Categories: Celebrity Homes

ముంబైలో కొత్త ఇల్లు కొన్న మాధవన్

ప్రముఖ నటుడు మాధవన్ ముంబైలో కొత్త ఇల్లు కొనుగోలు చేశారు. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో ఆయన అపార్ట్ మెంట్ కొన్నారు. 4,182 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ అపార్ట్ మెంట్ ను రూ.17. 5 కోట్లు వెచ్చించి కొన్నట్టు తెలుస్తోంది. ఈ డీల్ కింద మాధవన్ కు రెండు పార్కింగ్ స్థలాలు కూడా వస్తాయి. ఈనెల 22న రిజిస్ట్రేషన్ జరగ్గా.. స్టాంపు డ్యూటీ కింద రూ.1.05 కోటలు, రిజిస్ట్రేషన్ చార్జీల కింద రూ.30వేలు చెల్లించారు.

కాగా, మాధవన్ తన ఖాళీ సమయాన్ని కుటుంబంతో కలసి గడపడంలో బిజీగా ఉన్నారు. గత నెలలో తల్లి సరోజా రంగనాథన్‌తో ఉన్న చిత్రాలు ఆన్‌లైన్‌లో ట్రెండింగ్ అయ్యాయి. ఆ ఫొటోల్లో మాధవన్ క్లీన్ షేవ్ తో కనిపించారు. తన కొడుకు ఇలా క్లీన్ షేవ్ తో ఉంటే తనకు చాలా ఇష్టమని.. తెల్లటి గెడ్డం వద్దని చెబుతూ ఉంటానని మాధవన్ తల్లి సరోజా రంగనాథన్ పేర్కొన్నారు.

This website uses cookies.