ఫైనాన్షియల్ డిస్ట్రిక్టులో సెన్సేషన్ ఇన్‌ఫ్రాకాన్ అనే సంస్థ ప్రకటించిన ప్రీలాంచ్ ఆఫర్ ఇది. ఖైరతాబాద్‌లో సెన్సేషన్ ఇన్‌సోమ్నియా అనే సినిమా థియేటర్ కు చెందిన భవిష్య గుప్తా అనే వ్యక్తి తాజా ఆఫర్ ప్రకటించారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్టు చేరువలో.. ఎకరం స్థలంలో.. సుమారు 47 అంతస్తుల ఎత్తులో.. 1928 స్టూడియో కమ్ సర్వీస్ ఫ్లాట్లను నిర్మిస్తారట. వాక్ టు వర్క్ కాన్సెప్టును ప్రతిబింబించేలా కడతామని సంస్థ చెబుతోంది. సంస్థ ప్రతినిధితో రియల్ ఎస్టేట్ గురు మాట్లాడగా.. ఇంతవరకూ హైదరాబాద్‌లో ఒక్క బహుళ అంతస్తుల భవనమూ ఈ బిల్డర్ కట్టలేదని తెలిసింది.
కొత్తగా నార్సింగిలో ఒక మాల్ మల్టీప్లెక్సును నిర్మిస్తున్నారని తెలిసింది. అసలింత వరకూ ఒక్క సముదాయాన్ని నిర్మించిన బిల్డర్ 47 అంతస్తుల టవర్ నిర్మించాలని అనుకోవడం కరెక్టే. కానీ, మొదటి ప్రయత్నంలోనే అంత భారీ టవర్ నిర్మిస్తున్నందుకు సదరు డెవలపర్ ధైర్యాన్ని మెచ్చుకోక తప్పదు. అందులో పెట్టుబడి పెట్టేవారిని అభినందించాల్సిందే. రోడ్డు విస్తరణలో భాగంగా రెండు ఎకరాల భూమిని పోగొట్టుకున్నందుకు, స్థానిక సంస్థ 47 అంతస్తుల్ని కట్టుకునేందుకు అనుమతినిచ్చిందట. మరి, ఈ నిర్మాణం ఆరంభమయ్యేదెన్నడు? పూర్తయ్యేదెప్పుడు?
This website uses cookies.