ఇల్లు కట్టుకునేటప్పుడు వాస్తుకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం నార్త్ ఫేసింగ్ ఇళ్లు చాలా కలసి వస్తుందని భావిస్తారు. మరి అదే నార్త్ హైదరాబాద్ లో ఇల్లుంటే ఇంకెంత బావుంటుందో కదా? ప్రస్తుతం నార్త్ హైదరాబాద్ కూడా వేగంగా అభివృద్ధి చెందుతోంది. పలు ఐటీ కంపెనీలతో పాటు ప్రభుత్వ సంస్థలు కూడా అక్కడ వస్తున్నాయి. అందుకే, ఇక్కడి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని క్రెడాయ్ హైదరాబాద్ ప్రప్రథమంగా నార్త్ హైదరాబాద్ ప్రాపర్టీ షోను నిర్వహిస్తోంది. కొంపల్లిలోని ఆస్పేసియస్ కన్వెన్షన్ సెంటర్ లో నవంబర్ 5, 6వ తేదీల్లో దీనిని నిర్వహిస్తోంది. క్రెడాయ్ ప్రాపర్టీ షోకి విచ్చేసి మీకు నచ్చిన ఇంటిని సొంతం చేసుకోండి.
నార్త్ హైదరాబాద్ అభివృద్ధి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతోంది. పశ్చిమ హైదరాబాద్తో పోల్చితే ఈ ప్రాంతం రానున్న రోజుల్లో గణనీయంగా వృద్ధి చెందుతుంది. ఇందుకు అపారమైన అవకాశాలున్నాయని చెప్పొచ్చు. సుల్తాన్ పూర్ లో 302 ఎకరాల్లో ఏర్పాటవుతున్న మెడికల్ డివైసెస్ పార్కును చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఇప్పటికే సుల్తాన్ పూర్లో రహదారులన్నీ పక్కగా డెవలప్ చేశారు. ఏయే సంస్థలకు ఎక్కడెక్కడ స్థలం కేటాయించారో పక్కాగా రాసిపెట్టారు. అంతెందుకు కొన్ని సంస్థలు తమ కార్యకలాపాల్ని కూడా ఆరంభించడం విశేషం. ఈ కారణంగానే ఇక్కడి చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్లాట్లు, ఫ్లాట్లు, వ్యక్తిగత ఇళ్లు, విల్లాలకు ఎక్కడ్లేని గిరాకీ పెరిగింది.
This website uses cookies.