poulomi avante poulomi avante

2 డేస్‌.. 200 ఫ్లాట్స్ సోల్డ్

  • ఈస్ట్ హైద‌రాబాద్‌లో స‌రికొత్త రికార్డు
  • ఆహా.. ఆనంద నిల‌యం అంటున్న బ‌య్య‌ర్లు
  • ఎల్‌బీన‌గ‌ర్ మెట్రో స్టేష‌న్ ప‌క్క‌నే ప్రాజెక్టు
  • రైలెక్కితే అర‌గంట‌లో మాదాపూర్
  • ధ‌ర‌.. చ‌ద‌ర‌పు అడుక్కీ రూ.7000

ఎల్‌బీన‌గ‌ర్ చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లోనే అతిపెద్ద స్కై స్క్రేప‌ర్ అట్ట‌హాసంగా ఆరంభ‌మైంది. డీజే టిల్లు ఫేం సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌, న‌టీమ‌ణులు శ్రీలీల‌, అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, యాంక‌ర్ శ్రీముఖి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణగా నిలిచారు. ద‌క్షిణ భార‌త‌దేశంలోనే అతిపెద్ద గేటెడ్ క‌మ్యూనిటీ అయిన ఆనంద నిల‌యం ప్రాజెక్టు.. న‌గ‌రంలోనే ల్యాండ్ మార్కు ప్రాజెక్టుగా నిలుస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఎల్బీ న‌గ‌ర్ మెట్రో స్టేష‌న్ ప‌క్క‌నే ప్రాజెక్టు ఉండ‌టంతో.. అలా ఇంట్లో నుంచి రెండు అడుగులు వేసి రైల్లో కూర్చుంటే చాలు.. అర‌గంట‌లో మాదాపూర్ ఐటీ కారిడార్‌లో దిగొచ్చు. హైటెక్ సిటీ, మైండ్ స్పేస్‌, సాలార్‌పూరియా వంటి ఐటీ స‌ముదాయాల‌కు సులువుగా చేరుకోవ‌చ్చు. మెట్రో స్టేష‌న్ ప‌క్క‌నే ప్రాజెక్టు ఉండ‌టంతో.. న‌గ‌రంలోని ఎటువైపు నుంచి అయినా ఆనంద నిల‌యానికి సులువుగా చేరుకోవ‌చ్చు. శంషాబాద్ విమానాశ్ర‌యానికి ఇక్క‌డ్నుంచి సులువుగా రాక‌పోక‌ల్ని సాగించొచ్చు.

ఆనంద నిల‌యం ప్రాజెక్టును చూస్తే ఎవ‌రైనా ఆహా అని అనాల్సిందే. ఎందుకంటే, దాదాపు వంద‌కు పైగా ప్ర‌పంచ స్థాయి స‌దుపాయాల్ని వాస‌వి సంస్థ పొందుప‌రుస్తోంది. పైగా నిర్మాణం వ‌చ్చేది కేవ‌లం 28 శాతం స్థ‌లంలోనే. సౌతిండియాలోనే అతి పెద్ద గేటెడ్ క‌మ్యూనిటీని సుమారు 29.37 ఎక‌రాల్లో నిర్మిస్తున్నారు. 33 అంత‌స్తుల్లో 3576 ఫ్లాట్ల‌ను క‌డుతున్నారు. 2, 3, 4 ప‌డ‌క గదుల‌కు పెద్ద పీట వేసిన ఈ ప్రాజెక్టులో.. సుమారు 112 స్కై విల్లాల‌ను తీర్చిదిద్దారు. రెండు క్ల‌బ్ హౌజుల‌ను పొందుప‌రుస్తున్నారు. దీని విస్తీర్ణం.. సుమారు 1.31 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ఉంటుంది. ఇందులో లాప్ అండ్ రిక్రియేషనల్ పూల్, పూల్ డెక్, పూల్ డైనింగ్ పెవీలియ‌న్స్‌, రిఫ్లెక్టింగ్ పూల్‌, ఔట్ డోర్ డైనింగ్ స్పేస్ వంటి వాటిలో ప్ర‌జ‌లెంతో సంతోషంగా గ‌డ‌పొచ్చు.

డీజే టిల్లు హ‌ల్‌చ‌ల్‌!

గ‌త ఆదివారం అట్ట‌హాసంగా ఆరంభ‌మైన ఆనంద నిల‌యం ప్రాజెక్టులో.. డీజే టిల్లు ఫేమ్ సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాడు. సినీతార‌లు శ్రీల‌ల‌, అనుప‌మా ప‌ర‌మేశ్వ‌రన్‌లు ఆరంభోత్స‌వానికే కొత్త అందాన్ని తెచ్చారు. యాంక‌ర్ శ్రీముఖి త‌నదైన శైలిలో ఆహుతుల్ని అల‌రించారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన డ్యాన్స్ మ‌రియు మ్యూజిక్ కార్య‌క్ర‌మం హైలైట్గా నిలిచాయి. ఈమ‌ధ్య కాలంలో హైద‌రాబాద్ నిర్మాణ రంగంలో.. ఏ ఇత‌ర ప్రాజెక్టు ప్రారంభోత్స‌వం ఇంత ఘ‌నంగా జ‌ర‌గ‌లేద‌నే చెప్పాలి. మొత్తానికి, వాస‌వి ఆనందం నిల‌యం ప్రారంభోత్స‌వం రియ‌ల్ రంగంలోనే స‌రికొత్త ఉత్సాహం నింపింద‌ని చెప్పొచ్చు. ఈ కార్య‌క్ర‌మంలో న‌గ‌రానికి చెందిన ప‌లువురు బిల్డ‌ర్లు, డెవ‌ల‌ప‌ర్లు పాల్గొని.. వాస‌వి గ్రూప్ ఎండీకి శుభాకాంక్ష‌లు తెలిపారు.

ల్యాండ్ మార్క్ ప్రాజెక్టుగా..

న‌గ‌ర నిర్మాణ రంగంలో చిరస్థాయిగా నిలిచిపోయేలా.. ఈస్ట్ హైద‌రాబాద్‌కే ల్యాండ్ మార్క్ ప్రాజెక్టుగా వాస‌వి ఆనంద నిల‌యం నిలుస్తుంద‌న్నారు. ద‌క్షిణ భార‌త‌దేశంలోనే అతి పెద్ద అందమైన లగ్జరీ క‌మ్యూనిటీగా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతాం- అభిషేక్ చందా, సౌమ్య- డైరెక్టర్లు, వాసవి గ్రూప్

రాత్రి ప‌దిన్న‌ర దాకా..

గ‌త ఆదివారం అట్ట‌హాసంగా ఆరంభ‌మైన మా ఆనంద నిల‌యం ప్రాజెక్టులో ఫ్లాట్ల‌ను కొనేందుకు బ‌య్య‌ర్లు అధిక ఆస‌క్తి చూపెట్టారు. మొద‌టి హండ్రెడ్ ఫ్లాట్లు అమ్ముడ‌య్యాయి. మేం అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యాం. కాక‌పోతే, రాత్రి ప‌దిన్నర వ‌ర‌కూ ఇంకా చాలామంది బ‌య్య‌ర్లు కొన‌డానికి క్యూలో ఉండ‌టంతో.. వారి కోరిక మేర‌కు ఈ స్కీమును మ‌రుస‌టి రోజు కూడా వ‌ర్తింప‌జేశాం. ఫ‌లితంగా, రెండో రోజూ మ‌రో వంద ఫ్లాట్లు బుక్ అయ్యాయి. ఈ ప్రాజెక్టు విశిష్ఠ‌త‌ల‌ను అర్థం చేసుకున్న కొనుగోలుదారుల నుంచి మంచి రెస్పాన్స్ ల‌భించింది. మూడున్న‌రేళ్ల‌లో ఆనంద నిల‌యాన్ని పూర్తి చేయాల‌న్న సంక‌ల్పంతో ముందుకెళుతున్నాం. – య‌ర్రం విజ‌య్ కుమార్‌, సీఎండీ, వాస‌వి గ్రూప్

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles