ముంబైలోని 10 టవర్ల నిర్మాణం కోసం అప్పు చేసిన సంస్థ
ముంబై సబర్బన్ లో 10 రెసిడెన్షియల్ టవర్ల నిర్మాణం కోసం కల్పతరు గ్రూప్ రూ.525 కోట్ల నిధులు సమీకరించింది. పీఏజీ అనే అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ నేతృత్వంలోని ఆసియా ప్రగతి స్ట్రాటజిక్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ నుంచి నాన్ కన్వర్ట్ బుల్ డిబెంచర్ల రూపంలో ఈ నిధులు అప్పు తీసుకుంది. వీటిని 18.75 శాతం ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ (ఐఆర్ఆర్) ప్రాతిపదికన తీసుకుంది. ఈ వ్యవహారంపై పీఏజీ, కల్పతరు ఎలాంటి ప్రకటనా చేయలేదు. గత నెలలో ఆసియా ప్రగతి స్ట్రాటజిక్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ రూ.475 కోట్లను అన్ లిస్టెడ్ బాండ్ల రూపంలో, మరో రూ.49 కోట్లను సెక్యూర్డ్ లిస్టెడ్ బాండ్ల రూపంలో పెట్టుబడులు పెట్టింది. ఈ రెండు బాండ్లూ 2027 ఏప్రిల్ 30న గడువు తీరతాయి. వీటితో కల్పతరు సంస్థ ముంబై సబర్బన్ లోని కల్పతరు వివాంట్ ప్రాజెక్టును పూర్తి చేయనుంది. ఇందులోని పది టవర్ల నిర్మాణానికి రూ.750 కోట్ల నుంచి రూ.800 కోట్ల వ్యయమవుతుందని అంచనా.