ఓ ఫ్లాట్ కొనుగోలుదారును మోసం చేసినందుకు ముంబైకి చెందిన ఓ బిల్డర్ పై కేసు నమోదైంది. సదరు బిల్డర్ పై ఇది పదో కేసు కావడం గమనార్హం. శశిసాగర్ కన్సల్టెంట్ కు చెందిన డైరెక్టర్ జయేశ్ తన్నా, ఆయన భార్య శ్రద్ధ, సోదరుడు దీప్ తన్నా, కుమారుడు వివేక్ తన్నాలపై పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. అంధేరీకి చెందిన వ్యాపారవేత్త వినోద్ పంజాబీ 2014లో జయేశ్ చేపట్టిన ప్రాజెక్టు 3 బీహెచ్ కే ఫ్లాట్ బుక్ చేసుకున్నారు. 9వ అంతస్తులో 1200 చదరపు అడుగుల ఫ్లాట్ కోసం రూ.3.3 కోట్లు చెల్లించారు. 2017లో ప్రాజెక్టు పూర్తి చేసి ఫ్లాట్ అప్పగించాలి. కానీ జయేశ్ ఆ పని చేయలేదు. అలాగే స్టాంపు డ్యూటీ నిమిత్తం వినోద్ నుంచి జయేశ్ రూ.17 లక్షలు కూడా తీసుకున్నారు. కానీ స్టాంపు డ్యూటీ చెల్లించలేదు. దీంతో వినోద్ పోలీసులను ఆశ్రయించగా.. ఆ ఫ్లాట్ అప్పటికే మరొకరికి విక్రయించినట్టు తేలింది. దీంతో జయేశ్ పై కేసు నమోదు చేశారు.