హఫీజ్‌పేట్ సర్వే నెంబర్ 80లో బిల్డాక్స్ అనే నిర్మాణ సంస్థ కడుతున్న అపార్టుమెంట్లకు అనుమతి లేదని.. కాబట్టి, వాటిలో ఎవరూ కొనుగోలు చేయకూడదని.. ఒక పత్రిక ప్రకటనను విడుదల చేసి.. టీఎస్ రెరా చేతులు దులిపేసుకుందా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మై హోమ్ మంగళ ముందు.. సుప్రీం కోర్టులో కేసున్న భూమిలో ప్రీలాంచ్‌లో ఫ్లాట్లను విక్రయిస్తూ.. కోట్ల రూపాయల్ని వసూలు చేసిన ఈ సంస్థపై టీఎస్ రెరా ఎలాంటి చర్యల్ని తీసుకోకుండా వదిలి వేయడమేమిటి? అని ఇళ్ల కొనుగోలుదారులూ నిలదీస్తున్నారు. టీఎస్ రెరా ప్రకటన విడుదల చేసిన మరుసటి రోజే.. కొందరు ఏజెంట్లు బిల్డాక్స్‌లో ఫ్లాట్లను కొనమంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దీన్ని బట్టి చూస్తుంటే.. బిల్డాక్స్ సంస్థ టీఎస్ రెరా అథారిటీని కూడా పెద్ద లెక్క చేయట్లేదని సమాచారం. బీఆర్ఎస్ ప్రభుత్వం హయంలో రెరా సీరియస్‌గా లేదనే విషయం తెలిసిందే. కనీసం కాంగ్రెస్ పాలనలో అయినా.. ఇలాంటి అక్రమ నిర్మాణ సంస్థలపై సీఎం రేవంత్ రెడ్డి గట్టి చర్యల్ని తీసుకోవాలి.