poulomi avante poulomi avante

పోచంప‌ల్లిలో గ‌జం రూ. 4 వేల‌కే ప్లాట్లు

  • బాట‌సింగారంలోని లాజిస్టిక్ పార్కుకు స‌మీపంలో..
  • విజ‌య‌వాడ‌- హైద‌రాబాద్ ర‌హ‌దారిపై గ‌ల కొత్త‌గూడెం
    నుంచి దాదాపు 6 కిలోమీట‌ర్ల దూరం..
  • బీబీన‌గ‌ర్ నుంచి పోచంప‌ల్లికి దాదాపు 17 కిలోమీట‌ర్లు
  • అబ్దుల్లాపూర్‌మెట్ గౌరెల్లి నుంచి వ‌యా పోచంప‌ల్లి మీదుగా
    భ‌ద్రాద్రి కొత్త‌గూడెం- ఛ‌త్తీస్‌గ‌ఢ్ దాకా కొత్త జాతీయ ర‌హ‌దారి
  • ఇప్ప‌టికే పూర్త‌యిన మార్కింగ్..
  • త్వ‌ర‌లోనే ప‌నులు ప్రారంభిస్తామ‌ని నితిన్ గ‌డ్క‌రీ వెల్ల‌డి

నేత‌న్న‌కు ప్ర‌ఖ్యాతి గాంచిన భూదాన్ పోచంప‌ల్లి పెట్టుబ‌డుల‌కు స్వ‌ర్గ‌ధామం అన‌డంలో సందేహ‌మే లేదు. ప్ర‌స్తుతం ఇక్క‌డ రియ‌ల్ ఎస్టేట్ మార్కెట్ ప‌రిస్థితి ఎలా ఉందో చూద్దామా..

హైద‌రాబాద్‌- విజ‌య‌వాడ జాతీయ ర‌హ‌దారిపై నున్న అబ్దుల్లాపూర్‌మెట్ మండ‌లంలోని కొత్త‌గూడెం చౌర‌స్తా నుంచి పోచంప‌ల్లి మున్సిపాలిటీ కేంద్రం ప‌ది కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. మున్సిపాలిటీ ప‌రిధి మాత్రం హైవే నుంచి 6 కిలోమీట‌ర్ల‌లోనే మొద‌ల‌వుతుంది. ఇప్ప‌టికే కొత్త‌గూడెం చౌర‌స్తాకు ఆనుకుని ఉన్న బాట‌సింగారంలో పండ్ల మార్కెట్ ఏర్పాటైంది. హైద‌రాబాద్ న‌గ‌రం న‌డిబొడ్డున ఉన్న కొత్తపేట‌లోని ఫ్రూట్ మార్కెట్‌ను తాత్కాలికంగా బాట‌సింగారం త‌ర‌లించారు. దీంతో ఇప్ప‌టికే ర‌ద్దీ మొద‌ల‌యింది. మ‌రోవైపు, బాట‌సింగారంలో గ‌త ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా లాజిస్టిక్ పార్కును ఏర్పాటు చేసింది. అంత‌ర్జాతీయంగా పేరుగాంచిన కంపెనీలు త‌మ భారీ గోదాముల‌ను ఇక్క‌డ ఏర్పాటు చేస్తున్నాయి. ఇప్ప‌టికే ప‌లు కంపెనీలు త‌మ కార్య‌క‌లాపాల్ని ప్రారంభించాయి. మ‌రోవైపు, వ‌రంగ‌ల్- హైద‌రాబాద్ హైవేకు సైతం పోచంప‌ల్లి మున్సిపాలిటీ కేంద్రం 17 కిలోమీట‌ర్లే. అంటే కేవలం నిమిషాల వ్య‌వ‌ధిలోనే చేరుకునేటంత‌ దూర‌మే. వీటికి తోడు మున్సిపాలిటీ కేంద్రం మీదుగా.. కొత్త హైవే వెళ్తుండ‌టంతో ఇక్క‌డ భూముల ధ‌ర‌ల‌కు రెక్క‌లొచ్చే అవ‌కాశం లేకపోలేదు. అందుకే ప్లాట్ల‌లో పెట్టుబ‌డి పెట్టాల‌ని భావించేవారికీ ప్రాంతం ఉత్త‌మం అని చెప్పొచ్చు.

తాజాగా పోచంప‌ల్లిలోని స్వామీ రామానంద‌తీర్థ గ్రామీణ సంస్థ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర‌లేదు. ఇక్క‌డ ఏటా 5 ల‌క్ష‌ల మందికి వివిధ ర‌కాల ఉపాధి,నైపుణ్య శిక్ష‌ణ‌లు ఈ సంస్థ నుంచే ఇచ్చేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం సానుకూల నిర్ణ‌యం తీసుకున్న‌ది. దీంతో పెట్టుబ‌డుల‌కు ఊతం ల‌భిస్తోంది.

స‌ర‌స‌మైన‌ ధ‌ర‌లో ప్లాట్లు

పోచంప‌ల్లి మున్సిపాలిటీతో పాటు మున్సిపాలిటీ వ్యాప్తంగా స‌ర‌స‌మైన ధ‌ర‌ల్లో ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. మున్సిపాలిటీ కేంద్రానికి ఒక‌టి, రెండు కిలోమీటర్ల వ్య‌వ‌ధిలోనే త‌క్కువ ధ‌ర‌ల్లో ప్లాట్లు ఉన్నాయి. మున్సిపాలిటీలో ఎక్కువ‌గా గ్రామ పంచాయ‌తీ లేఅవుట్‌లే కావ‌డం గ‌మ‌నార్హం. వీటిలో ప్ర‌ధాన ర‌హ‌దారి పైనుంచి దూరాన్ని బ‌ట్టి గ‌జం రూ. 3,500 నుంచి 6,500 వ‌ర‌కు అందుబాటులో ఉన్నాయి. డీటీసీపీ లేఅవుట్ల‌లో గ‌జం విలువ రూ. 6 వేల నుంచి 12 వేల వ‌ర‌కు ప‌లుకుతున్నాయి. హెచ్ఎండీఏ లేఅవుట్‌ల‌లో రూ.20 వేల‌కు పైగా గ‌జం ధ‌రలు ప‌లుకుతున్నాయి.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles