-
అమ్మకాల్లో సరికొత్త రికార్డు
-
లొకేషన్ అడ్వాంటేజ్
-
ఆఫర్ ధర అదుర్స్
స్ట్రాటజిక్ లొకేషన్‌లో ఆకర్షణీయమైన స్పెసికేషన్స్‌తో ఆరంభించే ప్రాజెక్టులను కొనుగోలుదారులు అక్కున చేర్చుకుంటారనే విషయం మరోసారి నిరూపితమైందని వాసవి గ్రూప్ సీఎండీ ఎర్రం విజయ్ కుమార్ తెలిపారు. కూకట్‌పల్లిలో వాసవి సరోవర్ ప్రాజెక్టును ప్రారంభించిన నాలుగు రోజుల తర్వాత రియల్ ఎస్టేట్ గురుతో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. వాసవి సరోవర్ నిర్మాణానికి ఇంటి కొనుగోలుదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే..
వాసవి సరోవర్ ప్రాజెక్టు కూకట్‌పల్లిలో ఆరంభించాం. ఇక్కడ్నుంచి మూసాపేట్ మెట్రో కానీ కూకట్‌పల్లి మెట్రో కానీ చేరువలో ఉంటుంది. మాదాపూర్‌లో పని చేసే ఐటీ నిపుణులు సులువుగా రాకపోకల్ని సాగించొచ్చు. షాపింగ్ మాళ్లు, మల్టీప్లెక్స్ థియేటర్లు చేరువగా ఉన్నాయి. సమీపంలోనే స్కూళ్లు, కాలేజీలున్నాయి. పైగా, ఫ్లాట్ ఆరంభ ధర చదరపు అడుక్కీ రూ.6,999గా నిర్ణయించాం. అందుకే, కేవలం నాలుగు రోజుల్లోనే వంద ఫ్లాట్లను అమ్ముడయ్యాయి. ఇందులో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనలున్నవారే ఎక్కువగా కొనుగోలు చేశారు. ఇంకా, అనేకమంది వాసవి సరోవర్‌లోనే తీసుకోవాలని ప్రణాళికల్ని రచిస్తున్నారు.
ఒక్కో లేక్ కోసం రూ.10 కోట్ల ఖర్చు
మా వాసవి సరోవర్ ప్రాజెక్టుకు చేరువలో మూడు చెరువులున్నాయి. అందుకే, వీటిని కళాత్మకంగా తీర్చిదిద్దాలని నిర్ణయించాం. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ కింద ఒక్కో చెరువును సుమారు పది కోట్లు వెచ్చించి డెవలప్ చేస్తున్నాం. హైదరాబాద్‌లోనే అత్యుత్తమ ప్రాంతంగా ఈ ఏరియా ఉండాలన్న ఏకైక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. ఈ పనులు పూర్తయ్యాక ఎవరైనా వచ్చి చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. భవిష్యత్తులో అభివృద్ధి చేసే చెరువులకు మార్గదర్శకంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నాం. ఈ ప్రాజెక్టును 2026 చివరికల్లా పూర్తి చేసి కొనుగోలుదారులకు అందజేస్తాం.
ఆరు ఎకరాలు ఓపెన్ స్పేస్..
వాసవి సరోవర్ మొత్తం 21 ఎకరాలు అయినప్పటికీ.. ఆరు ఎకరాల్ని ఓపెన్ స్పేసెస్‌గా వదిలేశాం. యావత్ దక్షిణ భారతదేశంలో ఇంతకంటే ఎక్కువ ఓపెన్ స్పేస్‌ను వదిలిపెట్టిన కమ్యూనిటీయే లేదని చెప్పొచ్చు. వాసవి సరోవర్ ఆఫర్ ధరకు బయ్యర్ల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రాజెక్టు లాంచ్ తేదీ నుంచి నెల రోజుల వరకూ స్పిన్ అండ్ విన్ అనే కాన్సెప్టును ప్రవేశపెట్టాం. దీని ద్వారా ఫ్లాట్ కొనుగోలు చేసినవారికి పలు బంపర్ బహుమతుల్ని అందజేస్తున్నాం. కొంతమంది కస్టమర్లకు కార్ పార్కింగ్ ఉచితంగా ఇస్తున్నాం. భార్యాభర్తల్ని బాలీ ట్రిప్‌కు పంపిస్తాం. నెక్సాన్ ఈవీ కారును కూడా బహుమతిగా ఇస్తాం. ఇలా స్పిన్ అండ్ విన్‌లో భాగంగా వివిధ బహుమతుల్ని అందజేస్తాం.