Categories: TOP STORIES

పది లక్షల్నుంచి లభించే ప్లాట్లు..

పిల్లల ఉన్నత చదువుల కోసమో.. వారి పెళ్లిళ్ల కోసమో అక్కరకొస్తుందని మనలో చాలామంది ప్లాట్లను కొనుగోలు చేస్తారు. ఇప్పుడు కాకపోయినా కనీసం వచ్చే పదేళ్లకైనా డెవలప్ అయితే చాలని అనుకుంటారు. ఈ క్రమంలో కొందరు తక్కువ రేటులో ప్లాట్ల కోసం చూస్తే.. మరికొందరేమో రేటెక్కువైనా ఫర్వాలేదనుకుని.. అధిక సొమ్ము వెచ్చిస్తారు. కాకపోతే, కాస్త అధిక విస్తీర్ణం గల ప్లాట్లను కొనుగోలు చేస్తారు. అయితే, ఇక్కడ ప్రతిఒక్కరూ గమనించాల్సిన అంశం ఏమిటంటే.. ప్రధాన రహదారి నుంచి లోపలికి వెళ్లి ప్లాట్లను కొనుగోలు చేయకండి. తక్కువ రేటుకు వస్తుందని చెప్పి వెంచర్ విషయంలో రాజీపడకండి. భవిష్యత్తులో రేటు పెరుగుతుందనే అంచనా వేశాకే తుది నిర్ణయం తీసుకోండి.

హైదరాబాద్ శివార్లలో అధిక సంఖ్యలో వెంచర్లు వెలుస్తున్నాయి. మొన్న మహేశ్వరం.. నిన్న యాదాద్రి.. నేడు సదాశివపేట్.. ఇలా కొందరు రియల్టర్లు పోటీపడి వెంచర్లను డెవలప్ చేస్తుంటారు. ప్లాట్లను అమ్ముకోవడానికి ఏజెంట్లు రకరకాల మాటలు చెబుతుంటారు. వాటిని పూర్తిగా నమ్మకుండా.. కాస్త తెలివిగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి.

This website uses cookies.