సంపాదించాలనుకునే వారి సంఖ్య మన దేశంలో చాలా ఎక్కువ. భూమి మీద పెట్టే పెట్టుబడి అస్సలు వృథా కాదు. పైగా రిటర్న్స్ సైతం కూడా ఎక్కువే. గ్లోబలైజేషన్‌తో ఉపాధి అవకాశాలు పెరగడంతో ఇళ్లు, ఆఫీస్‌లతో పాటు వేర్‌హౌసింగ్, కో-వర్కింగ్ స్పేస్‌లు, డాటా సెంటర్స్, స్టూడెంట్ హౌసింగ్ ఇలా వివిధ రూపాల్లో ఆదాయమూ కళ్ల ముందు కనిపిస్తోంది. అందుకే నిర్మాణ రంగంపై విధించే పన్నుల్ని తమ ఆదాయ వనరులుగా భావిస్తున్నాయి కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు. ఆస్తిపన్ను, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్‌ల్ని స్టేట్ గవర్నమెంట్స్- అర్బన్ లోకల్ బాడీస్ విధిస్తుండగా.. మినిమమ్ అల్ట్రానేటివ్ ట్యాక్స్, కార్పొరేట్ పన్ను, జీఎస్టీ, ఇన్‌కమ్ ట్యాక్స్‌లు విధించే అధికారం కేంద్ర పరిధిలో ఉంది.
నిర్మాణ రంగంలో ట్యాక్సేషన్‌ని పరిశీలిస్తే- ప్రాపర్టీస్‌లో ఇన్వెస్ట్ చేసే సమయంలో స్టాంప్ డ్యూటీ 5 నుంచి 15 శాతం, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, కంపెనీలు ఏర్పాటుకు వర్తించే ట్యాక్స్‌లు విధిస్తుండగా.. ఆస్తి నిర్మాణం- అభివృద్ధి, హోల్డింగ్ లేదా లీజింగ్ సమయాల్లో మినిమయ్ అల్ట్రానేటివ్ ట్యాక్స్‌ని 10 నుంచి 15 శాతం.. 25 నుంచి 30 శాతం కార్పొరేట్ ట్యాక్స్, కన్‌స్ట్రక్షన్ మెటీరియల్‌పై 5 నుంచి 12 శాతం జీఎస్టీ, సర్వీసెస్ మీద 1 శాతం, అఫొర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్ట్స్‌పై 5 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. అలాగే రాష్ట్ర చట్ట ప్రకారం ఆస్తిపన్ను, అద్దె ఆదాయంపై ఇన్‌కమ్ ట్యాక్స్, రెంట్స్‌పై జీఎస్టీ 18 శాతంగా ఉంది. ఇక ఆస్తిని అమ్మే సమయంలో మూలధన లాభంపై 10 నుంచి 20 శాతం, కనీస ప్రత్యామ్నాయ పన్నుని 10 నుంచి 15 శాతం వసూలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. తెలంగాణా విషయానికొస్తే- ఫ్లాట్స్ మీద స్టాంప్ డ్యూటీ 7 శాతం ఉండగా.. ప్లాట్స్ మీద ఇది 9 శాతంగా ఉంది.
పన్నుల మోత?
గత పదేళ్లలో నిర్మాణ రంగంపై విధించే పన్నుల శాతం బాగా పెరిగిపోయిందంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఆదాయాలు పెంచుకోడానికి స్టాంప్ డ్యూటీలు, రిజిస్ట్రేషన్ ఛార్జీల్ని భారీగా పెంచేస్తున్నాయ్. ఇక జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత పన్నుల చెల్లింపు విధానం ఇబ్బందిగా మారింది. అభివృద్ధి చెందిన దేశాలతో కంపేర్ చేసి చూస్తే మన దగ్గర ఆస్తులపై ట్యాక్స్‌లు తక్కువగానే ఉన్నప్పటికీ కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలకు విడివిడిగా రెండుసార్లు పన్నులు కట్టాల్సి రావడం రిటర్న్స్‌పై ప్రభావం చూపిస్తుందనే ఫిర్యాదులు చేస్తున్నారు ట్యాక్స్ పేయర్స్.
విదేశాల్లో పన్ను ఎంత?
- అమెరికాలో నో స్టాంప్ డ్యూటీ
- ఆస్ట్రేలియాలో 6.50 శాతం స్టాంప్ డ్యూటీ
- యునైటెడ్ కింగ్‌డమ్‌లో స్టాంప్ డ్యూటీ 5-12 శాతం
- చైనాలో డీడ్ ట్యాక్స్ 3 శాతం
- అమ్మకాలపై స్టాంప్ డ్యూటీ 0.5-1 శాతం
- ప్రాపర్టీల మీద జీఎస్టీ, వ్యాట్‌లు అమెరికాలో వర్తించవు
- ఆస్ట్రేలియాలో 10 శాతం
- యునైటెడ్ కింగ్‌డమ్‌లో 20 శాతం
- చైనాలో 5- 9 శాతం
మూలధనం మీద పన్ను అమెరికాలో 21 శాతం
- ఆస్ట్రేలియాలో 12.5- 30 శాతం
- యునైటెడ్ కింగ్‌డమ్‌లో 18- 28 శాతం
- చైనాలో ల్యాండ్ వాల్యూ అప్రిసియేషన్ ట్యాక్స్ 30-60 శాతం
కార్పొరేట్ ట్యాక్స్ అమెరికాలో 21-37 శాతం
- ఆస్ట్రేలియాలో 30 శాతం
- యునైటెడ్ కింగ్‌డమ్‌లో 19-25 శాతం
- చైనాలో 25 శాతం
రెంటల్ ఇన్‌కమ్స్‌పై అమెరికాలో 30 శాతం
- ఆస్ట్రేలియాలో 15-30 శాతం
- యునైటెడ్ కింగ్‌డమ్‌లో 25 శాతం
- చైనాలో మ్యాక్సిమమ్ 3 శాతంగా పన్నులు
శక్తివంతమైన దేశాల జాబితాలో ఐదో స్థానంలో ఉన్న ఇండియాతో పొల్చితే రియాల్టీ సెక్టార్లో మిగిలిన దేశాల్లో పన్నులు ఎక్కువగానే ఉన్నాయ్. కంట్రీస్ వైజ్‌గా ట్యాక్సేషన్‌ను చూస్తే- అమెరికాలో స్టాంప్ డ్యూటీ వర్తించదు. ఆస్ట్రేలియాలో 6.50 శాతం, యునైటెడ్ కింగ్‌డమ్‌లో 5 నుంచి 12 శాతం, చైనాలో డీడ్ ట్యాక్స్ 3 శాతం, అమ్మకాలపై స్టాంప్ డ్యూటీ 0.5 నుంచి 1 శాతంగా ఉంది. ప్రాపర్టీల మీద జీఎస్టీ, వ్యాట్‌లు అమెరికాలో వర్తించవు. ఆస్ట్రేలియాలో 10 శాతం, యునైటెడ్ కింగ్‌డమ్‌లో 20 శాతం, చైనాలో 5 నుంచి 9 శాతంగా ఉన్నాయ్. మూలధనం మీద పన్ను అమెరికాలో 21 శాతం ఉండగా, ఆస్ట్రేలియాలో 12.5 శాతం నుంచి 30 శాతం ఉంది. యునైటెడ్ కింగ్‌డమ్‌లో 18 నుంచి 28 శాతం, చైనాలో ల్యాండ్ వాల్యూ అప్రిసియేషన్ ట్యాక్స్ 30 నుంచి 60 శాతంగా ఉన్నాయ్. కార్పొరేట్ ట్యాక్స్ అమెరికాలో 21 నుంచి 37 శాతం, ఆస్ట్రేలియాలో 30 శాతం, యునైటెడ్ కింగ్‌డమ్‌లో 19 నుంచి 25 శాతం, చైనాలో 25 శాతం, రెంటల్ ఇన్‌కమ్స్‌పై అమెరికాలో 30 శాతం, ఆస్ట్రేలియాలో 15 నుంచి 30 శాతం, యునైటెడ్ కింగ్‌డమ్‌లో 25 శాతం, చైనాలో మ్యాక్సిమమ్ 3 శాతంగా పన్నులు అమలవుతున్నాయ్.