poulomi avante poulomi avante

జీసీసీల‌ ఆక‌ర్ష‌ణ‌లో హైద‌రాబాద్‌ నెంబ‌ర్ వ‌న్ దిశ‌గా..

Hyderabad is becoming number one in attracting GCC's

  • భార‌త్‌లోకి ప్ర‌ప్ర‌థ‌మ ఎంఎన్‌సీ 1985లో
  • 1992లో పుణెలోకి మొద‌టి సాఫ్ట్‌వేర్ సంస్థ
  • 2023 ప్ర‌థ‌మార్థం హైద‌రాబాద్లో అధికం
  • వీటి రాక‌తో ఉద్యోగావ‌కాశాలు పెరుగుతాయ్‌
  • రియ‌ల్ రంగానికి పెరిగే డిమాండ్‌

(కింగ్ జాన్స‌న్ కొయ్య‌డ‌)

జీసీసీ (గ్లోబ‌ల్ క్యాప‌బిలిటీ సెంటర్‌) ల‌ను ఆక‌ర్షించ‌డంలో హైద‌రాబాద్ క్ర‌మ‌క్ర‌మంగా బెంగ‌ళూరును అధిగ‌మిస్తోంద‌ని సిరిల్ సంస్థ తాజా అధ్య‌య‌నంలో వెల్ల‌డించింది. 2023 ప్ర‌థ‌మార్థంలో బెంగ‌ళూరుతో పోల్చితే అధిక జీసీసీల‌ను ఆక‌ర్షించ‌డ‌మే ఇందుకు ప్ర‌ధాన కార‌ణం. అస‌లు జీసీసీలంటే ఏమిటి? ఇవి ఎప్పుడు మ‌న దేశంలోకి అడుగుపెట్టాయి? వీటి వ‌ల్ల హైద‌రాబాద్‌కు ఒన‌గూడే ప్ర‌యోజ‌న‌మేమిటి? వీటి రాక‌తో రియ‌ల్ రంగానికి క‌లిగే లాభమేమిటి?

జీసీసీ అన‌గా ఇదో ఆఫ్‌షోర్ సెంట‌ర్ అని చెప్పొచ్చు. అంటే, విదేశీ సంస్థ‌లు త‌మ కార్య‌క‌లాపాల్ని నిర్వ‌హించ‌డానికి హైద‌రాబాద్‌లో కార్యాల‌యాల్ని ఏర్పాటు చేయ‌డం అన్న‌మాట‌. వీటిని ప్ర‌పంచ‌స్థాయి సంస్థ‌లుగా అభివ‌ర్ణించొచ్చు. విదేశీ సంస్థ‌ల‌కు సంబంధించిన ఐటీ సేవ‌లు, ప‌రిశోధ‌న‌, అభివృద్ధి, క‌స్ట‌మ‌ర్ సపోర్టు వంటి కార్య‌క‌లాపాల్ని భాగ్య‌న‌గ‌రం నుంచి నిర్వ‌హిస్తారు. ఉదాహ‌ర‌ణ‌కు, అమెరికాకు చెందిన ఒక సంస్థకు సంబంధించిన కార్యక‌లాపాల్ని హైద‌రాబాద్ నుంచి నిర్వ‌హించ‌డ‌మే జీసీసీల‌ని చెప్పొచ్చు. ఇవి మ‌నదేశంలోకి ఇప్పుడిప్పుడే కొత్త‌గా రావ‌ట్లేదు. 1980లోనే ఆరంభ‌మ‌య్యాయి. 1990 నుంచి విస్తృత‌మ‌య్యాయి. జ‌న‌ర‌ల్ ఎల‌క్ట్రిక్‌, సిటీ గ్రూప్‌, అమెరిక‌న్ ఎక్స్‌ప్రెస్ వంటివి ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా చెప్పొచ్చు. ఇవి భార‌త ఐటీ మ‌రియు వ్యాపార సేవ‌ల ప‌రిశ్ర‌మ‌కు వెన్నెముక్క వంటివి. గ‌త ద‌శాబ్దం నుంచి వీటి సేవ‌ల‌కు సంబంధించి వినూత్న ఆవిష్క‌ర‌ణ‌లు చోటు చేసుకున్నాయి.

మార్కెట్ సైజెంత‌?

ప్ర‌పంచంలో గ‌ల జీసీసీల్లో యాభై శాతం వాటా భార‌త‌దేశానిదే కావ‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టివ‌ర‌కూ సుమారు 1580 సంస్థ‌లుండ‌గా వీటి సంఖ్య పెరుగుతోంది. 2025 నాటికి ఈ సంఖ్య 1900కు చేరుకుని.. 2030 నాటికి 2400కు చేరుకుంటాయ‌ని సిరిల్ సంస్థ అంచ‌నా వేస్తోంది. వ‌చ్చే ఐదేళ్ల‌లో వీటి విలువ సుమారు 60-85 అమెరిక‌న్ బిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరుకునే అవ‌కాశ‌ముంది. అంటే, అప్ప‌టికీ ప్ర‌పంచంలోని 500 ఫార్చ్యూన్ సంస్థ‌లు మ‌న‌దేశంలోనే ఉంటాయ‌ని గుర్తుంచుకోండి.

* స‌రికొత్త ఆవిష్క‌ర‌ణ‌ల కార‌ణంగా 2012 నుంచి 2023 దాకా మ‌న‌దేశంలో జీసీసీల సంఖ్య అధికమైంది. వీటిలో ప్ర‌స్తుతం 19 ల‌క్ష‌ల మంది ఉద్యోగులు ప‌ని చేస్తున్నారు. ఈ సంఖ్య 45 ల‌క్ష‌ల‌కు చేరుకునే అవ‌కాశ‌ముంది. 2018 నుంచి 2023 దాకా ఈ రంగంలో 12.1 శాతం వృద్ధి న‌మోదైంది. 2023 నుంచి 2030 దాకా సుమారు 14 శాతం వృద్ధి చోటు చేసుకునేందుకు ఆస్కార‌ముంద‌ని అంచ‌నా.

జీసీసీలో మ‌న‌మెక్క‌డ‌?

మ‌న‌దేశంలోని ఆరు న‌గ‌రాలు జీసీసీల ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నాయి. బెంగ‌ళూరు, ఢిల్లీ ఎన్‌సీఆర్‌, ఢిల్లీ, గురుగ్రామ్‌, హైద‌రాబాద్, పుణె వంటివి ప్ర‌ధాన‌మైన‌వి. మౌలిక స‌దుపాయాలు, ట్యాలెంట్ పూల్‌, స‌పోర్టింగ్ ఎకో సిస్ట‌మ్ వంటివి ఉండటంతో వీటి ఏర్పాటు సుల‌భంగా మారింది. జీసీసీలు దాదాపు 203 మిలియ‌న్ చ‌ద‌ర‌పు అడుగుల స్థ‌లంలో ఏర్పాటు కాగా.. వీటిలో 55 శాతం వాటా బెంగ‌ళూరు, హైద‌రాబాద్‌ది కావ‌డం గ‌మ‌నార్హం. దేశంలోని ద్వితీయ శ్రేణీ ప‌ట్ట‌ణాల్లోనూ అడుగుపెట్టేందుకు ఈ సంస్థ‌లు ముందంజ‌లో ఉన్నాయి. విశాఖ‌ప‌ట్నం, జైపూర్‌, వ‌డోద‌ర‌, కొచ్చి, భువ‌నేశ్వ‌ర్, చంఢిఘ‌డ్ వంటివి ఆక‌ర్షిస్తున్నాయి. అంతెందుకు, రానున్న రోజుల్లో త‌మిళ‌నాడులోని చెన్నై, కోయంబ‌త్తూరు వంటివి జీసీసీ హ‌బ్‌గా అవ‌త‌రించే అవ‌కాశాలున్నాయి.


హైద‌రాబాద్ ఎందుకు?

భాగ్య‌న‌గ‌రంలో చ‌దువుకున్న యువ‌త‌కు కొద‌వ లేదు. మౌలిక స‌దుపాయాలు మెరుగ్గా అభివృద్ధి చెందుతున్నాయి. ఐఎస్‌బీ, ట్రిపుల్ ఐటీ, బిట్స్ పిలానీ వంటి ప‌లు అంత‌ర్జాతీయ విద్యాసంస్థ‌లు ఉండటం హైద‌రాబాద్‌కు క‌లిసొచ్చే అంశం. హైద‌రాబాద్ మ‌రియు చుట్టుప‌క్క‌ల ప్రాంతాల నుంచి ఎక్కువ ఐటీ ఉద్యోగులు వివిధ సంస్థ‌ల్లో ప‌ని చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఏటా ల‌క్ష మంది ఇంజినీర్లు చ‌దువును పూర్తి చేసుకుంటున్నారు. వీరిలో స‌గం మంది ఇత‌ర మెట్రో న‌గ‌రాల్లో సైతం ఉద్యోగం చేస్తున్నారు.

  • అంత‌ర్జాతీయ సంస్థ‌ల్ని ఆక‌ర్షించ‌డంలో.. గ‌త రెండేళ్ల నుంచి హైద‌రాబాద్ గ‌ణ‌నీయ‌మైన పురోగ‌తి సాధించింది. మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, అమెజాన్‌, యాపిల్‌, వెల్స్‌ఫార్గో, బ్యాంక్ ఆఫ్ అమెరికా, హెచ్ఎస్‌బీసీ, ఫ్రాంక్లీన్ టెంపుల్ట‌న్‌, బ్రాండ్‌రిడ్జ్‌, ఏడీపీ, జేపీ మోర్గాన్‌, నోవార్టిస్‌, డెలాయిట్ వంటి జీసీసీలు ఇప్ప‌టికే హైద‌రాబాద్‌లో ఉన్నాయి.
  • గ‌త ఐదు నుంచి ఏడేళ్ల‌లో.. డీబీఎస్ బ్యాంక్‌, పెప్సీ, చ‌బ్, మాస్ మ్యూచువ‌ల్‌, గోల్డ్ మాన్ సాచ్స్‌, స్విస్ ఆర్ఈ, అడ్వాన్స్డ్ ఆటోపార్ట్స్‌, ఆర్సేసియం, జీఏపీ, జెడ్ఎఫ్‌, స్టేట్ స్ట్రీట్‌, ఇంటెల్‌, ఐసీఈ, ఎఫ్‌ఫైవ్ నెట్‌వ‌ర్క్స్‌, మైక్రోఆన్‌, కాల్ల‌వే గోల్ఫ్ వంటివి హైద‌రాబాద్‌లో జీసీసీ కేంద్రాల్ని ఏర్పాటు చేస్తున్నాయి.

2023 ప్ర‌థ‌మార్థంలో..

గోల్డ్‌మాన్ సాచ్చ్‌, లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్‌, అమెరిక‌న్ ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్‌, స్టేట్ స్ట్రీట్‌, ఫెడెక్స్‌, అపోలో టైర్స్ వంటివి 2023 ప్ర‌థ‌మార్థంలో హైద‌రాబాద్‌లోకి అడుగుపెట్టాయి.

  • 1985- 2000
    మ‌న‌దేశంలోకి ప్ర‌ప్ర‌థ‌మంగా అడుగుపెట్టిన ఎంఎన్‌సీ టెక్సాస్‌ ఇన్‌స్ట్రుమెంట్స్ సంస్థ‌. ఇది 1985లో బెంగ‌ళూరులో ఏర్పాటైంది. 1992లో పుణెలో వెరిటాస్ సాఫ్ట్‌వేర్ సంస్థ ఆర్ అండ్ డీ కేంద్రాన్ని మొద‌లెట్టింది. త‌ర్వాత ఏటీ అండ్ టీ/ లూసెంట్‌, స‌న్ మైక్రోసిస్ట‌మ్స్‌, ఒరాకిల్ వంటి కంపెనీలు ఆరంభ‌మ‌య్యాయి.
  • 2001- 2005
    2000లో కేంద్రం స్పెష‌ల్ ఎక‌న‌మిక్ జోన్ల‌కు శ్రీకారం చుట్టింది. ట్యాక్స్ హాలీడేను ప్ర‌క‌టించింది. ఫ‌లితంగా, భార‌త‌దేశంలో యువ‌త ట్యాలెంట్‌కు స‌రికొత్త ప్రోత్సాహం ల‌భించింది. దీంతో 2005 నాటికి 600 క్యాప్టివ్ కేంద్రాలు ఏర్పాట‌య్యాయి.
  • 2006- 2010
    జీసీసీలు ఐటీకి సంబంధించిన బ్యాక్ ఎండ్ సేవ‌లు, క‌స్ట‌మ‌ర్ స‌పోర్టు, ఫైనాన్స్ వంటి సేవ‌ల్ని 2000లో ఆరంభమైన‌ప్ప‌టికీ.. ఆత‌ర్వాతే ఆయా సంస్థ‌లు స‌ప్ల‌య్ ఛైన్‌, సేల్స్‌, హెచ్ఆర్ విభాగంలోకి అడుగుపెట్టాయి.
  • 2011- 2015
    బ్యాక్ ఎండ్ సేవ‌ల్ని అందించే జీసీసీలు.. క్ర‌మ‌క్ర‌మంగా ఫ్రంట్ ఆఫీస్ సేవ‌లను ఆరంభించాయి. ప్రాడ‌క్ట్ డిజైన్‌, ఆర్టిఫిషీయ‌ల్ ఇంటెలిజెన్స్ వంటి వాటితో పాటు డిజిట‌ల్ మార్కెటింగ్ మొద‌లెట్టాయి.
  • 2016-2022
    డిజిట‌ల్ సేవ‌లు ఆరంభం కావ‌డంతో క‌స్ట‌మ‌ర్ల ఎక్స్‌పెక్టేష‌న్ పెరిగింది. ఫ‌లితంగా, జీసీసీ ఎకో సిస్ట‌మ్‌లో మార్పు వచ్చింది. స్టార్ట‌ప్ ఎంగేజ్‌మెంట్‌, ఆన‌లిటిక్స్ జీసీసీ వంటివి మొద‌ల‌య్యాయి. దేశ్ బిల్లును ప్ర‌వేశ‌పెట్టారు.

లగ్జ‌రీ ఇళ్ల‌కు గిరాకీ

ఐదు వంద‌ల ఉద్య‌గుల‌తో ఆరంభ‌మైన ఊబ‌ర్ సంస్థ రెండువేల‌కు సామ‌ర్థ్యాన్ని పెంచుతోంది. జ‌ర్మ‌నీకి చెందిన జెడ్ఎఫ్ హైద‌రాబాద్‌లో ఉద్యోగుల సంఖ్య‌ను రెట్టింపు చేస్తోంది. మైక్రాన్ సంస్థ ప్ర‌ధాన కార్యాల‌యం త‌ర్వాత హైద‌రాబాద్‌లోనే అతిపెద్ద కేంద్రాన్ని ఆరంభించింది. మొత్తానికి హైద‌రాబాద్‌లో జీసీసీల సంఖ్య పెరుగుతుండటంతో ల‌గ్జ‌రీ ఇళ్ల‌కు గిరాకీ గ‌ణ‌నీయంగా పెరుగుతుంది. వీటికి కోకాపేట్ ప్ర‌ధాన లొకేష‌న్‌గా మారుతుంది. ఫ‌లితంగా, ఇక్క‌డి చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లోని అపార్టుమెంట్ల‌ను అపూర్వ ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. – ప్ర‌శాంత్ రావు, డైరెక్ట‌ర్‌, పౌలోమీ ఎస్టేట్స్

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles