రియాల్టీ సెక్టార్‌లో ఎప్పటికప్పుడు ట్రెండ్స్ మారిపోతుంటాయ్. ఫ్లాట్స్ డైమెన్షన్స్ దగ్గర్నుంచి.. అపార్ట్‌మెంట్స్ హైట్ వరకు ప్రాజెక్ట్.. ప్రాజెక్ట్‌కి అప్‌డేట్ అయిపోతున్నాయిప్పుడు. ప్రజెంట్ స్కై స్క్రేపర్స్ హవా నడుస్తోంది. కస్టమర్లు కూడా వీటికే ఓటేస్తున్నారు. బయ్యర్ల అభిరుచికి తగ్గట్టే ఆకాశహర్మ్యాల నిర్మాణాల్ని రియల్ సంస్థలు చేపడుతున్నాయి. అలా కన్‌స్ట్రక్ట్ అవుతోన్న భారీ అంతస్థుల ప్రాజెక్ట్‌లో రాజపుష్ప ప్రొవిన్షియా ఒకటి. ఓ వైపు ఆహ్లాదం.. మరోవైపు వండర్ఫుల్ ఆర్కిటెక్చర్ మిక్సైన లార్జెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ ఈ ప్రాజెక్ట్. ఇందులోని కొన్ని బ్లాకులను హ్యాండోవర్ కూడా చేస్తోంది. మరి రాజపుష్ప ప్రొవిన్షియా స్పెషాలిటీస్ ఏంటి..? బయ్యర్లు రాజపుష్పనే ఎందుకు ఎంచుకోవాలి..? ఈ లగ్జరీ ప్రాజెక్ట్‌లో కొనుగోలు చేయడం వల్ల వచ్చే లాభాలేమిటి?
ప్రాజెక్టు ప్రత్యేకతలు
- ప్రాజెక్ట్- రాజపుష్ప ప్రొవిన్షియా
- లొకేషన్- నార్సింగి
- కంపెనీ- రాజపుష్ప ప్రాపర్టీస్
- టోటల్ ల్యాండ్ ఏరియా- 23.75 ఎకరాలు
- బిల్డింగ్ హైట్- జీ+39 అంతస్థులు
- యూనిట్ టైప్- 2 &3 బీహెచ్‌కే
- మొత్తం ఫ్లాట్స్- 3498
- యూనిట్ సైజ్- 1370-2660 చ.అ
- రెరా రిజిస్ట్రేషన్ నంబర్- P02400002487
రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్స్ కన్‌స్ట్రక్షన్‌లో మోడ్రన్ మెథడ్స్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయ్. లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నారు మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్. అదే సమయంలో అత్యంత ఎత్తులో ఉండే స్కై స్క్రేపర్స్‌లో ఉండటానికి ఇష్టపడుతున్నారు. అందుకే కంపెనీలు కూడా ఇప్పుడు ఆకాశహర్మ్యాల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నాయ్. అలా కస్టమర్ల అభిరుచికి తగ్గట్టు రాజపుష్ప ప్రాపర్టీస్ నిర్మించిన స్కై స్క్రేపర్ ప్రాజెక్ట్ రాజపుష్ప ప్రొవిన్షియా. నార్సింగిలో 23.75 ఎకరాల విశాలమైన ల్యాండ్ ఏరియాలో ప్రొవిన్షియాను డెవలప్ చేస్తున్నారు. ఇది లార్జెస్ట్ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ స్కై స్క్రేపర్ ప్రాజెక్ట్. ఇందులో జీ+39 ఎత్తులో 11 టవర్లు నిర్మించారు. 1370 నుంచి 2660 స్క్వేర్‌ఫీట్స్‌లో టూ బీహెచ్‌కే అండ్ త్రీ బీహెచ్‌కే ఫ్లాట్స్.. మొత్తం 3 వేల 498 యూనిట్స్ ఉన్నాయ్.
బెస్ట్ లొకేషన్..
నార్సింగిలో ఉండటం లొకేషన్ పరంగా రాజపుష్ప ప్రొవిన్షియాకు బాగా కలిసొచ్చే విషయం. గచ్చిబౌలి- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నియర్ బై ఓన్ ప్రాపర్టీ కావాలనుకునే వారికి.. ఈ రెండు ప్రాంతాల దగ్గర్లో నివసించాలనుకునే వారికి బెస్ట్ ఛాయిస్ రాజపుష్ప ప్రొవిన్షియా. 15 నిమిషాల దూరంలో హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కాంటినెంటల్ హాస్పిటల్ ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, విప్రో సర్కిల్ లాంటివి 10 నిమిషాల డ్రైవ్ డిస్టెన్స్‌లోనే ఉన్నాయ్. క్యూ సిటీ, మైక్రోసాఫ్ట్, వేవ్‌రాక్, ఇన్ఫోసిస్, ఐఎస్‌బీ, ట్రిపుల్ ఐటీ వంటివి 2 నుంచి 6 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయ్.
క్వాంటిటీ కాదు క్వాలిటీ ముఖ్యం. నాణ్యత విషయంలో అస్సలు రాజీ పడే ప్రసక్తే లేదంటోంది రాజపుష్ప ప్రాపర్టీస్. నిర్మాణ రంగంలో నమ్మకమే ముఖ్యం. కస్టమర్ల విశ్వాసాన్ని పొందిన కంపెనీలే లాంగ్‌టర్మ్‌లో సర్వైవ్ అవుతుంటాయ్. బయ్యర్లు, క్లయింట్స్ నుంచి అలాంటి నమ్మకాన్ని సాధించాం కాబట్టే ఈ రంగంలో ప్రముఖ కంపెనీగా పేరు పొందామంటున్నారు రాజపుష్ప ఓనర్స్. ఇక స్కై స్క్రేపర్‌గా రానున్న ప్రొవిన్షియా ప్రాజెక్ట్‌ను అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.
రాజపుష్ప సుపరిచితమే!
లగ్జరీ అండ్ ప్రీమియం లైఫ్‌స్టైల్ కన్‌స్ట్రక్షన్స్‌కి కేరాఫ్ అడ్రస్ రాజపుష్ప ప్రాపర్టీస్. నిర్మాణ రంగంలో దాదాపు 2 దశాబ్ధాల అనుభవం. ఇప్పటికే ఎన్నో భారీ ప్రాజెక్ట్‌లను నిర్మించి సక్సెస్‌ఫుల్‌గా కస్టమర్లకు హ్యాండోవర్ చేసింది రాజపుష్ప. బయ్యర్ల అభిరుచికి ప్రాధాన్యత, పారదర్శకత, నమ్మకం, ఇన్నోవేటివ్ థాట్స్, స్థిరత్వం- రాజపుష్ప ప్రాపర్టీస్ విజయంలో ఈ ఐదు అంశాలదే ముఖ్యపాత్ర. ఇక ఇప్పటి వరకు రాజపుష్ప సిలికాన్ రిడ్జ్, రాజపుష్ప ఓపెన్ స్కైస్, రాజపుష్ప క్యానన్ డేల్, రాజపుష్ప స్టోన్ రిడ్జ్, రాజపుష్ప ద రీట్రీట్, రాజపుష్ప అట్రియా, రెగలియా లాంటి రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌లను సక్సెస్‌ఫుల్‌గా హ్యాండోవర్ చేసింది. అలాగే అనేక కమర్షియల్ స్పేస్‌లు సైతం డెవలప్ చేసింది. ఇక రాజపుష్ప ప్రొవిన్షియా ద్వారా న్యూ లైఫ్ స్టైల్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తామంటోంది కంపెనీ.
రెండు క్లబ్ హౌజులు..
రాజపుష్ప ప్రొవిన్షియాలో అమెనిటీస్ విషయానికొస్తే- లక్షన్నర చదరపు అడుగుల్లో క్లబ్ ఒడిస్సీ, క్లబ్ ఒయాసిస్ పేరుతో రెండు గ్రాండ్ క్లబ్ హౌస్‌ల్ని ఎక్స్‌క్లూజివ్‌గా ఏర్పాటు చేశారు. స్కై వాక్ ఎంట్రన్స్, ప్రతీ అపార్ట్‌మెంట్‌కి ఈవీ ఛార్జింగ్ సదుపాయం, ట్రాఫిక్ ఫ్రీ పోడియం, ఇండోర్, ఔట్‌డోర్ ఫిట్‌నెస్ స్టేషన్, క్లినిక్, ఫార్మసీ, గ్రాసరీ, ఏటీఎం, డబుల్ హైటెడ్ బాంకెట్ హాల్, హీలింగ్ గార్డెన్, యోగా, ఏరోబిక్స్ డెక్, యాంఫీ థియేటర్, స్విమ్మింగ్ పూల్ సహా ప్రీమియం లైఫ్‌స్టైల్‌కి బెంచ్‌మార్క్ లాంటి అనేక సదుపాయాలున్నాయి ఇందులో. అంతేకాదు నిర్మాణంలో పర్యావరణ సంరక్షణ పద్ధతులు పాటించినందుకు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఇచ్చే గోల్డ్ రేటెడ్ సర్టిఫికేట్ కూడా సాధించింది రాజపుష్ప ప్రొవిన్షియా. డెవలప్మెంట్‌తో పాటు ఐటీ కారిడార్‌లో ఉండాలనుకునే వారికి ఇంతకు మించిన మంచి ఛాయిస్ దొరుకుతుందా..? అందుకే రెజ్ న్యూస్ రికమండెడ్ స్కే స్క్రేపర్స్‌లో చోటు సాధించింది ప్రొవిన్షియా. మరి రెడీ టూ మూవ్‌కి సిద్ధంగా ఉన్న ప్రొవిన్షియా ప్రాజెక్ట్‌ను మీరే స్వయంగా వెళ్లి పరిశీలించండి.