poulomi avante poulomi avante

వుజ్వ‌లంగా ప్రీలాంచ్‌లో ఫ్లాట్ల అమ్మ‌కం

  • కాకినాడ బిల్డ‌ర్‌
    సిటీలో కాలుమోపాడు
  • ప్రీలాంచ్ అంటూ
    ఫ్లాట్లు అమ్ముతుండు
  • ధ‌ర‌.. రూ.3499 (చ.అ.కీ.)
  • రెరా క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాలిహైద‌రాబాద్‌లో ఎలాగైనా ప్రాజెక్టుల్ని నిర్మించాల‌నే ఆలోచ‌న పొరుగు రాష్ట్రాల బిల్డ‌ర్ల‌కు ఉంటుంది. ఎక్క‌డైనా మంచి స్థ‌లం ల‌భిస్తే.. మెరుగైన ప్రాజెక్టును నిర్మించి త‌మ స‌త్తాను చాటాల‌ని తాప‌త్ర‌య ప‌డుతుంటారు. ఇలాంటి వారంతా నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా నిర్మాణాల్ని చేప‌డుతుంటారు. అయితే, మ‌రో ర‌క‌మైన వ్య‌క్తులు హైద‌రాబాద్‌లోకి అడుగుపెడుతున్నారు. వీరిలో అధిక శాతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌జ‌ల్ని మోసం చేసి.. అదే త‌ర‌హాలో భాగ్య‌న‌గ‌రంలోనూ మోసానికి తెర‌లేపే బాప‌తు వ్య‌క్తులు వీరంతా. ఇలాంటి వారు న‌గ‌రంలో క‌రోనా త‌ర్వాత ఎక్కువ‌గా ప్ర‌వేశించారు. ఈ క్ర‌మంలో తాజాగా కాకినాడ‌కు చెందిన వుజ్వ‌ల హౌసింగ్ అనే సంస్థ హైద‌రాబాద్‌లో ప్ర‌ప్ర‌థ‌మ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అయితే, ఈ సంస్థ ఏం చేసిందో తెలుసా?

    హైద‌రాబాద్లో ప్రీలాంచ్ అంటే ప్ర‌జ‌లు పిచ్చిప‌ట్టిన‌ట్లు కొంటార‌ని భావించిన వుజ్వ‌ల హౌసింగ్ సంస్థ‌.. రూ. 45 ల‌క్ష‌ల‌కే ఫ్లాట్లు అంటూ సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేస్తోంది. అందులోని ఫోన్ నెంబ‌ర్ల‌కు కాల్ చేసి రియ‌ల్ ఎస్టేట్ గురు ప్ర‌తినిధి ప‌లు వివ‌రాల్ని సేక‌రించారు. ప‌టాన్‌చెరు త‌ర్వాత భానూరు త‌ర్వాత వ‌చ్చే పాటి ఘ‌న‌పూర్‌లో ఆ సంస్థ ఎనిమిది ఎక‌రాల్లో 520 ఫ్లాట్ల‌ను నిర్మిస్తున్న‌ట్లు చెబుతోంది. హండ్రెడ్ ప‌ర్సంట్ పేమెంట్ చేసేవారికి బంప‌ర్ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. చ‌ద‌ర‌పు అడుక్కీ రూ.3499కే ఫ్లాట్ల‌ను విక్ర‌యిస్తోంది. యాభై శాతం సొమ్ము ముందే క‌డితే రేటు రూ.3,999కే అమ్ముతోంది. అదే 20 శాతం సొమ్ము క‌ట్టేవారికి మాత్రం రూ.4,999 చొప్పున అమ్ముతోంది. హాస్పిటల్స్, స్కూల్, ఐటీ వర్క్ స్టేషన్, హైటెక్ సిటీ, మైండ్ స్పేస్ వంటి ఐటీ కార్యాలయాలకు ఇర‌వై నుంచి ముప్ప‌య్ నిమిషాల్లో చేరుకోవ‌చ్చే ప్ర‌చారాన్ని ఈ సంస్థ నిర్వ‌హిస్తోంది. ఈ వుజ్వ‌లా హౌసింగ్‌, ట్రినిటీ వెంచ‌ర్స్‌లో ఫ్లాట్లు కొనుక్కునేవారు అనుమ‌తుల‌న్నీ ప‌క్కాగా ఉన్నాయా? లేవా? అనే అంశాన్ని ప‌రిశీలించాకే తుది నిర్ణ‌యం తీసుకోవాలి. ముందే డ‌బ్బులు వీరి చేతిలో పోసి ఆ త‌ర్వాత ఆకులు ప‌ట్టుకోవ‌డం వ‌ల్ల ఉప‌యోగం ఉండ‌దు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles