రెరా నిబంధనలు ఉల్లంఘించినందుకు ఓ భూ అమ్మకపు ఒప్పందాలను ఒడిశా రెరా రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. సదరు భూ యజమాని భువనేశ్వర్ శివారులోని బలియంతలో ఎకరం భూమిలో 20 సబ్ ప్లాట్లు చేశారు. నిబంధనల ప్రకారం 500 చదరపు మీటర్ల కంటే పెద్ద ప్లాట్లను ఒడిశా రెరాలో నమోదు చేయాలి. అలాగే రెరాలో నమోదు కాకుండా వాటికి సంబంధించి వాణిజ్య ప్రకటనలు ఇవ్వడం, బుక్ చేసోవడం, మార్కెటింగ్ చేయడం, అమ్మకాలు జరపడం వంటివి కూడా చేయకూడదు.
కానీ ఈ నిబంధనలన్నింటినీ ఆ భూ యజమాని ఉల్లంఘించారు. దీనిపై ఓ కొనుగోలుదారు ఫిర్యాదు చేయడంతో రెరా విచారణ జరిపింది. నిబంధనల ఉల్లంఘన నిర్ధారణ కావడంతో ఆ అమ్మకపు ఒప్పందాలన్నీ రద్దు చేసింది. రెండు నెలల్లోగా పూర్తి అనుమతులు పొందాలని, అనంతరం 45 రోజుల్లోగా రెరాలో నమోదు చేసుకోవాలని ఆదేశించింది.