- ఆసియ పసిఫిక్ లో 8వ స్థానంలో బెంగళూరు
- 9వ స్థానంలో ముంబై.. నైట్ ఫ్రాంక్ వెల్లడి
ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని ఇళ్ల ధరల పెరుగుదలలో బెంగళూరు జోరు కనబరుస్తోంది. 2023 ద్వితీయార్ధంలో ధరల పెరుగుదలకు సంబంధించి ఈ ప్రాంతంలోని టాప్ టెన్ లో బెంగళూరు 8వ స్థానంలో ఉండగా.. ముంబై 9వ స్థానంలో ఉంది. వార్షికవారీ పెరుగుదల చూస్తే బెంగళూరు 7.1 శాతం, ముంబై 7 శాతం వృద్ధిని కనబరిచాయని నైట్ ఫ్రాంక్ తన నివేదికలో వెల్లడించింది. ఇక ఢిల్లీ-ఎన్సీఆర్ 6 శాతం వృద్ధితో 11వ స్థానంలో ఉంది. రెసిడెన్షియల్ రివ్యూ ఇండెక్స్ వివరాల ప్రకారం. 2023లోని భారతీయ మార్కెట్లో మొత్తం అమ్మకాల్లో ముంబై, ఢిల్లీ, బెంగళూరు 60 శాతం వాటా కలిగి ఉన్నాయి. అలాగే 2023 ద్వితీయార్ధంలో లాంచ్ లలోనూ బెంగళూరు ముందంజలో ఉంది. ఇక ఇక్కడ 2023 ద్వితీయార్ధంలో 27,799 యూనిట్ల విక్రయాలు జరగ్గా.. చదరపు అడుగుకు సగటు ధర రూ.5,900 పలికింది. దసరా, దీపావళి వంటి పండగ సమయాల్లో డిమాండ్ పెరగడం వల్ల ముంబై కూడా ప్రాపర్టీ అమ్మకాల్లో పురోగతి సాధించింది. ఇక్కడ 2023 ద్వితీయార్ధంలో 46,073 యూనిట్ల విక్రయాలు జరిగాయి. సగటున చదరపు అడుగుకు రూ.7,883 ధర పలికింది. ఢిల్లీ-ఎన్సీఆర్ విషయానికి వస్తే ఇక్కడ చదరపు అడుగు సగటు ధర రూ.4,579గా పలికి 29,888 యూనిట్లు విక్రయమయ్యాయి. ఆసియా పసిఫిక్ రెసిడెన్షియల్ రివ్యూ ఇండెక్స్ ప్రకారం ఏపీఏసీలోని 25 నగరాల్లో 21 నగరాలు సానుకూల వార్షిక వృద్ధిని నమోదు చేశాయి. సింగపూర్ 13.7 శాతం పెరుగుదలతో జాబితాలో టాప్ లో ఉంది. హాకాంగ్ జాబితాలో అట్టడుగున ఉంది.