హైదరాబాద్ తర్వాత హన్మకొండలో అపార్టుమెంట్ల నిర్మాణం అధికంగా జరుగుతోంది. ఇక్కడి కొన్ని ప్రాంతాల్లో ఫ్లాట్ల ధరలూ భాగ్యనగరంతో సమానంగానే ఉన్నాయి. అడ్వొకేట్స్ కాలనీలో ఓ 1200 చదరపు అడుగుల్లో ఫ్లాట్ కొనాలంటే కనీసం రూ.70 లక్షలు చేతిలో ఉండాల్సిందే. ఫాతిమానగర్లో కొనాలంటే రూ. 60 లక్షలు పట్టుకోవాల్సిందే. పుప్పాల్ గుట్ట, బ్యాంక్ కాలనీ, బీమారం వైపు రేట్లు కాస్త అందుబాటులో ఉన్నాయని చెప్పొచ్చు. మరి, పలు ప్రాంతాల్లో ఫ్లాట్ల ధరలెలా ఉన్నాయంటే..
అడ్వొకేట్స్ కాలనీ | 4500-5000 |
ఫాతిమానగర్ | 4000- 4600 |
ప్రశాంత్ నగర్ | 3800- 4500 |
వడ్డేపల్లి | 3800- 4500 |
హంటర్ రోడ్డు | 4200- 4500 |
బీమారం | 3600- 4200 |
సుబేదారి | 4000- 4600 |
డాక్టర్స్ కాలనీ | 3800- 4500 |
దేశాయిపేట్ రోడ్డు | 3500- 3900 |
గోపాల్ పూర్ రోడ్డు | 3500- 4400 |
బ్యాంక్ కాలనీ | 3600- 4000 |
పుప్పాల్ గుట్ట | 3200- 3600 |
కాజీపేట్ | 3800- 4400 |
కిషన్ పురా | 4000- 4600 |
(చదరపు అడుక్కీ)
ప్లాట్ల ధరలిలా ఉన్నాయ్..
బాలసముద్రం,అడ్వకేట్స్ కాలనీ, వడ్డేపల్లి టీచర్స్ కాలనీ, కూడా కాలనీ ప్రాంతాల్లో వంద అడుగుల రోడ్డులో ప్లాట్లు ఉన్నాయి. అందుకే, ఇక్కడ రేటు హైదరాబాదు తర్వాతి స్థాయిలో ఉంటాయి. హన్మకొండ చుట్టుపక్కల పలు ప్రాంతాల్లో ప్లాట్ల ధరలు గణనీయంగా పెరిగాయి. ఒక ప్రాంతంలో మౌలిక సదుపాయాలు, ఆయా ప్రాంతం నగరానికి ఎంత చేరువగా ఉంది? అక్కడ అందుబాటులో ఉన్న ఖాళీ ప్లాట్లు వంటి అంశాల ఆధారంగా ప్లాట్ల తుది ధర ఆధారపడుతుంది. ఇవి కేవలం అవగాహన కోసమేనని గుర్తుంచుకోండి. అంతేతప్ప, ఇవే తుది రేట్లు కావు.
బాల సముద్రం | 48000- 50000 |
అడ్వొకేట్స్ కాలనీ | 50000- 54000 |
కుడా కాలనీ | 40000- 45000 |
వడ్డేపల్లి | 35000- 40000 |
కాజీపేట్ | 20000- 25000 |
గోపాల్ పురం | 35000-40000 |
బీమారం | 30000- 35000 |
హంటర్ రోడ్డు | 30000- 36000 |
నర్సంపేట్ రోడ్డు | 25000- 30000 |
హసన్ పర్తి | 15000-20000 |
మడికొండ | 20000- 25000 |
(చదరపు గజానికి)
– VORAM NATRAJ SUNDER, 76740 08199 (regnews21@gmail.com)