poulomi avante poulomi avante

ఏపీలో రూ.1.26 లక్షల కోట్ల పెట్టుబడులు

  • పలు కంపెనీల ఏర్పాటుకు ఎస్ఐపీబీ ఆమోదం
  • ఏడేళ్లలో 40,330 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ లో రూ.1,26,748 కోట్ల మేర పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలకు ఏపీ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) ఆమోదం తెలిపింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వీటికి సంబంధించిన అంశాలపై చర్చించి ఆమోద ముద్ర వేశారు. దీని ప్రకారం వచ్చే ఏడేళ్లలో 40,330 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు రానున్నాయి. అలాగే ఈ మొత్తం పెట్టుబడుల్లో రూ.81వేల కోట్లు గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో పెట్టనున్నారు. తద్వారా 17,930 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది.
కొత్తగా రానున్న పరిశ్రమలు ఇవే..

వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో కాసిస్ ఇ-మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ రూ.386.23 కోట్ల పెట్టుబడితో పరిశ్రమ ఏర్పాటు చేయనుంది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ బస్సుల తయారీ కోసం రూ.286.23 కోట్లు, చార్జింగ్ మౌలిక సదుపాయాల కోసం రూ.100 కోట్లు వెచ్చించనుంది. తొలి విడతలో వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు తయారు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. దీని ద్వారా 1200 మందికి ప్రత్యక్షంగా ఉద్యోవకాశాలు లభిస్తాయి.
కాకినాడలో లైఫిజ్ ఫార్మా యూనిట్ ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం రూ.1900 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 236.37 ఎకరాల భూమిని కేటాయించింది. 2024 ఏప్రిల్ నాటికి కంపెనీ ఏర్పాటు పూర్తి చేయనున్నారు. దీని ద్వారా దాదాపు 2వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి.
మెటలార్జికల్ గ్రేడ్ సిలికాన్, పాలీ సిలికాన్, ఫ్లోట్ గ్లాస్ తదితరవాటి తయారీకి ఇన్సోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ నెల్లూరు జిల్లా రామాయపట్నంలోని 5,147 ఎకరాల స్థలంలో ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం కంపెనీ మూడు విడతల్లో రూ.43,143 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ కంపెనీ ద్వారా 11,500 మందికి ప్రత్యక్షంగా, మరో 11వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. అలాగే ఈ కంపెనీ 50 గిగావాట్లు, 10 గిగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ విద్యుత్ ప్రాజెక్టులను కూడా నెలకొల్పనుంది.
కృష్ణా జిల్లా మల్లవల్లిలో అవిశా ఫుడ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మెగా ఫుడ్‌పార్కును ఏర్పాటు చేయనుంది. అవిశా ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.150 కోట్లతో ఏర్పాటు చేయబోయే ఈ ఫుడ్ పార్కు ద్వారా 2500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు రానున్నాయి. ఈ పార్కు కోసం 11.64 ఎకరాల భూమి కేటాయించారు.
వైఎస్సార్‌ జిల్లా పైడిపాలెం వద్ద పంప్డ్‌ హైడ్రో, సోలార్, విండ్‌ పవర్‌ ప్రాజెక్టులను ఇండోసోల్‌ సోలార్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఏర్పాటు చేయనుంది. 7,200 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి కోసం రూ.33,033కోట్లు ఖర్చు చేయనుంది. పైడిపాలెం ఈస్ట్‌ 1200 మెగావాట్లు, నార్త్‌ 1000 మెగావాట్లు, 3500 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్టు, 1500 మెగావాట్ల విండ్‌ పవర్‌ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్నారు. దీంతో 7,200 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. డిసెంబర్‌ 2028 నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
రూ.5వేల కోట్ల పెట్టుబడితో కర్నూలు, నంద్యాల జిల్లాల్లో సోలార్, విండ్‌ పవర్‌ ప్రాజెక్టులను ఏఎం గ్రీన్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా వేయి మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. 700 మెగావాట్ల సోలార్, 300 మెగావాట్ల విండ్‌ పవర్‌ ప్రాజెక్టులను కంపెనీ ఏర్పాటు చేయనుంది. మార్చి 2025 నాటికి ప్రాజెక్టుల పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
రూ.81,043 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయబోయే ఆరు గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. వీటి ద్వారా 20,130 ఉద్యోగాలు రానున్నాయి.
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles