Categories: Celebrity Homes

ఆలియా భట్ ఇల్లంటే ఇష్టం

  • రియల్ ఎస్టేట్ గురుతో ఓరి దేవుడా ఫేమ్ ఆశాభట్

ఓరి దేవుడా ఫేమ్ ఆశాభట్ దక్షిణ కేదార్ కు చెందిన నటి. ఈ ప్రాంతం ఒకప్పుడు బనవాసీ పాలకుల రాజధానిగా ఉండేది. ఆశా పూర్వీకుల ఇల్లు అక్కడ ఉంది. చక్కని నిర్మాణ పాటవానికి ఆ ఇల్లు ఓ ఉదాహరణ. తన ఇంటికి సంబంధించి ఆమె రియల్ ఎస్టేట్ గురుకి ప్రత్యేకంగా ఇలా వివరించారు.

‘ఫైవ్ స్టార్ హోటళ్లలోనే ఉండాలనే పట్టింపు నాకు అస్సలు లేదు. నిజమైన లగ్జరీ అనేది నా భద్రావతి ఇంట్లో ఉంది. అక్కడే నిజమైన సుకూన్ ఉంది. ఇక నా ఇంటి అలంకరణ విషయంలోనే కాదు.. సాధారణంగా కూడా నేను మినిమలిస్టిక్ జీవన విధానాన్నే అనుసరిస్తాను. ఇదేదో పెద్ద పని అనుకోకండి. ఇక్కడ మినిమలిస్టిక్ అంటే తక్కువ కొనుక్కోవడం కాదు.. ఏది తీసుకోవాలనే విషయంలో చాలా సున్నితంగా వ్యవహరిస్తాను. ఇక మా భద్రావతి ఇంటిని పూర్తిగా నా తల్లిదండ్రులే డిజైన్ చేశారు. మాకు వారి వ్యక్తిగత అభీష్టం చాలా ముఖ్యం. అదే సమయంలో నా కలల నిలయంలో నా సాంస్కృతిక వారసత్వాన్ని నిలుపుకొంటాను’ అని ఆశా తెలిపారు. తన కలల సౌధానికి డ్యాన్స్ స్టూడియో అదనపు ఆకర్షణ అని పేర్కొన్నారు. ‘నేను డ్యాన్స్ ని శ్వాసిస్తాను కాబట్టి, గురుకులాన్ని పోలి ఉండే పురాతన డ్యాన్స్ స్టూడియోని ఇష్టపడతాను. బహుశా ఇది పాత జులా శైలి’ అని వివరించారు.

వాస్తవానికి బౌద్ధ సన్యాసులను మినిమలిజం యొక్క అంతిమ మాస్టర్లుగా పరిగణించవచ్చు. గ్లోబలైజేషన్ ఆగమనం మితిమీరిన వినియోగదారువాదానికి దారితీసే సమూల మార్పులను తీసుకొచ్చింది. అందుకే చాలామంది నటీనటులు ఈ ట్రెండ్ కే వెళ్తారు. ‘మాలిబు బీచ్ లో విల్లా కొనడానికి అవకాశం వచ్చింది. అక్కడి అద్భుతమైన సాగర వీక్షణ పట్ల ఎవరు ఆసక్తి చూపరు చెప్పండి? వుడ్ యాక్సెటింగ్ ఇంటికి చక్కని ఆకర్షణను ఇస్తుంది. ప్రస్తుతానికి నాకు సొంత ఫ్లాట్ ఉంది’ అని తెలిపారు. షూటింగ్ లేనప్పుడు తన లివింగ్ రూమ్ లోనే ఆమె ఎక్కువ సమయం గడుపుతారు. ఫోన్ మాట్లాడినప్పుడు కూడా అక్కడే ఉంటారు. ఇంటర్వ్యూ ఇవ్వడం కూడా అక్కడి నుంచే. కొన్నిసార్లు చదువుకోవడం కూడా అక్కడే. ఇక తాను ఆరాధించే సెలబ్రిటీ హోం ఎవరిది? ఎవరి ఇంటి నుంచి కొన్ని వస్తువుల తెచ్చుకోవాలని అనుకుంటున్నారు అని అడిగితే.. ఆలియా భట్ ఇల్లు అని ఠక్కున చెప్పారు. ‘ఆలియా ఇంట్లో అందరి దృష్టినీ ఆకర్షించే మొదటి అంశం నీలి రంగు డబుల్ డోర్లు. ఇంకా ప్రవేశ ద్వారం వద్ద ఉన్న ప్రత్యేకమైన బెంచ్ కూడా. ఇల్లు మొత్తం థీమ్ తెల్లగా ఉంటుంది. అది నాకు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది’ అని చెప్పి ముగించారు.

This website uses cookies.