శీతాకాలం వచ్చేసింది. చలి బాగా పెరిగింది. రగ్గులు బయటకు తీయాల్సిన సమయం వచ్చేసింది. మరి చలి నుంచి కాపాడుకోవడానికి, ఇంటిని వెచ్చగా ఉంచుకోవడానికి కొన్ని చిట్కాలివిగో..
మన్నికైన, బరువైన కర్టెన్లను కిటికీలకే వేయడం ద్వారా చల్లగాలి నుంచి దూరంగా ఉండొచ్చు. బరువైన కర్టెన్లు ఇంట్లో వెచ్చని గాలిని ఉంచడంలో సహాయపడతాయి. బయట ఎండగా ఉన్నప్పుడు కర్టెన్లు తెరిచి సూర్యరశ్మి లోపలకు వచ్చేలా చూసుకోవాలి. పగటిపూట ఇలా వేడిని లోపలకు తెచ్చుకోవడం, రాత్రిపూట లోపల వెచ్చదనాన్ని బయటకు పోనీయకుండా చూడటంలో కర్టెన్లు కీలకపాత్ర పోషిస్తాయి.
చలికాలంలో పాదాలు చాలా చల్లగా ఉంటాయి. కఠినమైన నేలపై నడుస్తున్నప్పుడు అవి మరింత చల్లగా అవుతాయి. అందువల్ల సౌకర్యవంతమైన రగ్గులు లేదా కార్పెట్లను ఫ్లోర్ పై వేసుకోవాలి. ఇది మంచి ఇన్సులేషన్ అందించడం ద్వారా ఇంటి లోపల ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుతుంది.
మీ కిటికీల లోపలి వైపు ప్లాస్టిక్ పొరతో కప్పి ఉంచడాన్ని ష్రింక్ ర్యాప్ అంటారు. దీనివల్ల లోపలి వేడి బయటకు, బయటి చలి లోపలకు రాదు.
వేసవిలో ఫ్రిజ్ తలుపు తెరిస్తే.. అందులో నుంచి వచ్చే చల్లదనం హాయిగా అనిపిస్తుంది. అదే విధంగా శీతాకాలంలో ఓవెన్ ఉపయోగపడుతుంది. ఓవెన్ ఉపయోగించిన తర్వాత దాని తలుపు తెరిచి ఉంచితే అందులో ఉండే వేడి వంటగదిని వెచ్చగా చేస్తుంది. అయితే, పిల్లలు, పెట్స్ ఉన్నప్పుడు ఇలా చేయడం మంచిది కాదని గుర్తుంచుకోండి.
మీరు పడుకునే ముందు వేడి నీటితో నింపిన సంచులను కుషన్లుగా ఉపయోగించండి. వాటిని బ్లాంకెట్ కింద పెట్టుకుని పడుకుంటే వెచ్చగా ఉంటుంది.
మీరు వేడినీటితో స్నానం చేసినప్పుడు మీ బాత్రూమ్ మొత్తం ఆవిరితో నిండిపోతుంది. మీరు బయటకు వచ్చిన తర్వాత ఆ ఆవిరి మీ బెడ్రూమ్ లోకి వచ్చి గది వెచ్చగా ఉంటుంది. ఇలాంటి చిన్నచిన్న చిట్కాల ద్వారా ఈ శీతాకాలంలో వెచ్చగా ఉండొచ్చు.
This website uses cookies.