చెన్నైలో డీఎల్ఎఫ్ కు చెందిన 4.67 ఎకరాల భూమిని చోళమండలం ఇన్వెస్ట్ మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ రూ.735 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ మేరకు ఈ కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్ లో వివరాలు వెల్లడించింది. చెన్నై గిండీలో ఉన్న 4.67 ఎకరాల భూమిని డీఎల్ఎఫ్ ఐటీ ఆఫీసెస్ చెన్నై ప్రైవేటు లిమిటెడ్ నుంచి కొనుగోలు చేసినట్టు తెలిపింది. తన భూమిని మానిటైజ్ చేసుకోవడం డీఎల్ఎఫ్ దీనిని విక్రయించింది. కాగా, డీఎల్ఎఫ్ సంస్థ చెన్నైలో చాలా ప్రాజెక్టులు అభివృద్ధి చేస్తోంది. ఇందులో రెసిడెన్షియల్, కమర్షియల్ రెండూ ఉన్నాయి.