అటవీ ప్రాంతాల్లో ఫామ్ హౌజ్‌లు, అక్రమ నిర్మాణాల్ని చేపట్టకూడదని సుప్రీం కోర్టు ఇటీవల ఆదేశించింది. పైగా, ఇంతవరకూ అక్రమంగా నిర్మించిన వాటిని తొలగించాలని తెలియజేసింది. ఇందుకోసం నాలుగు వారాల గడువునిచ్చింది. aravali forest అరావలీ అటవీ ప్రాంతాల్లో సుమారు పది వేల అక్రమ కట్టడాలున్నాయని గుర్తించిన సుప్రీం కోర్టు.. వాటిని ఆరు వారాల్లో తొలగించి నివేదికను సమర్పించాలని హర్యానా, ఫరీదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లను ఆదేశించింది. మరి, మన తెలుగు రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో వెలసిన అక్రమ కట్డడాల పరిస్థితి ఏమిటి? వాటిని స్థానిక సంస్థలు తొలగించే ప్రయత్నం చేస్తాయా?