poulomi avante poulomi avante

లాస్ ఏంజిల్స్ లో ఇల్లు కట్టుకుంటా..

  • డెవిల్ హీరోయిన్ ఎల్నాజ్ నోరౌజీ

డెవిల్ సినిమాలో నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త హీరోయిన్ ఎల్నాజ్ నోరౌజీ విదేశాలలో కూడా పెట్టుబడి పెట్టారు. లేడీ రోస్ ఫేమ్ అయిన ఎల్నాజ్ ఈ రహస్యాన్ని చెప్పేశారు.

‘నేను రెండేళ్ల క్రితం జర్మనీలో ఓ అపార్ట్ మెంట్ కొన్నాను. నేను సింగిల్స్ లో పని చేస్తున్నాను. నేను ఆ దేశంలోనే పెరిగాను. నా తల్లిదండ్రులు ఇప్పటికీ అక్కడే నివసిస్తున్నారు. అందువల్ల నేను అక్కడే అపార్ట్ మెంట్ కొన్నాను. ఒకవేళ నేను జర్మనీలో ఉంటే, నా కొత్త అపార్ట్ మెంట్ కు తిరిగి వెళతాను’ అని ఎల్నాజ్ తెలిపారు. డెకార్ కి సంబంధించి తన అభిప్రాయాలను కూడా ఆమె పంచుకున్నారు. ‘నాకు విలాసవంతమైన డెకర్ మీద నమ్మకం లేదు.

అలా అని మరీ మినిమలిస్టిక్ కూడా కాదు. రెండింటికీ మధ్యలో ఉన్నాను. మనం ఆధునిక ప్రపంచంలో జీవిస్తున్నాం. అందువల్ల మనం నివసించే స్థలం అందాన్ని మెరుగుపరుచుకునే అవకాశం ఉంది. నేను మరీ ఎక్కువగా తెలుపు వైపు వెళ్లను. నాకు పాస్టెల్స్ అంటే ఇష్టం. ఎందుకంటే రంగులు ఇంటీరియర్ రూపాన్ని మార్చగలవు. అంతేకాకుండా మన మానసిక స్థితిని కూడా ప్రభావితం చేస్తాయి. క్రీమ్ రంగులు బాగుంటాయి. నా డిజైన్ సౌందర్యాన్ని వ్యక్తీకరించడానికి ఈ రంగుల స్కీమ్ పై ఆధారపడటంలో ఓ ప్రత్యేకత ఉంటుంది’ అని వివరించారు.

టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ భామ.. తన ఇంటికి పాస్టెల్ రంగులు జోడించాలని భావిస్తున్నారు. ‘ఈ ప్రపంచంలోని డబ్బంతా నా దగ్గర ఉంటే నా కోసం ఓ పెద్ద భవనాన్ని కొనుగోలు చేయకుండా ఉండను. ఇక ఇంటీరియర్స్ అనేవి ఎల్లప్పుడూ భారీ డిజైన్లతో ఉండాల్సి అవసరం లేదు. ఇంటీరియర్ డిజైనర్ సహకారంతో కొన్ని చిట్కాలు, ఉపాయాలను ఉపయోగించి నా ఇంటిని రాయల్ గా మార్చాలనుకుంటున్నాను.

నా ఇంట్లో చాలా హాయిగా జీవించాలన్నదే నా అభిలాష’ అని ఎల్నాజ్ పేర్కొన్నారు. ఆమె పాత కలల సౌథాన్ని కోరుకోవడంలేదు. దానికి బదులుగా ఫ్యాన్సీ లుకింగ్ ఉన్న ఇల్లు కావాలనుకుంటున్నారు. ఆమె తన ఇంటిని రకరకాల వస్తువులతో అలంకరించాలని భావిస్తున్నారు. అది కూడా కేవలం విలాసవంతమైన అప్పీల్ కోసమే. ‘సినిమాల్లో చూపించే ప్యాలెస్ సరిగ్గా అదే. ఆ ఫౌంటైన్లు విశాలమైన తోట మధ్యలో ఉన్నాయి. నేను ఎల్లప్పుడూ పెద్దగా కలలు కంటూ ఉంటాను. దాని గురించి నిరాడంబరంగానే ఉంటాను. షూటింగ్ లేనప్పుడు డ్రెస్సింగ్ రూమ్ లో గడపడం ఇష్టం. అలాగే ఓ లైబ్రరీ కూడా ఉండాలని కోరుకుంటాను’ అని చెప్పారు.

తన కలల సౌధం ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నారని అడగ్గా.. లాస్ ఏంజిల్స్ అని సమాధానమిచ్చారు. ‘అవును. లాస్ ఏంజిల్స్ నాకు చాలా ఇష్టం. అక్కడ రెండో ఇల్లు కట్టుకోవాలని ఆలోచనతో ఉన్నాను. అలాగే జాకూజీ (బాత్ టబ్) కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. ఇండియాలో అలాంటి బాత్ టబ్ లేకపోవడం కొంచెం బాధ కలిగించే అంశం. మన దేశం బయట రియల్ ఎస్టేట్ పరిస్థితి ఘోరంగా ఉంది. అక్కడ ప్రతిదీ చాలా ఖరీదైనది. ఇక ముంబై గురించి మాట్లాడితే.. ఇక్కడ చాలా చెల్లించాం. కానీ విలువ మాత్రం క్రమంగా తగ్గుతోంది. అందువల్ల ఇక్కడ కొనడం కంటే అద్దెకు తీసుకోవడం బెటర్. రియల్ ఎస్టేట్ పెట్టుబడుల్లో దుబాయ్ అగ్రస్థానంలో ఉంది’ అని చెప్పి ముగించారు.
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles