poulomi avante poulomi avante

మెట్రో ప్ర‌క‌ట‌న‌.. రియ‌ల్‌ ఉత్సాహ‌మేనా?

హైద‌రాబాద్ రియ‌ల్ రంగాన్ని క్షుణ్నంగా గ‌మ‌నిస్తే.. మెట్రో రైలు ఆరంభ‌మయ్యాకే మియాపూర్‌, ఉప్ప‌ల్‌, ఎల్‌బీన‌గ‌ర్‌, నాగోలు వంటి ప్రాంతాల్లో ఫ్లాట్ల ధ‌ర‌ల‌కు ఒక్క‌సారిగా రెక్క‌లొచ్చేశాయి. ఈ అంశాన్ని అర్థం చేసుకున్నారో ఏమో తెలియ‌దు కానీ, సీఎం రేవంత్‌రెడ్డి మెట్రో రైలు ఏర్పాటుకు సంబంధించి స్ప‌ష్ట‌త‌నిచ్చారు. త‌మ ప్ర‌భుత్వం మెట్రో రైలు నిర్మాణానికి ప్రాధాన్య‌త‌నిస్తుంద‌నే సంకేతాల్ని రియ‌ల్ మార్కెట్‌కి పంపించారు. కాక‌పోతే, ప్ర‌ధాన ప్రాంతాల్ని క‌లుపుతూ మెట్రో నిర్మాణ జ‌ర‌గాల‌ని.. అందుకు త‌గ్గ ప్ర‌తిపాద‌న‌ల్ని సిద్ధం చేయాల‌ని ఆయ‌న ఆదేశించారు. దీంతో, హైద‌రాబాద్‌ రియ‌ల్ మార్కెట్లో కాస్త సానుకూల‌ వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది.

కొత్త సీఎం కాస్త తెలివిగా ఆలోచించారు. మెట్రో నిర్మాణాన్ని కేవ‌లం హెచ్ఎంఆర్ఎల్ మీద వేయ‌కుండా.. హెచ్ఎండీఏ క‌మిష‌న‌ర్‌తో సమ‌న్వయం చేసుకుని కొత్త ప్ర‌తిపాద‌న‌ల్ని సిద్ధం చేయ‌మ‌న్నారు. నగరంలోని ప్రధాన ప్రాంతాలను కలుపుతూ వెళ్లేలా మెట్రోరైలు నిర్మాణం జరగాల‌న్నీరు. హైదరాబాద్ మెట్రోరైలు రెండోదశ, మూడవ దశ విస్తరణ, నిర్మాణంపై స్ప‌ష్ట‌త‌నిచ్చారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగర అవసరాలకు తీర్చడానికి సమగ్ర మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని , ఓఆర్ఆర్ చుట్టు చిన్నాభిన్నమైన ప్రాంతాలను గ్రోత్ హబ్ గా మార్చడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. శ్రీశైలం హైవేపై ఏయిర్ పోర్టు ప్రాంతం నుండి కందుకూరు వరకు మెట్రోరైలు కనెక్టివిటీని కూడా ప్లాన్ చేయాలని సూచించారు. ఇక్కడ ఫార్మా సిటీ కోసం భూములను ఈ ప్రాంతంలో సేకరించడం జరిగిందని అన్నారు. అందువల్లే మెట్రో కనెక్టివిటి అవసరమని అన్నారు. జేబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి శామిర్ పేట్ వరకు, కండ్లకోయ/మేడ్చల్ వరకు మెట్రోరైలు మూడవ దశ విస్తరణ జర‌గాలని ఆకాంక్షించారు.

తెర‌పైకి ఈస్ట్‌, వెస్ట్ మెట్రో రైల్‌!

విజ‌య‌వాడ హైవే మీద గ‌ల తారామతిపేట నుంచి ప‌శ్చిమ హైద‌రాబాద్‌లోని నార్సింగి దాకా మెట్రో రైలును ఏర్పాటు చేసే ప్ర‌తిపాద‌న‌ల్ని సిద్ధం చేయాల‌ని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించిన విష‌యం తెలిసిందే. మూసీ రివ‌ర్ ఫ్రంట్ కారిడార్‌లో భాగంగా ఈస్ట్ మ‌రియు వెస్ట్ కారిడార్‌ను అనుసంధానం చేస్తూ ప్ర‌ణాళిక‌ల్ని సిద్ధం చేయాల‌ని పుర‌పాల‌క శాఖ ముఖ్య‌కార్య‌ద‌ర్శి దాన‌కిశోర్‌, మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డిల‌కు ఆదేశాల‌ను జారీ చేశారు. నాగోల్, ఎంజీబీఎస్ మీదుగా ఈ రూటును ఏర్పాటు చేయ‌మ‌న్నారు. మ‌రి, ఈ మెట్రోను ఎప్పుడు ఆరంభిస్తారో తెలియ‌దు కానీ.. ఇంత‌వ‌ర‌కూ కాస్త స్త‌బ్దుగా ఉన్న పెద్ద అంబ‌ర్‌పేట్ నుంచి చౌటుప్ప‌ల్ దాకా ప్లాట్ల‌కు ఒక్క‌సారిగా డిమాండ్ పెరుగుతుంది. ఇక రియ‌ల్ట‌ర్లు రంగంలోకి దిగి.. అదిగో అక్క‌డే మెట్రో.. అంటూ మూడు పూవులు ఆరు కాయ‌లుగా ప్లాట్ల‌ను అమ్ముకుంటార‌నే విష‌యంలో ఎలాంటి సందేహం లేదు.

శ్రీశైలం హైవేపై ఎయిర్‌పోర్ట్ ప్రాంతం నుండి కందుకూరు వరకు మెట్రో రైలు కనెక్టివిటీని ప్లాన్ చేయాల‌ని సీఎం తెలిపిన విష‌యం తెలిసిందే. ఈ మెట్రో సాకుతో ఆయా ప్రాంతంలో ప్లాట్ల అమ్మ‌కాలు మ‌ళ్లీ పుంజుకునే అవ‌కాశ‌ముంది. ఎందుకంటే, గ‌త నాలుగు నెల‌ల్నుంచి ప్లాట్ల అమ్మ‌కాలు భారీగా త‌గ్గిపోయాయి. వెంచ‌ర్ల‌లో ప్లాట్ల‌ను కొనుక్కునేవారి సంఖ్య త‌గ్గుముఖం ప‌ట్టింది. సీఎం ప్ర‌క‌ట‌న‌తో మ‌ళ్లీ రియ‌ల్ వెంచ‌ర్ల‌కు కాస్త ఊపొస్తుంది. అదేవిధంగా, మెట్రో ఫేజ్-III ప్రణాళికల్ని.. జేబీఎస్‌ మెట్రో స్టేషన్ నుండి షామీర్‌పేట్, కండ్లకోయ/మేడ్చల్ వరకు మెట్రో ఏర్పాటు చేయాల‌ని సీఎం అన్నారు. ఈ దెబ్బ‌కు అటు షామీర్‌పేట్ ఇటు మేడ్చ‌ల్ జాతీయ ర‌హ‌దారికి చుట్టుప‌క్క‌ల మళ్లీ రియ‌ల్ లావాదేవీలు ఊపందుకునే అవ‌కాశ‌ముంది. మొత్తానికి, సీఎం రేవంత్‌రెడ్డి రియ‌ల్ ఎస్టేట్‌కు ఊపును తెచ్చే ప్ర‌క‌ట‌న‌ను వెలువ‌రించ‌డాన్ని ప‌లువురు ప్ర‌మోట‌ర్లు స్వాగ‌తిస్తున్నారు.

ఇవీ ప్ర‌తిపాద‌న‌లు.. (బాక్స్‌)

  • మియాపూర్-చందానగర్-బీహెచ్ఈఎల్-పటాన్ చెరు (14 కిలోమీటర్లు)
  • ఎంజీబీఎస్-ఫలక్ నుమా-చాంద్రాయణగుట్ట-మైలాదేవర్ పల్లి-పీ7 రోడ్డు-ఏయిర్ పోర్టు (23 కిలోమీటర్లు)
  • నాగోల్-ఎల్బీనగర్—ఓవైసీ హాస్పటల్-చాంద్రాయణ గుట్ల-మైలాదేవర్ పల్లి-ఆరాంఘర్-న్యూ హైకోర్టు ప్రతిపాదిత ప్రాంతం రాజేంద్రనగర్ (19 కిలోమీటర్లు)
  • కారిడార్ 3లో భాగంగా రాయదుర్గం నుండి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు (విప్రో జంక్షన్ నుండి/అమెరికన్ కాన్సూలేట్) వయా బయోడైవర్సిటీ జంక్షన్, ట్రిపుల్ ఐటీ జంక్షన్, ఐఎస్బీ రోడ్డు (12 కిలోమీటర్లు)
  • ఎల్బీనగర్ – వనస్థలిపురం-హయత్ నగర్ (8 కిలోమీటర్లు)
    వీటికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసి కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ధి మంత్రి హర్దిప్ సింగ్ పూరికి డ్రాఫ్టు లెటర్ ను సిద్ధం చేసి పంపించాలని పుర‌పాల‌క శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు మెట్రోరైలు ఎండీని ముఖ్యమంత్రి ఆదేశించారు.
  • రాయ‌దుర్గం- ఎయిర్‌పోర్టు స్టాప్‌!
    గత ప్రభుత్వం రాయదుర్గం నుండి శంషాబాద్ ఏయిర్ పోర్టు వరకు రూ.6,250 కోట్లతో నిర్మించతలపెట్టిన 31 కిలోమీటర్ల ఎయిర్ పోర్టు మెట్రో ప్లాన్ ను నిలుపుద‌ల చేశారు. దీనికి బదులుగా ఏయిర్ పోర్టుకు మెట్రోను ఎంజీబీఎస్ వయా ఓల్డ్ సిటీ తోపాటు ఎల్బీనగర్ నుంచి కూడా కనెక్ట్ చేస్తారు. నాగోల్ నుంచి ఎల్బీ నగర్ వరకు గల 5 కిలోమీటర్ల మేర దూరాన్ని క‌లుపుతారు.
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles