హైదరాబాద్‌లో భువనతేజ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ డైరెక్టర్ చక్కా వెంకట సుబ్రమణ్యంను అరెస్టు చేశామని సీసీఎస్ సోమవారం సాయంత్రం వెల్లడించారు. ఆదివారం సాయంత్రం అతన్ని అరెస్టు చేసి.. సోమవారం జ్యుడీషియల్ కస్టడికి పంపించారు. పోలీసుల సమాచారం ప్రకారం.. చక్కా వెంకటసుబ్రమణ్యం శామీర్‌పేట్‌లో హ్యాపీ హోమ్స్ అనే ప్రాజెక్టును ఆరంభించి.. పది మంది కస్టమర్లకు సేల్ డీడ్ అగ్రిమెంట్లు చేశాడు. వారి నుంచి సుమారు రూ.2.29 కోట్లను వసూలు చేశాడు. అయితే, అప్పట్నుంచి అపార్టుమెంట్లను కట్టలేదు. వారి సొమ్మును కూడా వెనక్కి ఇవ్వలేదు. ఇదేవిధంగా, అతను సుమారు నాలుగు వందల మంది కొనుగోలుదారులను మోసం చేశాడని పోలీసుల విచారణలో తేలింది. ఆయా సొమ్మును దుర్వినియోగం చేశాడని.. దీనిపై విచారణ కొనసాగుతుందని సీసీఎస్ డీసీపీ తెలిపారు.
పోలీస్ అఫీషియల్ ప్రకటన: 400 మందిని బయ్యర్లను మోసం చేసిన భువనతేజ ఇన్‌ఫ్రా డెరెక్టర్ అరెస్ట్
Bhuvanteza Director Chakka Venkata Subramanyam Arrested in a pre launch fraud case