కోకాపేట్లో ఆలయ భూమిని హెచ్ఎండీఏ వేలం వేసిందంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని హెచ్ఎండీఏ ఒక పత్రికా ప్రకటనలో తెలియజేసింది. ఆలయ ప్రవేశం కోసం ప్రత్యేకంగా రోడ్డు ఏర్పాటు చేస్తున్నామంటూ హెచ్ఎండీఏ స్కెచ్‌ను హెచ్ఎండిఏ విడుదల చేసింది.
నియోపోలీస్ ఫేజ్ -II లో ప్లాట్ల వేలం కోసం ప్లాన్ చేస్తున్నప్పుడు సర్వే నెంబర్లు 239 & 240ల సరిహద్దులో ఉన్న ఆలయాన్ని హెచ్ఎండిఏ అధికారులు పరిగణనలోకి తీసుకున్నారని తెలియజేసింది. కోకాపేట్ నియోపోలీస్ లేఅవుట్ లో ఆలయ భూమిని హెచ్ఎండీఏ వేలం వేసిందంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని.. హెచ్ఎండీఏ ప్రతిష్టతను దెబ్బతీసేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తుట్లుగా భావిస్తున్నామని తెలియజేసింది.