హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా టాప్-8 నగరాల్లో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో స్థూల ఆఫీస్ లీజింగ్ మెరుగుపడింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చి చూస్తే 4.5 శాతం వృద్ధితో 202.9 లక్షల చదరపు అడుగులుగా (ఎస్‌ఎఫ్‌టీ) ఉన్నట్టు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ సంస్థ వెల్లడించింది. గతేడాది ఇదే క్వార్టర్‌లో ఇది 194.2 లక్షల చదరపు అడుగులుగా ఉండ గమనార్హం. నికర ఆఫీసు లీజింగ్ 20 శాతం వృద్ధితో ఎనిమిది నగరాల్లో 134.4 లక్షల చదరపు అడుగులుగా నమోదైంది.
బెంగళూరులో మాత్రం ఆఫీస్ వసతుల లీజింగ్ మార్చి క్వార్టర్‌లో క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చి చూస్తే 28 శాతం తక్కువగా 48.6 లక్షల చదరపు అడుగులకు పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో స్థూల లీజింగ్ 67.4 లక్షల చదరపు అడుగులుగా ఉంది. నికర ఆఫీస్ లీజింగ్ సైతం 33 శాతం తక్కువగా 24.9 లక్షల చదరపు అడుగులుగా ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది.
This website uses cookies.