Categories: LEGAL

9 మంది డెవలపర్లకు రూ.1.40 కోట్ల జరిమానా

తన ఆదేశాలను ధిక్కరించిన తొమ్మిది మంది డెవలపర్లపై యూపీ రెరా కన్నెర్రజేసింది. వారికి రూ.1.40 కోట్ల జరిమానా విధించింది. ప్రమోటర్లకు తానిచ్చిన ఆదేశాల స్థితిగతులపై 84వ సమావేశంలో యూపీ రెరా సమీక్ష జరిపింది. ఈ సందర్భంగా ఉల్లంఘనలకు పాల్పడిన ఎయిమ్స్ ప్రమోటర్స్ ప్రైవేట్ లిమిటెడ్, వేవ్ మెగా సిటీ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్, అన్సల్ హౌసింగ్ లిమిటెడ్ అండ్ అన్సల్ ప్రాపర్టీస్ అండ్ ఇన్ ఫ్రాస్టక్చర్ లిమిటెడ్, అంత్రిక్ష్ రియల్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్, ఏవీపీ రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్, ఏటీఎస్ రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్, కృష్ణ ఎస్టేట్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, రతన్ బిల్డ్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్, రెడికన్ ఇన్ ఫ్రాస్టక్చర్ అండ్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పై ఈ మేరకు జరిమానా విధించింది.

‘గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడేందుకు ఎప్పటికప్పుడు యూపీ రెరా తగిన చర్యలు తీసుకుంటోంది. ఇలాంటి విషయాల్లో డెవలపర్లకు తగిన ఆదేశాలు ఇస్తున్నాం. అయితే, కొంతమంది ప్రమోటర్లు రెరా ఆదేశాలను పట్టించుకోలేదు. వారికి తగిన సమయం ఇచ్చినప్పటికీ వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో అలాంటివారికి జరిమానా విధించాలని నిర్ణయం తీసుకున్నాం.

రెరా చట్టంలోని 38/63 సెక్షన్ ప్రకారం ప్రాజెక్టు వ్యయంలో 5 శాతం వరకు జరిమానా విధించే అధికారం రెరాకు ఉంది. అందుకు అనుగుణంగానే తొమ్మిది మంది డెవలపర్లపై జరిమానా విధించాం’ అని యూపీ రెరా చైర్మన్ రాజీవ్ కుమార్ తెలిపారు. 30 రోజుల్లోగా జరిమానా చెల్లించని పక్షంలో ల్యాండ్ రెవెన్యూ బకాయిల కింద ఆ మొత్తాన్ని రికవరీ చేస్తామని స్పష్టం చేశారు.

This website uses cookies.