ఆరు రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఐటీ అధికారులు దాడులు
ఆదాయపన్ను ఎగవేసే ఉద్దేశంతో ఆరు రియల్ ఎస్టేట్ కంపెనీలు రూ.600 కోట్లకు పైగా లావాదేవీలు నగదు రూపంలో జరిపినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. నోయిడాలోను ఆరు రియల్ ఎస్టేట్ కంపెనీలపై వరసగా ఆరు రోజులపాటు దాడులు నిర్వహించి కీలక పత్రాలతోపాటు రూ.16 కోట్లకు పైగా విలువైన నగదు, నగలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ.600 కోట్ల మేర నగదు లావాదేవీలు జరిపినట్టు గుర్తించామని అధికారులు వెల్లడించారు. చాలాకాలంగా ఆ కంపెనీలు తమ రెసిడెన్షియల్, వాణిజ్య ప్రాజెక్టుల్లోని యూనిట్ల విక్రయానికి సంబంధించి నగదు లావాదేవీలు జరుపుతున్నాయని పేర్కొన్నారు. పన్ను ఎగవేసే ఉద్దేశంతోనే ఇలా చేశాయని వివరించారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న పత్రాలను పరిశీలిస్తున్నామని.. విచారణ పూర్తయిన తర్వాత చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.