poulomi avante poulomi avante

టీమ్ – 4 సంస్థ‌లో.. ఆ న‌లుగురు ఎవ‌రు?

Team 4 New Pre Launch Scam in Miyapur

  • ముచ్చ‌టగా మూడో ప్రీలాంచ్ ప్రాజెక్టు
  • ప‌ది శాతం జ‌రిమానా విధించాలి
  • బిల్డ‌ర్ లైసెన్సును ర‌ద్దు చేయాలి
  • ప్రీలాంచ్ చేస్తే రెరా నెంబ‌ర్ ఇవ్వ‌కూడ‌దు

 

హైద‌రాబాద్ నిర్మాణ రంగంలో నెల‌కొన్న ఓ దౌర్భాగ్య‌మైన ప‌రిస్థితి ఏమిటంటే.. రెరా అనుమ‌తి తీసుకోకుండానే.. ఆకాశ‌హ‌ర్మ్యాల్ని క‌డుతున్నామ‌ని చెబుతూ.. ప్ర‌జ‌ల నుంచి సొమ్ము వ‌సూలు చేయ‌డం ఒక ఫ్యాష‌నైంది. అధిక ఎస్ఎఫ్‌టీ ఇస్తామంటూ ల్యాండ్ లార్డ్స్‌కు ఆశ‌చూపెట్టి.. ఎంతో కొంత అడ్వాన్సులు చెల్లించి.. ఎక్క‌డ ప‌డితే అక్క‌డ స్థ‌లం తీసుకుని.. ప్రీలాంచుల్ని చేయ‌డం ఒక ఫ్యాష‌న్‌గా మారింది. తాజాగా టీమ్ 4 అనే సంస్థ మియాపూర్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వ‌ద్ద ముచ్చ‌ట‌గా మూడో ప్రీలాంచ్ ప్రాజెక్టును ప్రారంభించ‌డ‌మే ఇందుకు ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌. టీమ్ 4 పేరిట.. ఇప్ప‌టివ‌ర‌కూ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేసిన చ‌రిత్ర లేని సంస్థ‌.. ఇంత నిస్సిగ్గుగా మ‌రో ప్రాజెక్టును ప్రీలాంచ్‌లో అమ్ముతున్న‌దంటే.. రెరా అథారిటీ నిద్ర‌పోతుందా అని నిర్మాణ రంగం ప్ర‌శ్నిస్తున్న‌ది. ఈ క్ర‌మంలో టీమ్-4 అనే సంస్థలో స‌భ్యులెవ‌రు? వారి క‌థాక‌మామీషూ ఏమిట‌నే విష‌యం రియ‌ల్ ఎస్టేట్ గురు తెలుసుకునే ప్ర‌య‌త్నం చేసింది.

టీమ్‌-4లో గ‌ల న‌లుగురు స‌భ్యుల్లో.. ప్రాస్ప‌రా గ్రూప్‌, గుంటూరుకు చెందిన జ్యోతిర్మ‌యి ప్రాప‌ర్టీస్‌, లాన్స‌మ్ ఎటానియా గ్రూపున‌కు చెందిన రాజేష్ ప్ర‌సాద్‌, యూలా క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ కొండ‌య్య వంటివారున్నార‌ని తెలిసింది. వారి వెబ్‌సైట్ల‌లో చూస్తే.. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు తెలిశాయి. అవేమిటంటే..
ప్రాస్ప‌రా గ్రూప్ అల్కాపురి టౌన్‌షిప్‌లో ద డ్రిజిల్ అనే ప్రాజెక్టును ఆరంభించింది. మూడు ఎక‌రాల్లో ఆరు ట‌వ‌ర్ల‌ను నిర్మిస్తోంది. అంటే, ఇది నిర్మాణ ద‌శ‌లోనే ఉంది. కొనుగోలుదారుల‌కు ఇంకా అంద‌జేయ‌లేద‌ని అర్థం. అదిరిపోయే గ్రాఫిక్స్ తో ఐటీ నిపుణులు, ప్ర‌వాసుల మ‌తి పోగొడుతున్న ఈ ప్రాజెక్టు ఎప్పుడు పూర్త‌వుతుంది? అందులో కొనుగోలుదారులు ఎంత‌మేర‌కు సంతృప్తి ఉన్నారో తెలిసేందుకు కొంత స‌మ‌యం ప‌డుతుంది.
గుంటూరుకి చెందిన జ్య‌తిర్మ‌యి ప్రాప‌ర్టీస్ ముర‌ళీకృష్ణా అనే వ్య‌క్తి ఇందులో భాగ‌స్వామిగా ఉన్నాడు. ఈ సంస్థ సైటులోకి వెళితే.. ఈ సంస్థ అమ‌రావ‌తిలో ఆరంభించిన పామ్ స్ప్రింగ్స్ ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదు. ఈ కంపెనీ ఐదు అంత‌స్తుల్లోపు మూడు నిర్మాణాలు చేప‌ట్టిన‌ట్లు సైటులో క‌నిపిస్తోంది.
లాన్స‌మ్ గ్రూపున‌కు చెందిన రాజేష్ ప్ర‌సాద్‌.. అందులో నుంచి బ‌య‌టికొచ్చి టీమ్ 4 లైఫ్ స్పేసెస్ బృందంలో స‌భ్యుడయ్యాడు. ఎటానియా అనే స్కై స్క్రేప‌ర్ పూర్తి చేసిన సంస్థ‌లో ఒక స‌భ్యుడు. ఇత‌ను మిన‌హా మిగ‌తా ఎవ్వ‌రికీ క‌నీసం ఒక్క స్కై స్క్రేప‌ర్ ను విజ‌య‌వంతంగా పూర్తి చేసిన అనుభ‌వం లేదు. కాక‌పోతే, ఆ ప్రాజెక్టును కూడా ఇదే విధంగా ముందుస్తుగా అమ్మ‌కాలు చేసిన‌ట్లుగా తెలిసింది.

యూలా క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ కొండ‌య్య ఇంత‌వ‌ర‌కూ నిర్మించిన అపార్టుమెంట్లే మూడు. అవి కూడా ఐదు అంత‌స్తుల్లోపువే. అందులో ఆకాశ‌హ‌ర్మ్యం ఒక్క‌టి కూడా లేదు.

ఇలా, ఆకాశ‌హ‌ర్మ్యాల్ని నిర్మించిన గ‌త చ‌రిత్ర లేని సంస్థ‌లు.. మార్కెట్లోకి వ‌చ్చి స్కై స్క్రేప‌ర్ల‌ను క‌డ‌తామంటే.. బ‌య్య‌ర్లు గుడ్డిగా ఎలా న‌మ్ముతున్నారో అర్థం కావ‌ట్లేదు. ప్రీలాంచుల్లో ఫ్లాట్ల‌ను విక్ర‌యించిన త‌ర్వాత‌.. మ‌ళ్లీ అదే సంస్థ రెరా వ‌ద్ద‌కెళ్లి ప‌ర్మిష‌న్ తెచ్చుకుంటుందంటే.. దొంగ‌త‌నం చేసిన దొంగ‌కు ప్ర‌భుత్వ‌మే పిలిచి అవార్డు ఇచ్చిన‌ట్లుగా ఉంద‌ని నిర్మాణ రంగం అంటున్న‌ది. కాబ‌ట్టి, ప్రీలాంచుల్లో ఫ్లాట్ల‌ను అమ్మే సంస్థ‌పై భారీ జ‌రిమానాను విధించాలి. ఆయా కంపెనీ బిల్డ‌ర్ లైసెన్సును ర‌ద్దు చేయాల‌ని స్థానిక సంస్థ‌ల‌కు రెరా సిఫార్సు చేయాలి. పైగా, ఆయా ప్రాజెక్టుకు ఎట్టి ప‌రిస్థితిలో రెరా అనుమ‌తిని మంజూరు చేయ‌కూడ‌దు. ఇలా రెరా క‌ఠిన‌మైన నిర్ణ‌యాల్ని తీసుకున్న‌ప్పుడే.. హైద‌రాబాద్లో ప్రీలాంచుల్లో ఫ్లాట్ల‌ను విక్ర‌యించ‌డానికి ఎవ‌రూ సాహ‌సించ‌రు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles