అమ్మకాలు లేక 200 కోట్లు స్టక్ ..

ఔను.. మీరు చదివింది నిజమే. ఒక ఏరియాలో కొందరు వ్యక్తులు కలిసి అపార్టుమెంట్లను నిర్మించి.. వాటిని సకాలంలో అమ్ముకోలేక నానా ఇబ్బంది పడుతున్నారు. ఇలా, ఎంత లేదన్నా యాభై, అరవై అపార్టుమెంట్ల అమ్మకాలు అర్థాంతరంగా నిలిచిపోయాయి. ఇలా, ఎంతలేదన్నా రూ.200 కోట్ల దాకా స్టక్ అయ్యాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

మియాపూర్ మెట్రో స్టేషన్ చేరువలోని బాచుపల్లి, మల్లంపేట్, బౌరంపేట్ వంటి ప్రాంతాల్లో కొందరు యువ బిల్డర్లు అపార్టుమెంట్లను నిర్మించారు. ఎక్కువ శాతం ఐదు వందల గజాల కంటే అధిక విస్తీర్ణంలో కట్టినవే కావడం గమనార్హం. కాస్త ఆర్థికంగా బలోపేతంగా కనిపించిన డెవలపర్లేమో అంతకు మించిన విస్తీర్ణంలో చేపట్టారు. దురదృష్టం ఏమిటంటే.. గత కొంతకాలం నుంచి అమ్మకాలు పెద్దగా జరగడం లేదు.

పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో కొందరు కొనుగోలుదారులు డబుల్ బెడ్ రూం ఫ్లాట్లను ఇరవై లక్షలకు ఇస్తారా? 25 లక్షలకు ఇస్తారా? అని అడుగుతుండటంతో బిల్డర్లు డీలాపడిపోతున్నారు. మొత్తానికి, దాదాపు యాభై నుంచి అరవై అపార్టుమెంట్ల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. ఒకసారి కేవీఆర్ వ్యాలీని క్షుణ్నంగా గమనిస్తే.. అధిక శాతం అపార్టుమెంట్లు సెమీ ఫినిష్డ్ స్థాయికి చేరుకున్నాయి. మరికొన్నేమో నిర్మాణ దశలో ఉన్నాయి.

బాచుపల్లి రియల్ రంగం ఒక్కసారి ప్రతికూలంగా మారడంతో ఇక్కడ కొత్తగా అపార్టుమెంట్లను కట్టేందుకు పలువురు బిల్డర్లు పునరాలోచిస్తున్నారు. కొందరేమో స్థానిక మున్సిపాలిటీ అనుమతితో కట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు

This website uses cookies.