Categories: TOP STORIES

22 అంతస్తులు.. రూ.707 కోట్లు

ముంబైలో మరో ఖరీదైన డీల్

ఖరీదైన రియల్ ఎస్టేట్ లావాదేవీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మరో భారీ డీల్ జరిగింది. 22 అంతస్తుల ఆఫీస్ టవర్ రూ.707 కోట్లకు అమ్ముడైంది. సింగపూర్ కి చెందిన క్యాపిటాల్యాండ్ ఇండియా ట్రస్ట్ (గతంలో అసెండాస్ ఇండియా ట్రస్ట్).. ఆరమ్ వెంచర్స్ కు చెందిన 22 అంతస్తుల ఆఫీసు భవనాన్ని రూ.707 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. నవీ ముంబైలోని ఘన్సోలీలో 8.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనం పేరు బిల్డింగ్ క్యూ2.

భారత్ లో గ్లోబల్ ఇన్ స్టిట్యూషన్ ఇన్వెస్టర్ ద్వారా కొనుగోలు చేసిన అతిపెద్ద ఒప్పందాల్లో ఇది ఒకటి. ఒప్పందంలో భాగంగా ఈ టవర్ ను కొనుగోలు చేసిన తేదీ నుంచి 12 నెలల్లోపు ఆరమ్ వెంచర్స్ కు ఇంక్రిమెంటల్ లీజింగ్ చెల్లించాల్సి ఉంటుంది. వాస్తవానికి ఈ కొనుగోలుకు సంబంధించి 2018 మేలోనే ఒప్పందం కుదిరింది. ఈ భవనంలో పలు మల్టీ నేషనల్ కంపెనీలు, ప్రముఖ బ్యాంకులు, ఇతర సంస్థలు తమ కార్యాలయాలు ఉన్నాయి. కాగా, ఇదే క్యాంపస్ లో ఉన్న క్యూ1 టవర్ ని అసెండాస్ రూ.353 కోట్లకు కొనుగోలు చేసింది.

This website uses cookies.