తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు 1 నుంచి మార్కెట్ విలువల్ని పెంచుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఒక రోడ్ మ్యాప్‌ను ఇటీవల విడుదల చేసింది. ఇదే అంశంపై కొంతమంది బిల్డర్లు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీని సంప్రదించారని తెలిసింది. మార్కెట్ విలువలను ఇష్టం వచ్చినట్లు కాకుండా.. వాస్తవిక పరిస్థితులకు అద్దం పట్టేలా పెంచాలని వినతి పత్రం అందజేశారని సమాచారం. అదేవిధంగా, కాంపొజిట్ వ్యాల్యూనూ పెంచొద్దన విజ్ఞప్తి చేశారని తెలిసింది.
ఇది చేస్తే గనక.. స్టాండ్ ఎలోన్ అపార్టుమెంట్లను కొనేవారి మీద భారం పడుతుందని.. కాబట్టి, వాస్తవిక పరిస్థితుల్ని అర్థం చేసుకుని పెంచాలని కోరినట్లు సమాచారం. ఏదీఏమైనా, రెవెన్యూ శాఖ దీనిపై ఎలా స్పందిస్తుందో తెలియాలంటే ఆగస్టు 1 వరకూ వేచి చూడాల్సిందే.