poulomi avante poulomi avante

అర్ధరాత్రి కాల్స్.. తీరికలేని జీవితం

  • దుబాయ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ల పరిస్థితి ఇదీ

దుబాయ్.. వినోదానికి, విలాసాలకు నెలవైన దేశం. భారతీయుల దగ్గర నుంచి అనేక‌ దేశాలకు చెందినవారు దుబాయ్ లో సొంతిల్లు ఉండాలని ఆరాటపడుతున్నారు. ఈ నేపథ్యంలో దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అంతులేని వేగంతో దూసుకుపోతోంది. ఈ ఏడాది మొదటి అర్ధభాగంలోనే ఏకంగా 177 బిలియన్ ధీరమ్స్ విలువైన లావాదేవీలు జరగడమే ఇందుకు నిదర్శనం. ఈ పరిణామాలు రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు వరంలా మారాయి. చాలామంది ఇక్కడ ఏజెంట్లుగా పని చేస్తున్నారు. దాదాపు 35 వేల మంది దుబాయ్ రియల్ రంగంలో ఏజెంట్లుగా ఉన్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వీరిలో కొందరికి మాత్రమే లైసెన్స్ ఉంది. అయితే, ద‌గద‌గా మెరిసిపోయే దుబాయ్ లో రియల్ ఏజెంట్ల జీవితాలు మాత్రం ఏమీ మెరవడంలేదు. వారి జీవితంలోకి తొంగి చూస్తే.. ఎన్నో కష్టాలు కనిపిస్తాయి. అంతులేని శ్రమ, తీరికలేని జీవితం, నోరు నొప్పి పెట్టేలా ఫోన్ కాల్స్ మాట్లాడం.. ఇదీ వారి పరిస్థితి. నిరంతర వారి పోరాటమయ జీవితంలో విజయాలూ ఉన్నాయి. నైరాశ్యమూ ఉంది.

ఎడతెగని యుద్ధం..

దుబాయ్ లోని దాదాపు 35 వేల మంది ఏజెంట్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఒక రకంగా చెప్పాలంటే వారంతా ఎడతెగని యుద్ధం చేస్తున్నారు. ఏజెంట్లకు స్థిరమైన వేతనం ఉండద‌నే సంగతి తెలిసిందే. ఇక్కడ కూడా వారంతా కమీషన్ పై పని చేస్తారు. వారి ఆదాయం వారు చేసే డీల్స్ పై ఆధారపడి ఉంటుంది. ఒక లావాదేవీ పూర్తి చేయడం కోసం నెలల తరబడి పని చేయాల్సి ఉంటుంది. ఆ లావాదేవీ విజయవంతంగా పూర్తి చేసి కమీషన్ అందుకుంటే ఆ కష్టమంతా ఇట్టే మరచిపోతారు. మళ్లీ కొత్త కొనుగోలుదారుల వేటలో మునిగిపోతారు. తమ పోరాటానికి రివార్డులు అనేవి తగిన గుర్తింపు ఇస్తాయని నెస్రైన్ బైలెడ్ వ్యాఖ్యానించారు. ట్యూనీషియాకు చెందిన ఈమె 2020లో కరోనా మహమ్మారి సమయంలో దుబాయ్ వచ్చారు. తొలినాళ్లలో ఈ రంగంలో నిలదొక్కుకోవడానికి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. ‘8 మిలియన్ ధీరమ్ ల విలువైన ఆస్తిని విక్రయించడానికి నాకు నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ఒకవేళ నేను ఆ ఆస్తిని విక్రయించలేకపోతే ఏజెంట్ల జాబితా నుంచి నా పేరు తీసేవేసే ప్రమాదం ఉంది’ అని నాటి పరిస్థిని నెస్రైన్ గుర్తు చేసుకున్నారు. ఎట్టకేలకు గడువులోగా ఆ ఆస్తిని విక్రయించినట్లు చెప్పారు. ఇటు అమ్మకందారు, అటు కొనుగోలుదారు ఇద్దరికీ తాను ప్రాతినిధ్యం వహించినట్టు వెల్లడించారు. దుబాయ్ లోని ఖరీదైన ప్రాంతంలో 100 మిలియన్ ధీరమ్ ల విలువైన ఆస్తులను విక్రయించిన తర్వాత ఆమె ఇక వెను తిరిగి చూడలేదు.

నిజాయతీ.. చిత్తశుద్ధి..

డీఅండ్ బీ ప్రాపర్టీస్ లో ఆరేళ్లుగా పనిచేస్తున్న స్వీడిష్-ఇరాకీ సీనియర్ ప్రాపర్టీ కన్సల్టెంట్ అయా సాద్ అబ్దుల్ మునెమ్ తన అనుభవాన్ని ఇలా పంచుకున్నారు. ‘రియల్ ఎస్టేట్ చాలా కష్టమైన పని. నేనూ తరచుగా తెల్లవారుజాము 2 గంటల వరకు అంతర్జాతీయంగా మారథాన్ జూమ్ సమావేశాలు నిర్వహిస్తాను. టైం జోన్లలోతేడా కారణంగా ఇలా తప్పడం లేదు. నిజాయతీ, చిత్తశుద్ధి నా విజయానికి మూలస్తంభాలుగా ఉన్నాయి’ అని వివరించారు. ఇలాంటి నెస్రైన్, అయాలు ఎందరో కనిపిస్తారు. ఈ తీవ్రమైన పోటీ మార్కెట్లోకి ప్రవేశించడానికి అసంఖ్యాకమైన ఇతరులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ ప్రాపర్టీ లాంచ్ ఈవెంట్లోకి అడుగు పెట్టినా ఈ ఏజెంట్లు మీకు కనిపిస్తారు. చక్కని హెయిర్ స్టైల్, గడ్డంతో, నీట్ గా డ్రెస్ చేసుకుని కనిపిస్తారు. అబ్బాయిలే కాదు.. అమ్మాయిలు సైతం ఈ రంగంలో దూసుకెళ్లాలని భావిస్తున్నారు. తమ మాటలతో కొనుగోలుదారులను ఆకర్షిస్తుంటారు. ఇది నాణేనికి ఒక వైపు అయితే.. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసిన ఏజెంట్లపై కొనుగోలుదారులు చిన్నచూపే చూస్తుంటారు. చెత్త వృత్తులలో ఇది ఒకటిని భావించేవాళ్లే ఎక్కువ. ఇది ఏజెంట్ల జీవితంలో నాణేనికి రెండో వైపు. దుబాయ్ లో రియల్ ఏజెంట్ల పరిస్థితి మరింత దారుణంగా ఉందని, అత్యంత చెత్త వృత్తుల్లో ఇది నాలుగో స్థానంలో ఉందని తమ సర్వేలో తేలినట్టు ఇన్ సైట్ డిస్కవరీ సీఈఓ నిగెల్ సిల్లిటో చెప్పారు.

సంప్రదాయేతర వ్యూహాలు..

విజయమే లక్ష్యంగా పనిచేసే ఏజెంట్లు.. సంప్రదాయానికి భిన్నమైన వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. డిజిటల్ ఇన్నోవేషన్ పద్ధతులను అవలంభిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొనుగోలుదారులను చేరుకోవడం కోసం ఇన్ స్టా గ్రామ్ వంటి సాధనాలను వినియోగిస్తున్నారు. టిక్ టాక్ వీడియోలనూ ఇందుకు వాడుకుంటున్నారు. దుబాయ్ లో రియల్ ఎస్టేట్ ఏజెంట్ల దినచర్య దాదాపు ఒకేలా ఉంటుంది. ఉదయాన్నే వ్యాయామంతో వారి దినచర్య ప్రారంభమవుతుంది. అనంతరం కొత్త లాంచ్ లు ఏమైనా ఉంటే అక్కడకు హాజరు కావడం, క్లైంట్లను వెతుక్కుని వారిని ఆకర్షించడం, ఆస్తి బదిలీలు, ఇతరత్రా పనుల కోసం స్థానిక ట్రస్టీ కార్యాలయానికి వెళ్లడం.. ఇలా దాదాపు అందరి పనీ ఒక్కటే.

జ్ఞానమే శక్తి

రియల్ ఎస్టేట్ రంగంలో జ్ఞానమే శక్తి అని ఇరాన్ కు చెందిన సైనా నొక్కి చెప్పారు. ఇది కొత్త లాంచ్ లు, ట్రెండులు అర్థం చేసుకోవడం గురించి మాత్రమే కాదని, కొనుగోలుదారుల కోరికలను అర్థం చేసుకోవడం కూడా అని వ్యాఖ్యానించారు. ప్రతి ఒప్పందం ఓ రోలర్ కోస్టర్ రైడ్ వంటిదని, ఇక్కడ ప్రతి చర్యా ఓ సున్నితమైన నృత్యమేనని స్టాంప్ రియల్ ఎస్టేట్ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ అమ్జాద్ చౌదరి చెప్పారు. నెలలపాటు చర్చలు జరిగిన తర్వాత ఒక్కో కొనుగోలు ఒప్పందం కొలిక్కి వస్తుందన్నారు. ఇక ఏజెంట్లకు తమ పనిని, జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం నిజంగా సవాలే. ‘బయట నుంచి చూసేవారికి నా జీవితం సంపూర్ణంగా, బ్యాలెన్స్ డ్ గా ఉన్నట్టు కనిపిస్తుంది. నా జీవితం స్థిరంగా, ఆరోగ్యంగా, సమతుల్యంగా ఉందని నేను కూడా చెబితే అది అబద్ధం చెప్పినట్టే అవుతుంది’ అని సోఫియా పేర్కొన్నారు.

క్లయింట్లతో సత్సంబంధాలు..

క్లయింట్లతో సంబంధాలను పెంపొందించుకోవడం రియల్ రంగంలో చాలా ముఖ్యమైన అంశమని నస్రైన్ చెప్పారు. క్లయింట్లతో చక్కని రిలేషన్ మెయింటైన్ చేయడం అనేది ఉద్యానవనం ఏర్పాటు చేయడం వంటిదని.. ఈ రోజు నాటిన విత్తలనాలు తక్షణ ఫలితాలు ఇవ్వకున్నా.. సహనం, శ్రద్ధతో వేచి చూస్తే అవి విలువైన లావాదేవీలుగా మారతాయని వ్యాఖ్యానించారు. ‘నేను వ్యక్తిగత ఒప్పందాల కేం క్లయింట్ సంబంధాలకే ప్రాధాన్యత ఇస్తాను. విలువైన క్లయింట్ ను కోల్పోవడంతో పోలిస్తే.. ఒక్క డీల్ కోల్పోవడం చాలా తక్కువ నష్టం. సంతృప్తి చెందిన క్లయింట్ అనేది ఒక లావాదేవీ మాత్రమే కాదు.. వారు భవిష్యత్తులో మన వ్యాపారానికి మూలంగా మారొచ్చు. ఇతరులకు మన గురించి రిఫర్ చేయొచ్చు’ అని పేర్కొన్నారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles